ఇండియాకి ఇక కరోనా ముప్పు పోయినట్టేనట! గణనీయంగా తగ్గిపోతున్న కేసులు!

గడిచిన రెండు మూడు సంవత్సరాలలో ఈ ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి ఎలా కబళించిందో, ఎంతమంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక మన ఇండియాలో కూడా ఈ మహమ్మారి ప్రభావం మామూలుది కాదు, ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి నష్టం కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగింది. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి ప్రభావం వల్ల కొన్ని రంగాలు పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అయితే మూడు వేవ్స్ గా కొనసాగిన ఈ మహమ్మారి […]

Share:

గడిచిన రెండు మూడు సంవత్సరాలలో ఈ ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి ఎలా కబళించిందో, ఎంతమంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక మన ఇండియాలో కూడా ఈ మహమ్మారి ప్రభావం మామూలుది కాదు, ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి నష్టం కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగింది. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి ప్రభావం వల్ల కొన్ని రంగాలు పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అయితే మూడు వేవ్స్ గా కొనసాగిన ఈ మహమ్మారి విజృంభణ వల్ల మన భారతదేశంలో 531369 మంది చనిపోయారు. ఇందులో అధిక శాతం మంది సెకండ్ వేవ్ లో చనిపోయిన వాళ్ళే ఉన్నారు. అంతటి విధ్వంసం సృష్టించిన ఈ మహమ్మారి ఇప్పుడు శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మహమ్మారి వచ్చి వెళ్ళిందనే విషయాన్నే మర్చిపోయి కాలాన్ని గడుపుతున్నారు. అయితే, అలా మర్చిపోయిన ప్రతీసారి “నేను ఇంకా బ్రతికే ఉన్నాను” అని గుర్తు చేస్తూ ఉంటుంది ఈ కరోనా మహమ్మారి.

ఈ మధ్య కాలంలో ఇండియాలో క్రమంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ రావడం ప్రజలను కాస్త కంగారుకి గురి చేసింది. అయితే ఇప్పుడు అందరూ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల రిజిస్టర్ అయిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 61013 నుండి 57410 కి తగ్గిపోయింది. ఈ విషయాన్ని యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా అధికారికంగా మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు 5.38 శాతం కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, ప్రతీ వారం యావరేజిగా 5.61 శాతం కేసులు నమోదు అవుతున్నాయని ఈ సందర్భంగా నడ్డా మీడియాకి తెలిపారు. అంతే కాదు గడిచిన మూడేళ్ళలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల 49 లక్షల కోవిడ్ కేసులు నమోదు అయ్యాయని, అయితే ప్రస్తుతం నమోదు అవుతున్న రోజు వారి కేసులలో 0.13 శాతం కేసులు తగ్గాయని మరియు రికవరీ రేట్ 98 శాతానికి పైగానే ఉంటుందని మినిస్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇక కోవిడ్ డోసులు ఎంతో మేలు చేశాయనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో మెచ్చుకోక తప్పదు. అయితే, ఆరోగ్య శాఖా మంత్రి లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఇండియాలో కేవలం కోవిడ్ డోసుల కోసం 220 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇదంతా బాగానే ఉంది కానీ, నిన్న ఢిల్లీలో కరోనా కారణంగా 7 మంది చనిపోవడం అందరినీ కలవర పెడుతున్న విషయం. గడిచిన 24 గంటల్లో 1040 ఫ్రెష్ కరోనా కేసులు కేవలం ఢిల్లీ సిటీ నుండే నమోదు అయ్యాయని, అలాగే మొత్తం మీద ఇప్పటి వరకు 4915 శాంపుల్స్ తీసుకుంటే అందులో గడిచిన 24 గంటల్లో 1320 పేషెంట్స్ కరోనా నుండి కోలుకున్నారని సమాచారం. మొదటి వేవ్ కూడా ఇలా గతంలో ఢిల్లీ నుండి ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడి నుండి ప్రారంభమై దేశం మొత్తం వ్యాప్తి చెందింది. మూడు దశల్లో వేర్వేరు కరోనా వేవ్స్ ఏర్పడి లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది ఆ మహమ్మారి. మళ్ళీ అలాంటి విపత్తు రాబోతోందా..?, అనే భయం అందరిలో నెలకొంది. అయితే కరోనా కేసులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయని, ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ ధైర్యంగా ఉండాల్సిందిగా హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.