రసవత్తరంగా కర్ణాటక ఎన్నికలు, ఆ టికెట్ కోసం సిద్ధరామయ్య డిమాండ్

కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయ పార్టీలు జోరును పెంచారు. ఏ నాయకుడికి ఎక్కడ నుంచి టిక్కెట్ ఇస్తారన్న టికెట్ పోటీ రసవత్తరంగా మారింది. మే 10న జరిగే ఎన్నికలకు ముందు తాజాగా శనివారం ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యకు స్పష్టమైన ఎదురుదెబ్బగా భావించే విధంగా, ఆయన చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. ఆయన ఇప్పుడు మైసూరు జిల్లాలో తన సొంత గడ్డ అయిన వరుణ నుండి మాత్రమే పోటీ చేయనున్నారు.. శుక్రవారం బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో […]

Share:

కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయ పార్టీలు జోరును పెంచారు. ఏ నాయకుడికి ఎక్కడ నుంచి టిక్కెట్ ఇస్తారన్న టికెట్ పోటీ రసవత్తరంగా మారింది. మే 10న జరిగే ఎన్నికలకు ముందు తాజాగా శనివారం ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యకు స్పష్టమైన ఎదురుదెబ్బగా భావించే విధంగా, ఆయన చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. ఆయన ఇప్పుడు మైసూరు జిల్లాలో తన సొంత గడ్డ అయిన వరుణ నుండి మాత్రమే పోటీ చేయనున్నారు.. శుక్రవారం బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవాడికి బెళగావి జిల్లాలోని అథని స్థానం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్‌ లభించింది..

16 మంది కొత్త వారితో 43 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 209 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ మిగిలిన 15 స్థానాలకు ఏ క్షణంలోనైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 2018లో మాదిరిగానే చాముండేశ్వరి, బాదామి స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన సిద్ధరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని భావించి వరుణ, కోలార్‌లను ఎంచుకున్నారు… అయితే లోలోపల తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనకు ఒక్క సీటు మాత్రమే కేటాయించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మాజీ సిఎం మద్దతుదారులు దూకుడుగా వ్యవహరించినప్పటికి, రెండు స్థానాల నుండి పోటీ చేయడానికి ఎవరినీ అనుమతించేది లేదని కెపిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ సిద్దరామయ్యపై గోల్ సాధించారు. కోలార్‌ టికెట్‌ కొత్తూరు మంజునాథ్‌కు దక్కింది. సిద్ధరామయ్య క్యాంపు అనుచరురాలు, మాజీ మంత్రి ఉమాశ్రీకి బాగల్‌కోట్‌ జిల్లా తెర్డాల్‌ స్థానం నుంచి టికెట్‌ నిరాకరించారు..ఈ స్థానానికి సిద్దప్ప కొన్నూరును ఎంపిక చేశారు.అధికార వ్యతిరేకతను చూపి టికెట్ నిరాకరించిన ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాలో కుందగోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుసుమావతి శివల్లికి టిక్కెట్ ఇవ్వడం ఆశ్చర్యకరం. అయితే మిగిలిన నలుగురు హరిహర్ నుండి ఎస్ రామప్ప, సిడ్లఘట్ట నుండి వి మునియప్ప, లింగస్‌గురు నుండి డిఎస్ హూలగేరి, బెంగళూరులోని పులకేశినగర్ నుండి అఖండ శ్రీనివాసమూర్తిపై నిర్ణయం పెండింగ్‌లో ఉంచబడింది…

హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ స్థానానికి మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ తలుపు తడతారనే ఆశతో పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. శుక్ర‌వారం స‌వ‌ది మాదిరిగానే కొత్త ముఖాన్ని సీటు నుంచి పోటీకి దింప‌డం, కాషాయ పార్టీ నుంచి వైదొలగ‌డం వంటి నిర్ణయాన్ని బీజేపీ హైకమాండ్ పున‌రాలోచించ‌కుంటే శెట్టార్ తిరుగుబాటు చేసే అవ‌కాశం ఉంది.రాజస్థాన్ ప్లీనరీ సమావేశంలో వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహించకూడదని AICC నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఉత్తర కన్నడ జిల్లాలోని కుమటా స్థానం నుండి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కుమారుడు నివేదిత్ అల్వాకు పార్టీ టిక్కెట్ ఇచ్చింది..

ముదిగెరెలో మాజీ మంత్రి మోటమ్మ కుమార్తె నయన జ్యోతి ఝావర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మాజీ మంత్రి సూర్యనారాయణ కుమారుడు భరత్‌రెడ్డి బళ్లారి నుంచి బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖర్‌రెడ్డిపై పోటీకి దిగారు.

జేడీఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి కొత్తగా చేరిన కేఎం శివలింగగౌడ, నవలగుంద స్థానాల నుంచి ఎన్‌హెచ్‌ కోనారెడ్డికి టిక్కెట్లు ఇచ్చారు. బీదర్ జిల్లాలోని ఔరాద్ రిజర్వ్‌డ్ సీటు నుంచి 2004 నుంచి గెలుపొందిన సిట్టింగ్ మంత్రి ప్రభు చవాన్‌తో పోటీ చేసేందుకు మాజీ కెఎఎస్ అధికారి భీమసేన్ రావ్ షిండేకు టిక్కెట్ ఇచ్చారు..బొమ్మనహళ్లి స్థానం నుంచి సినీ నిర్మాత ఉమాపతి శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఆయన బీజేపీ అభ్యర్థి సతీష్ రెడ్డితో తలపడనున్నారు.మరి ఎవరికీ ఎంత మెజారిటీ వస్తుందోనని ఇప్పటి నుంచే చర్చలు మొదలైయ్యాయి.. చూద్దాం ఏం జరుగుతుందో..