ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై కాంగ్రెస్ ప్రశ్నలు

ఢిల్లీ బ్యూరోక్రాట్స్ నియంత్రణ బిల్లు సోమవారం లోక్‌సభకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు బిల్లులు ఆమోదింపజేయగలరా అని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే డిబేట్ ఎప్పుడు జరగాలి అనే విషయంపై, అన్ని పక్షాలను సంప్రదించిన తర్వాతే నిర్ణయిస్తామని స్పీకర్ చెప్పడం జరిగింది. ప్రతిపక్షాల ప్రశ్నలు:  ఢిల్లీ బ్యూరోక్రాట్స్ నియంత్రణ బిల్లు సోమవారం లోక్‌సభకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు బిల్లులు ఎలా ఆమోదించగలరు.. అని […]

Share:

ఢిల్లీ బ్యూరోక్రాట్స్ నియంత్రణ బిల్లు సోమవారం లోక్‌సభకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు బిల్లులు ఆమోదింపజేయగలరా అని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే డిబేట్ ఎప్పుడు జరగాలి అనే విషయంపై, అన్ని పక్షాలను సంప్రదించిన తర్వాతే నిర్ణయిస్తామని స్పీకర్ చెప్పడం జరిగింది.

ప్రతిపక్షాల ప్రశ్నలు: 

ఢిల్లీ బ్యూరోక్రాట్స్ నియంత్రణ బిల్లు సోమవారం లోక్‌సభకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు బిల్లులు ఎలా ఆమోదించగలరు.. అని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈరోజు చేసిన ట్వీట్‌లో, కాంగ్రెస్‌కు చెందిన మనీష్ తివారీ రూల్-బుక్‌ లో బిల్లుల ఆమోదం గురించి ఏం రాసిందో కూడా స్పష్టంగా వివరించారు. అవిశ్వాస తీర్మానం అనేది పెండింగ్‌లో ఉన్నప్పుడే బిల్లులను ఆమోదించడం అసలు రూల్ బుక్ లో లేదని, ఇలాంటివి అసలు ఎంతవరకు కరెక్ట్ అని ఆయన మాట్లాడారు.

అయితే డిబేట్ ఎప్పుడు జరగాలి అనే విషయంపై, అన్ని పక్షాలను సంప్రదించిన తర్వాతే నిర్ణయిస్తామని స్పీకర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో శాసన కార్యకలాపాలపై ఎటువంటి నియంత్రణ ఉండబోదు అని స్పీకర్ గుర్తుచేశారు.

స్పీకర్ ఏమన్నారు: 

సభకు సెలవు మంజూరు విషయంపై అదే విధంగా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడవలసి ఉన్న సమయాన్ని డిబేట్ జరిపి, సమయాన్ని వృధా కానివ్వకుండా ఏదో ఒక పరిష్కారం నిర్ణయించుకోవచ్చని, అంతేకాకుండా చట్టాన్ని రూపొందించడం మరియు ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలను లేవనెత్తడం మన రాజ్యాంగ విధి అని స్పీకర్ అంగీకరించారు. సభ ఆమోదించిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, ఎటువంటి శాసనసభ లేదా ఇతర ప్రజా ప్రాముఖ్యత ఉన్న ఇతర విషయాలను చేపట్టడాన్ని, రూల్ 198 పక్కన పెట్టడం జరగదు అని కాంగ్రెస్ అభ్యంతరాలను తోసిపుచ్చారు స్పీకర్.

లోక్‌సభలో జన్ విశ్వాస్ బిల్లుతో పాటు రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించిన తర్వాత ఈ వారంలో మరొక బిల్లు కూడా ఆమోదించడం జరిగింది. బిల్లులను ఎత్తి చూపుతూ, MN కౌల్, SL శాఖ్‌ధర్‌ చెప్పిన “పార్లమెంటు ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్” ను తివారీ ప్రస్తావించారు.

అవిశ్వాస తీర్మానంపై వచ్చే వారం కూడా చర్చ జరిగే అవకాశం ఉందని, అయితే సోమవారం తర్వాత కూడా చర్చ జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్ట్ 1, మంగళవారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరగబోయే డిబేట్ గురించి స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన ఆ క్రమంలో మహారాష్ట్రలో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి బుధ, గురువారాల్లో అవిశ్వాస తీర్మానంపై డిబేట్, సమాధానాలు, ఓటింగ్‌ జరిగే అవకాశం ఉండొచ్చు అని పలువురు అభిప్రాయపడతారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి. ప్రభుత్వం ముందుకు తీసుకురావాల్సిన బిల్లుల లిస్ట్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసింది చేసి ఉన్నట్లు సమాచారం. అయితే వీటిలో, చాలా ముఖ్యమైనది బ్యూరోక్రాట్స్ కంట్రోల్ కి సంబంధించిన ఒక బిల్, అయితే దీనిని రాజ్యసభ ద్వారా అనుమతించకూడదని ప్రతిపక్షాలు నిశ్చయించుకున్నాయి. 

ప్రభుత్వానికి మెజారిటీ మద్దతు: 

రాజ్యసభలో ప్రస్తుతం 238 మంది సభ్యులు ఉన్నారు, మెజారిటీ మార్క్ 120. బీజేపీ, దాని మిత్రపక్షాలకు 105 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇందులో తొమ్మిది మంది వైఎస్సార్‌సీపీ ఎంపీల మద్దతు ఉంటుంది. అధికార పార్టీ కూడా ఐదుగురు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎంపీల మద్దతు ఉండొచ్చు, అయితే ఇప్పుడు మద్దతు ఇచ్చే వారి సంఖ్య 121కు చేరుకుంది. దాదాపు 105 మంది ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం మరియు ఢిల్లీ బిల్లు రెండింటిలోనూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని ప్రకటించింది, మద్దతు ఇచ్చే వారి సంఖ్య చూస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది.