కోవిడ్ వ్యాక్సిన్లకు గుండెపోటుకు సంబంధం లేదు

భారతదేశంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది కోవిషీల్డ్, కోవ్యాక్సిన్, వంటి మరిన్ని వ్యాక్సిన్లు వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే చాలామంది గుండెపోటుకు గురై చనిపోవడం కలవరం రేపింది. అందుకనే ఎక్కువ అవుతున్న గుండెపోటులకు గల కారణాలు గురించి ఒక రీసెర్చ్ చేయడం జరిగింది.  వ్యాక్సిన్లకు గుండెపోటుకు సంబంధం లేదు:  రీసెర్చ్ నిర్వహించిన స్టడీ ప్రకారం, కోవిడ్ వ్యాక్సినేషన్ కు అదే విధంగా అకాల మరణాలకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీలోని జిబి ప్యాంట్ […]

Share:

భారతదేశంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది కోవిషీల్డ్, కోవ్యాక్సిన్, వంటి మరిన్ని వ్యాక్సిన్లు వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే చాలామంది గుండెపోటుకు గురై చనిపోవడం కలవరం రేపింది. అందుకనే ఎక్కువ అవుతున్న గుండెపోటులకు గల కారణాలు గురించి ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. 

వ్యాక్సిన్లకు గుండెపోటుకు సంబంధం లేదు: 

రీసెర్చ్ నిర్వహించిన స్టడీ ప్రకారం, కోవిడ్ వ్యాక్సినేషన్ కు అదే విధంగా అకాల మరణాలకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీలోని జిబి ప్యాంట్ హాస్పిటల్ లో, ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2022 మధ్యలో అడ్మిట్ అయిన పేషెంట్ల జాబితాను రీసెర్చ్ ఉపయోగించుకుంది. అందులో మొత్తం 1,578 మంది ఉండగా, అందులో 1,086 మంది అంటే 98.8 కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మిగిలిన 492 అంటే 31.2 కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేని వాళ్ళు. 

మొత్తం 1,047 మంది రెండు కరోనా వ్యాక్సిన్ డోసులు వేసుకోగా, మిగిలిన 39 మంది కేవలం సింగల్ డోస్ వేసుకున్నారు. అయితే ఆ హాస్పటల్ నుంచి తీసుకున్న డేటా ప్రకారం రీసెర్చ్ నిర్వహించడం జరిగింది.అయితే భారతదేశం వంటి పెద్ద దేశాలలో వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం చాలామందికి గుండెపోట్లు వచ్చి చనిపోతున్నట్లు వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు రీసెర్చ్ అన్నది నిర్వహించడం జరిగింది. రీసెర్చ్ చేసిన తర్వాత కరోనా సమయంలో వేసుకున్న వ్యాక్సిన్లకు కరోనా అనంతరం వాటిల్లుతున్న గుండెపోట్లకు సంబంధం లేనట్లు తెలిసింది. 

అంతేకాకుండా వ్యాక్సిన్ వేయించుకున్న వారితో పోలిస్తే, వ్యాక్సిన్ వేయించుకోలేని వారిలోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు తెలిసింది. ఇంకా చెప్పాలంటే వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో మరణాల రేటు చాలా వరకు తగ్గింది అని కూడా ఈ రీసెర్చ్ పేర్కొంది. 

మరణాలకి ఇది కారణం కావచ్చు: 

వ్యాక్సిన్ వేయించుకోవడం వల్లే చాలామంది చనిపోతున్నారు అని అపోహను దూరం చేసేందుకు ఈ రీసెర్చ్ చాలా బాగా పని చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రీసెర్చ్ ద్వారా వెళ్లడైనా నిజాల కారణంగా చాలామంది భయాన్ని దూరం చేసుకుంటారని రీసెర్చ్ చేసినవారు అభిప్రాయపడుతున్నారు. 

ఇక సంభవిస్తున్న అధిక మరణాలకు గల కారణం డయాబెటిక్స్, ధూమపానం, మద్యపానం, వృద్ధాప్యం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నిర్వహించిన మొట్టమొదటి రీసెర్చ్ ప్రకారం, వ్యాక్సిన్ వేసుకున్న వారితో పోలిస్తే వ్యాక్సిన్ వేసుకోలేని వారిలోనే అధిక మొత్తంలో మరణాలు సంభవిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా వ్యాక్సిన్ వేయించుకునే వారిలో ఇమ్యూనిటీ పవర్ కూడా అధికంగా ఉందని కూడా తేలింది. 

ప్రస్తుతం నిర్వహించిన రీసెర్చ్ కు సంబంధించి మరింత లోతుగా రీసెర్చ్ జరిగే అవకాశం ఉంటుందని, ఇప్పటివరకు రీసెర్చ్ ప్రకారం తెలిసిన విషయాలను మరింత బాగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది అంటున్నారు మరికొందరు. 

ఇటీవల రీసెర్చ్ స్టార్ట్ చేసిన ICMR : 

ఇటీవల కాలంలో ఎంతోమంది హఠాత్తుగా మరణించడం చాలామంది చూస్తున్నాం. కరోనా సోకిన పేషంట్లలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి ఇప్పటికి క్లారిటీ లేదు. దీని గురించి తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, రెండు అధ్యాయాలు చేయనుంది. ముఖ్యంగా యువత కోవిడ్ అనంతరం ఎందుకు హఠాత్ మరణాలకు గురవుతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే రీసెర్చ్ లో భాగంగా ముఖ్య కారణాలు తెలుసుకుని మరిన్ని మరణాలను నిరోధించవచ్చు అని నివేదికలో పేర్కొంది ఐసిఎంఆర్.