మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖ‌ర్గే ఫైర్..!

మణిపూర్ లో జరిగిన హింసకాండ పై తాజాగా పార్లమెంటులో ప్రధాని మోదీ వివరణాత్మక ప్రకటన చేయాలి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు.. మణిపూర్ లో జరిగిన దుర్ఘటన విషయానికి వస్తే.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో పై జాతీయ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మహిళలపై జరిగిన హింస గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ గురువారం పార్లమెంటులో మోడీ నుండి వివరణాత్మక […]

Share:

మణిపూర్ లో జరిగిన హింసకాండ పై తాజాగా పార్లమెంటులో ప్రధాని మోదీ వివరణాత్మక ప్రకటన చేయాలి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు.. మణిపూర్ లో జరిగిన దుర్ఘటన విషయానికి వస్తే.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో పై జాతీయ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మహిళలపై జరిగిన హింస గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ గురువారం పార్లమెంటులో మోడీ నుండి వివరణాత్మక ప్రకటన కావాలని డిమాండ్ చేశారు.. మరొకవైపు ఖర్గే మాట్లాడుతూ.. మణిపూర్ లో జరిగిన హింసకాండకు మణిపూర్ మొత్తం మండిపోతోంది మహిళలపై అత్యాచారం, నగ్నత్వం,  ఊరేగింపు భయంకరమైన హింస వారిపైన జరిపారు. అయితే ఇంత ఘోరమైన సంఘటనలు జరుగుతున్నా కూడా.. ఇప్పటివరకు ఈ విషయంపై ప్రధానమంత్రి మోడీ సైలెంట్ గా ఉన్నారు. ఆయన పార్లమెంటు వెలుపల మాత్రమే దీని గురించి ప్రకటన ఇచ్చారు అంటూ ఖర్గే రాజ్యసభలో ప్రసంగిస్తూ మండిపడ్డారు.

అంతేకాదు మణిపూర్లో ఈ ఘటన జరిగి దాదాపు రెండు నెలలు కావస్తున్నా  దీనిపై పట్టించుకోని మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అని ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా ఖర్గే డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మణిపూర్ లో జరిగిన హింస గురించి తాజాగా వీడియోల రూపంలో బయటకి రావడంతో పార్లమెంటులో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంతోనే మణిపూర్ హింస కారణంగా గందరగోళంగానే పార్లమెంటు సమావేశాలు  మొదలయ్యాయి. దీంతో  ఉభయ సభలను సోమవారం రోజంతా కూడా వాయిదా వేయాల్సి వచ్చింది.  ఇక మధ్యాహ్నం రెండు గంటలకు లోకసభలో సమావేశమైనప్పుడు విపక్ష నేతలు “మణిపూర్ మణిపూర్ “, మణిపూర్ మండుతోంది అంటూ ప్రతిపక్ష నాయకులు నినాదాలు చేశారు.

అయితే పార్లమెంటు సమావేశానికి ముందే మణిపూర్ ఘటనపై మోడీ స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానించారు.. ఇది ఏ సమాజానికైనా సరే అవమానకరమైన సంఘటన.. ఎవరు చేశారు?  ఎవరు బాధ్యులు అన్నది మరొక సమస్య.. అయితే ఈ ఘటన దేశాన్ని సిగ్గుపడేలా చేసింది.. ఇకపై శాంతి భద్రతలను మరింత కఠిన తరం చేయాలి అని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది చత్తీస్గఢ్ అయినా.. రాజస్థాన్ అయినా లేక మణిపూర్ అయినా ఏ రాష్ట్రమైనా సరే మహిళల గౌరవానికి సంబంధించిన అంశం అన్ని రాజకీయాలకు అతీతమైనది అంటూ మోడీ వెల్లడించారు.

ఇకపోతే మణిపూర్ లో జరిగిన ఈ ఘటన వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. మణిపూర్లో రెండు తెగల మధ్య మే 3వ తేదీన మొదటిసారి హింస చెలరేగింది. ఇరు వర్గాల దాడులతో రాజధాని ఇంఫాల్ కి 35 కిలోమీటర్ల దూరంలో కాంగ్ పోస్కి జిల్లాలో తీవ్ర ఉద్విక్త పరిస్థితులు నెలకొనగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఘటనపై గతంలోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఈ ఘటన వెలుగులోకి రాలేదు. ఇంత ఘోరం జరిగినా సరే ఇప్పటివరకు ఎందుకు ఈ విషయం వెలుగులోకి రాలేదని పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు నిలదీస్తున్నారు.  ఇంత హింసాత్మకమైన ఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఈ విషయం గురించి తెలియదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరన్ సింగ్ వివరణ ఇవ్వాలని కూడా పార్లమెంటులో కోరుతూ ఉండడం గమనాభం.