ఆత్మహత్య చేసుకోబోయిన అమ్మాయిని కాపాడిన పోలీసులు

ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నా సందర్భాలు చూస్తున్నాం. ఇలాంటి ఒక సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక కాలేజ్ స్టూడెంట్ దుర్గమ్మ చెరువులోని పడి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సమయానికి అక్కడికి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయిని కాపాడడం జరిగింది.  ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయి:  హైదరాబాద్ లోని కెపిహెచ్బి ప్రాంతంలో నివాసం ఉంటున్న కాలేజీ చదువుతున్న ఒక అమ్మాయి మనస్థాపనతో ఆత్మహత్య చేసుకోవడానికి […]

Share:

ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నా సందర్భాలు చూస్తున్నాం. ఇలాంటి ఒక సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక కాలేజ్ స్టూడెంట్ దుర్గమ్మ చెరువులోని పడి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సమయానికి అక్కడికి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయిని కాపాడడం జరిగింది. 

ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయి: 

హైదరాబాద్ లోని కెపిహెచ్బి ప్రాంతంలో నివాసం ఉంటున్న కాలేజీ చదువుతున్న ఒక అమ్మాయి మనస్థాపనతో ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకుంది. కాలేజీ చదువుతున్న ఆ అమ్మాయి ఎక్కువగా మొబైల్ ఫోన్ చూస్తున్నందువలన, తన తల్లికి కోపం వచ్చి గట్టిగా తిట్టి ఫోను ఎక్కువగా వాడొద్దు అంటూ మందలించింది. అయితే తన అమ్మ తనని ఫోను ఎక్కువగా వాడొద్దు అంటూ తిట్టడాన్ని తట్టుకోలేని ఆ అమ్మాయి మనస్థాపానికి గురై మరుసటి రోజు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. 

అయితే తర్వాత ఆ అమ్మాయి కాలేజీకి వెళ్లలేనట్లు తన తల్లికి తెలిసింది. వెంటనే హోట హోటన తన తల్లి తన కూతురు గురించి జరిగినదంతా చెప్పి కేపిహెచ్బి పోలీస్స్టేషన్లో చెప్పి కనిపించట్లేదు అంటూ ఫిర్యాదు చేసింది. అయితే విషయాన్ని అర్థం చేసుకున్న కేపిహెచ్బి పోలీసులు కొన్ని టెక్నికల్ క్లూస్, అదేవిధంగా అమ్మాయి గురించి గుర్తులన్నీ సేకరించి వెంటనే రంగంలోకి దిగారు. అయితే కాలేజీకి వెళ్లాను అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి ఆ అమ్మాయి దుర్గం చెరువుకి వెళ్లినట్లు తెలిసింది అప్పుడు వెంటనే కెపిహెచ్బి పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి అలర్ట్ చేశారు. అయితే ఆ దుర్గమ్మ చెరువు పరిసరాల్లో ఉన్న పోలీసులు అదేవిధంగా ఐటీ టీం తో కలిసి ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టారు. 

అయితే అప్పటికే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి దుర్గమ్మ చెరువులో దూకేసినట్టు తెలిసింది. అయితే ఆ అమ్మాయి ఉన్నచోటిని కనిపెట్టి వెంటనే తనని బోట్ల ద్వారా కాపాడటం జరిగింది. అనంతరం ఆ అమ్మాయిని తమ కుటుంబ సభ్యులకి అప్పగించారు. 

శభాష్ పోలీస్: 

అయితే ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీస్ వారిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టేఫెన్ రవీంద్ర అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులు జి శ్రీశైలం, నవీన్, మహమ్మద్ రహమత్ అలీ, బి కృష్ణయ్య. 

అయితే చిన్న చిన్న విషయాలలో ప్రస్తుతం ఉన్న పిల్లలు ఎక్కువగా పట్టించుకుంటున్నారు. తన తల్లి తిట్టిందని, నాన్న మందలించాడని, తమ్ముడు కొట్టాడని.. ఇలా చిన్నచిన్న విషయాలకి ఆత్మహత్యలు వరకు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రాణం విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొబైల్ ఫోన్ వాడింది అని, చదువుని పక్కన పెడుతుందేమో అని భయపడిన తల్లి తన కూతురిని కాస్త మందలించడంలో తప్పులేదు. 

కానీ మొబైల్ ధ్యాసలో పడి, ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకోవాలి అనుకోవడం మహా పెద్ద తప్పు. మనల్ని చిన్నతనం నుంచి ఎంతో ప్రయోజకుల్ని చేయాలి అంటూ ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుతున్న తల్లిదండ్రులకు, చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ కడుపుకోతను మిగులుస్తున్నారు పిల్లలు. పిల్లలు కూడా ఇలాంటి విషయాలను గ్రహించాలి. అంతే కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఒక చక్కని అవగాహన కల్పించాలి. ఇలాంటివి చేయడం ద్వారా పిల్లలలో ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచన కూడా దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.