మధ్యప్రదేశ్ లో అత్యాచారం, వీధుల్లో బాధితురాలు ఆర్తనాదాలు

మధ్యప్రదేశ్ లోని ఘోర అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఉజ్జయిని ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మైనర్ అత్యాచారానికి గురై, అర్ధ నగ్నంగా, బ్లీడింగ్ అవుతున్నప్పటికీ.. ఇంటింటికి తిరుగుతూ తనని కాపాడమంటూ ఆర్తనాదాలు చేసిన సంఘటన రికార్డ్ అయింది. అయితే తనని కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ, తమ ఇళ్ల దగ్గర నుంచి వెళ్ళిపోమంటూ ప్రతి ఒక్కరూ వెళ్లగొట్టారు. కొంతమంది 50-100 రూపాయలు దానం చేశారు.  ఘోర అత్యాచారం:  అత్యాచారానికి గురై, బ్లీడింగ్ అవుతున్న ఒక మైనర్ బాలిక […]

Share:

మధ్యప్రదేశ్ లోని ఘోర అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఉజ్జయిని ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మైనర్ అత్యాచారానికి గురై, అర్ధ నగ్నంగా, బ్లీడింగ్ అవుతున్నప్పటికీ.. ఇంటింటికి తిరుగుతూ తనని కాపాడమంటూ ఆర్తనాదాలు చేసిన సంఘటన రికార్డ్ అయింది. అయితే తనని కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ, తమ ఇళ్ల దగ్గర నుంచి వెళ్ళిపోమంటూ ప్రతి ఒక్కరూ వెళ్లగొట్టారు. కొంతమంది 50-100 రూపాయలు దానం చేశారు. 

ఘోర అత్యాచారం: 

అత్యాచారానికి గురై, బ్లీడింగ్ అవుతున్న ఒక మైనర్ బాలిక సహాయం కోరుతూ ఇంటింటికీ వెళ్లి సహాయం అందక వెనతిరిగిన సంఘటన కలిచివేస్తుంది, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఒక ప్రాంతంలో సెక్యూరిటీ ఫుటేజీ, విస్తుపోయే సంఘటనకు ఆధారంగా మారింది. తనని కాపాడమంటూ అడుగుతున్నప్పటికీ నివాసితులు, 15 ఏళ్ల వయస్సు గల బాలికకు సహాయం చేయడానికి నిరాకరించారని, ఆ ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది ఆమెకు కేవలం డబ్బు సహాయం చేశారని, మొత్తం ₹ 120 బాలిక దగ్గర ఉన్నట్టు చెప్పుకొచ్చారు ఉజ్జయిని పోలీసు చీఫ్ సచిన్ శర్మ.

అయితే, అత్యాచారానికి గురైన బాలిక ఆర్తనాదాలు చేస్తూ ఇంటింటికి వెళ్లడమే కాకుండా, ఒక టోల్ ప్లాజా కూడా దాటిన క్రమం కనిపిస్తుంది. అయితే అక్కడ కొంతమంది కనికరించి 50 రూపాయలు, 100 రూపాయలు.. కొంతమంది ఇవ్వగా, మరి కొంతమంది కొన్ని బట్టలు కూడా ఇచ్చారని.. కనీసం 7-8 మంది సహాయం చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పుకొచ్చారు ఆఫీసర్.

అత్యాచారం చేసింది ఎవరు?: 

నిజానికి బాలికపై ఘోరమైన అత్యాచారం జరిగిన అనంతరం, గుర్తు తెలియని వ్యక్తి ఆమెను వెంబడించి తరిమి కొట్టినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఆమె చివరకు ఒక ఆశ్రమంలో సహాయం పొందింది, అక్కడ ఒక పూజారి, మైనర్ బాధితురాలికి బట్టలు ఇచ్చి పోలీసులను పిలిచాడు. ఇరవై నిమిషాల తరువాత, పోలీసులు వచ్చారు.. అనంతరం ఆమెను హాస్పిటల్ కు తరలించడం జరిగింది.

సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, వీడియో ప్రకారం ఈ విషయాన్ని ట్రాక్ చేయడం జరిగిందని.. బాధితురాలు ఏ ప్రాంతంలోనైతే ఆర్తనాదాలు చేసుకుంటూ, ఇంటింటికి వెళ్లి సహాయం కోరిందో, ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని అడిగినట్లు, సమాచారం తెలుసుకున్నట్లు తెలిపారు. అయితే ఆ మైనర్ బాలికను తరుముకొంటూ వచ్చిన వ్యక్తి గురించి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో ఆ బాలికకు నగదు కంటే వైద్యసేవలు ఎక్కువ అవసరమని మాట్లాడారు, అధికారి సచిన్ శర్మ. అయితే అక్కడ ప్రజలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ.. కొంతమంది బాలికకు సహాయం చేసేందుకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించారు అని చెప్పారు అధికారి.

బాలిక ప్రత్యేకంగా సహాయం కోరడం లేదని, ప్రజలను సంప్రదించి తనను ఎవరో అనుసరిస్తున్నట్లు చెప్పిందని అధికారి తెలిపారు.’నేను ప్రమాదంలో ఉన్నాను, నా వెనుక ఎవరో ఉన్నారు’ అని ఆమె పదేపదే చెబుతున్నట్లు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాసులు చెప్పారని.. ఆమె అడిగిన దాని ప్రకారం, ఆమె కాస్త స్థిరంగా లేనట్లు కనిపించగా, ఆమెకు తగినట్టుగా నివాసితులకు కూడా స్పందించి ఉంటారని పోలీసులు భావించారు.

తీవ్ర గాయాలపాలైన బాలిక పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. బాలిక విషయానికి వస్తే…ఉజ్జయినికి 700 కి.మీ దూరంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని మరో జిల్లాకు చెందినదని పోలీసులు గుర్తించారు. తాతయ్య, అన్నయ్యతో కలిసి అక్కడే ఉంటోంది. ఆదివారం స్కూల్ కి వెళ్ళిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా మిస్సింగ్‌ కేసు చేశారు.

మహిళలపై జరుగుతున్న నేరాలపై, మధ్యప్రదేశ్‌ మారిందనే సంగతిని, ఈ ఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2021లో దేశంలోనే అత్యధిక అత్యాచారాలు మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయి. వీటిలో సగానికి పైగా నేరాలు మైనర్లపై జరిగినవే.