వన్ నేషన్, వన్ మిల్క్ నినాదానికి ఒప్పుకునేది లేదు: కాంగ్రెస్

రాష్ట్రాలలో పాడి పరిశ్రమల సహకార సంఘాలను నియంత్రించడం ఒక “హేయమైన చర్య” అని పేర్కొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్.. రైతులు, సహకార సంఘాలపై నియంత్రణను కేంద్రీకరించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉన్నందున.. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నందిని బ్రాండ్ ( రూ. 21,000 కోట్లు )..  దేశంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారు AMULలో విలీనం చేస్తారేమోనని […]

Share:

రాష్ట్రాలలో పాడి పరిశ్రమల సహకార సంఘాలను నియంత్రించడం ఒక “హేయమైన చర్య” అని పేర్కొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్.. రైతులు, సహకార సంఘాలపై నియంత్రణను కేంద్రీకరించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు.

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉన్నందున.. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నందిని బ్రాండ్ ( రూ. 21,000 కోట్లు )..  దేశంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారు AMULలో విలీనం చేస్తారేమోనని కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.

ఒకవేళ బీజేపీ ‘వన్ నేషన్, వన్ మిల్క్’ అనే నినాదాన్ని తీసుకువేస్తే తమ పార్టీ అనుమతించదని జైరాం రమేష్ అన్నారు.

సహకార సంఘాలను రాష్ట్ర అంశంగా వివరించే రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ మరియు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు.

గత ఏడాది డిసెంబరులో మాండ్యాలో KMF యొక్క జెయింట్ డైరీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా షా మాట్లాడుతూ, “అమూల్ పాలు, నందిని పాల మధ్య సహకారం డెయిరీ రంగంలో అద్భుతాలు చేయగలదు” అని అన్నారని జైరాం రమేష్ గుర్తు చేశారు.

 ఇక గుజరాత్‌కు చెందిన డెయిరీ కోఆపరేటివ్ అయిన అమూల్.. ఏప్రిల్ 5న కర్నాటక మార్కెట్‌కు పాలు మరియు పెరుగును సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.

అమూల్ పాలు మరియు నందిని  పాల మధ్య “షా – సహకారం” “రాష్ట్రాల్లోని డెయిరీ కోఆపరేటివ్‌లను నియంత్రించడానికి బీజేపీ చేసిన దురదృష్టకర చర్య” అని రమేష్ ఆరోపించారు.

అమూల్ మరియు నందిని రెండూ శ్వేత విప్లవం యొక్క జాతీయ విజయ గాథలు అని పేర్కొన్న రమేష్, ఇది ఆనంద్‌లో వర్గీస్ కురియన్ చేత ప్రారంభించబడిందని, 1965లో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి.. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌ను స్థాపించినప్పుడు భారతదేశం అంతటా విస్తరించారని చెప్పారు.

“ప్రతి రాష్ట్రంలోని సహకార సంఘాల నెట్‌వర్క్, పాడి రైతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది, నేను రైతు ఉద్యోగిని ‘ అని డాక్టర్ కురియన్ నినదించాడని” జైరాం రమేష్ గుర్తు చేశారు.

దశాబ్దాలుగా ఈ వికేంద్రీకరణ దృక్పథాన్ని పెంపొందించేందుకు, లక్షలాది మంది పాడి రైతులకు స్వయంప్రతిపత్తిని కల్పించేందుకు కాంగ్రెస్ సహకరించిందని ఆయన అన్నారు.

అమిత్ షా ఈ విషయంపై భిన్నమైన దృష్టిని కలిగి ఉన్నారని, ఇందులో కేంద్రీకృత సంస్థలు అతని ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నాయని రమేష్ ఆరోపించారు. ఆయన అధిపతిగా నియమితులైన కొత్త కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఎజెండా ఇదే అని పేర్కొన్నారు.

అందుకే రెండు లక్షల గ్రామీణ డైరీలతో కూడిన మల్టీ- స్టేట్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసేందుకు అమూల్ మరో ఐదు సహకార సంఘాలతో విలీనం కావాలని షా కోరుకుంటున్నట్లు జైరాం రమేష్ పేర్కొన్నారు.

2021 జూలైలో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు, షాకు బాధ్యతలు అప్పగించడంతో.. అమూల్ మరో ఐదు సహకార సంఘాలతో విలీనమవుతుందని ఆయన చేసిన ప్రకటన గురించి జైరాం రమేష్ గుర్తు చేశారు. 

దేశం కోసం.. సమైక్య వాదం, వికేంద్రీకరణ యొక్క దృక్పథానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని, “అమిత్ షా మరియు బీజేపీ కేంద్ర నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాలను” కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తుందని ఆయన తేల్చి చెప్పారు.