ట్రావెల్ వ్లాగ్స్ ద్వారా చిక్కిన దొంగ

ఈ మధ్యకాలంలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కానీ ఎంత పక్కా ప్లాన్ వేసినప్పటికీ, దొంగతనం చేసినవాడు పోలీసులకు దొరికిపోవడం జరుగుతోంది. ఈ క్రమంలోనే, న్యూఢిల్లీలోని నివాసంలో చోరీకి పాల్పడిన ఒక దొంగను, దొంగతనం జరిగిన నెల తర్వాత పోలీసులు ఆగ్రాలో పట్టుకున్నారు. అతని ట్రావెల్ వ్లాగ్‌లను ఉపయోగించి పోలీసులు అతని కార్యకలాపాలను ట్రాక్ చేసిన తర్వాత అరెస్టు చేయడం జరిగింది. జరిగిన విషయం:  జులై 11న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని నివాసంలో దోపిడి చేసిన దొంగను బిందాపూర్‌కు […]

Share:

ఈ మధ్యకాలంలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కానీ ఎంత పక్కా ప్లాన్ వేసినప్పటికీ, దొంగతనం చేసినవాడు పోలీసులకు దొరికిపోవడం జరుగుతోంది. ఈ క్రమంలోనే, న్యూఢిల్లీలోని నివాసంలో చోరీకి పాల్పడిన ఒక దొంగను, దొంగతనం జరిగిన నెల తర్వాత పోలీసులు ఆగ్రాలో పట్టుకున్నారు. అతని ట్రావెల్ వ్లాగ్‌లను ఉపయోగించి పోలీసులు అతని కార్యకలాపాలను ట్రాక్ చేసిన తర్వాత అరెస్టు చేయడం జరిగింది.

జరిగిన విషయం: 

జులై 11న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని నివాసంలో దోపిడి చేసిన దొంగను బిందాపూర్‌కు చెందిన సంజీవ్‌గా గుర్తించారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో బంగారం, వెండి విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని ఇంటి యజమాని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

విచారణ సమయంలో, అధికారులు సమీపంలోని అక్కడక్కడ ఉన్న CCTV ఫుటేజీని పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలోనే, ఫిర్యాదుదారు ఇంటి నుండి, సంజీవ్ బయటకు వెళ్లడం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. 29 ఏళ్ల సంజీవ్ అనే దొంగ లోకేషన్ అనేది చివరిగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో లభించింది. అంతే కాకుండా, పోలీసులు చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆ దొంగ చాలా సేపు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంచాడు.

నిందితుడు సంజీవ్ నేరం చేసిన తర్వాత జీవన్ పార్క్‌లోని గోల్డ్ లోన్ దుకాణానికి వెళ్లినట్లు సమాచారం. పోలీసు బృందం గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్లేసరికి, నిందితులు రెండు బంగారు ఉంగరాలను తాకట్టు పెట్టాడని మరియు రూ. 20,000 నగదును లోన్ రూపంలో తీసుకున్నాడని, ఈ విషయాలు తమకు తెలిసిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) ఎం హర్షవర్ధన్ తెలిపారు. అయితే అయితే క్రమంలో, దొంగతనం చేసిన తర్వాత నుంచి  సంజీవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రావెల్ వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్నాడు.

డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు సంజీవ్ కేరళకు వచ్చి తన ఎకౌంట్ ద్వారా మరో వ్లాగ్ అప్‌లోడ్ చేశాడు. ఆ తర్వాత టీమ్‌ను మోసం చేసే ప్రయత్నంలో నిందితుడు తాను ఉద్యోగ ప్రయత్నాల రిత్యా దుబాయ్‌కి వెళ్తున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. సంజీవ్ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్నానని పేర్కొన్న మరో వ్లాగ్‌ను పోస్ట్ చేశాడు. వీడియోను క్షుణ్ణంగా చూసిన తర్వాత, అతడు ఈ-రిక్షాలో ఆగ్రాలోని ఈద్గా రోడ్డు వైపుగా వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. పోలీసులు ఆగ్రా చేరుకున్న అనంతరం, దొంగ సంజీవ్ ని అరెస్టు చేయడానికి ముందు ఈద్గా రోడ్‌లోని అన్ని హోటళ్లలో సోదాలు చేశారని వర్ధన్ చెప్పారు.

అయితే దొరికిన దొంగ సంజీవ్ దగ్గర మొత్తం రూ.16వేలు లభ్యమయ్యాయి. ఈ కేసులో, సహరాన్‌పూర్‌లో నివసిస్తున్న అబ్దుల్ మాలిక్ తన వద్ద పట్టుబడ్డాడు. దొంగిలించిన నగలను అబ్దుల్ మాలిక్ సంజీవ్ నుంచి కొనుగోలు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతని దగ్గర నుంచి ఇప్పటికే నగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 

దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి: 

ఎక్కడ చూసినా ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. సీసీటీవీ కెమెరాలు ఇంటి చుట్టూ అమరుస్తున్నప్పటికీ, ఆఫీసులు చుట్టూ అమరుస్తున్నప్పటికీ, దొంగలు మాత్రం తాము చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నారు, డబ్బును దోచుకుని పోతూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు బయట చల్లగా ఉందని పడుకోగా, హఠాత్తుగా దొంగలు వచ్చి వారిని నిద్రలో నుంచి లేపి మరి, ఇంటి తాళాలు, బీరువా తాళాలు తీసుకొని, వారి కళ్ళ ముందే వారి కొన్నదంతా దోచుకుని పోయారు దొంగలు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయినప్పటికీ, ప్రస్తుతం ఆ దొంగల గురించి ఇంకా వేటాడుతూనే ఉన్నారు పోలీసులు.. అందుకే జాగ్రత్త, నిద్రపోతున్నప్పుడు తలుపులన్నీ జాగ్రత్తగా వేసుకొని, తాళాలు వేసుకుని, నిద్రపోవడం మేలు అంటున్నారు పోలీసులు.