అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ !

ఇండియన్ – ఫారిన్ పాలసీ విధి విధానాలపై విదేశాంగ మంత్రి ఒక  కీలక నిర్ణయం తీసుకొని చేసిన ఒక ప్రకటనపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు చేసిన రచ్చకి అధికార బీజేపీ పార్టీ ఎంపీలు గురువారం నాడు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తపరిచారు.లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరిని సభలో మాట్లాడనివ్వబోమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. స్పీకర్ చౌదరి ని పాయింట్ ఆఫ్ ఆర్డర్ సబ్మిట్ చేయాల్సిందిగా కోరగా, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ లేచి, అంతకుముందు […]

Share:

ఇండియన్ – ఫారిన్ పాలసీ విధి విధానాలపై విదేశాంగ మంత్రి ఒక  కీలక నిర్ణయం తీసుకొని చేసిన ఒక ప్రకటనపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు చేసిన రచ్చకి అధికార బీజేపీ పార్టీ ఎంపీలు గురువారం నాడు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తపరిచారు.లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరిని సభలో మాట్లాడనివ్వబోమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. స్పీకర్ చౌదరి ని పాయింట్ ఆఫ్ ఆర్డర్ సబ్మిట్ చేయాల్సిందిగా కోరగా, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ లేచి, అంతకుముందు రోజు విదేశాంగ మంత్రి చేసిన  ప్రకటనకు అంతరాయం కలిగించి సభని రసాభాస చేసినందుకు నిరసనగా కాంగ్రెస్‌ నాయకుడు అధీర్ రంజన్ చౌదరిని మాట్లాడేందుకు అనుమతించబోమని చెప్పారు.

అవిశ్వాస తీర్మానం వెంటనే పాస్ చెయ్యాలని కాంగ్రెస్ డిమాండ్ :

అలా కాసేపు గొడవ జరిగిన తర్వాత చౌదరి కి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయన మాట్లాడుతూ 1978 మేలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంపై అప్పటి లోక్‌సభలో ప్రతిపక్ష నేత సిఎం స్టీఫెన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే చర్చకు తీసుకువెళ్లారని, మోదీ ప్రభుత్వంపై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉందని చెప్పుకొచ్చారు.పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ఈ తీర్మానం స్పీకర్ పరిశీలనలో ఉందని, దానిని స్వీకరించడానికి 10 రోజుల సమయం ఉందని, మోదీ ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉందని, స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా ఓటింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జోషి స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రతిపక్ష పార్టీ  అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, అది ప్రస్తుతం ఇప్పుడు  స్పీకర్ పరిశీలనలో ఉంది. 10 రోజుల విండో ఉంది. స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మా వద్ద సంఖ్యలు ఉన్నాయి. ప్రజలు మమ్మల్ని మరియు ప్రధాని మోదీని నమ్ముతారు, వారిని కాదు’ అని జోషి అన్నారు.

ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డ ఎస్ జై శంకర్ :

ఇది ఇలా ఉండగా విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ప్రతిపక్షాల నిరసన  జ్వాలల మధ్య తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు. గడిచిన నాలుగు నెలల్లో విదేశాలతో ప్రధాన మంత్రి , రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జరిపిన ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు ప్రతిపక్షాలు ‘ఇండియా..ఇండియా’ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఆయన మాట్లాడుతున్నంత సేపు ప్రతిపక్షాలు అంతరాయం కలిగిస్తున్నందుకు మండిపడ్డ జైశంకర్ మాట్లాడుతూ ‘మీరు ఊరికే ఇండియా, ఇండియా అని అరిస్తే సరిపోదు. ద్వైపాక్షిక సంబంధాల వల్ల మన దేశానికీ జరిగే ప్రయోజనాల గురించి వినాలి. కానీ మీరు అవేమి వినకుండా, ప్రధాని , రాష్ట్రపతి ని ఉపరాష్ట్రపతి ని అవమానిస్తున్నారు, మీరేమి ఇండియన్స్’ అంటూ జై శంకర్ అసహనం వ్యక్తం చేసాడు. మరోపక్క ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై  విరుచుకుపడిన గోయల్ మాట్లాడుతూ  ‘భారత విదేశాంగ విధానం వంటి సమస్యను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం. విదేశాంగ మంత్రి (ఎస్ జైశంకర్) సభలో చెప్పినట్లుగా, ప్రపంచ స్థాయిలో భారతదేశం ఎలా ముందుకు సాగుతుందో ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేవు’ అంటూ చెప్పుకొచ్చింది.