మధ్యప్రదేశ్ లో పెరిగిన టమోటా ధ‌ర‌లు

కిలో టమోటాలు 200 రూపాయిలు : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఏ రేంజ్ లో పెరిగిపోయాయో మన అందరికీ తెలిసిందే. సామాన్యులకు ఏమాత్రం కూడా అందుబాటులో లేని ఈ ధరలను చూసి పస్తులు ఉండడం నయం అని అనుకుంటున్నారు. ముఖ్యంగా టమోటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో టమోటా ధర ఇప్పుడు కొన్ని చోట్ల 160 రూపాయిలు, మరికొన్ని చోట్ల 180 రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. సిటీస్ లోకి పోతే 200 రూపాయలకు కూడా […]

Share:

కిలో టమోటాలు 200 రూపాయిలు :

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఏ రేంజ్ లో పెరిగిపోయాయో మన అందరికీ తెలిసిందే. సామాన్యులకు ఏమాత్రం కూడా అందుబాటులో లేని ఈ ధరలను చూసి పస్తులు ఉండడం నయం అని అనుకుంటున్నారు. ముఖ్యంగా టమోటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో టమోటా ధర ఇప్పుడు కొన్ని చోట్ల 160 రూపాయిలు, మరికొన్ని చోట్ల 180 రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. సిటీస్ లోకి పోతే 200 రూపాయలకు కూడా కిలో టమోటా ధర పలుకుతుంది అంటే, సామాన్యులు ఇక టమోటాలను తినగలరా..?, పైగా టమోటా ప్రతీ వంటలో వాడుతాము, టమోటా లేనిదే మనకి ముద్ద కూడా దిగాడు. చివరకి మనం తినే టిఫిన్స్ లో కూడా ఈమధ్య టమోటా పచ్చడినే వాడుతున్నాము. ఇలా టమోటా అనేది మన జీవితం లో ఒక భాగం అయిపోయింది. అలాంటి టమోటా ఇప్పుడు అందుబాటులో  లేకుండా పోయిందంటే ఎంత దురదృష్టకరమో అర్థం చేసుకోవచ్చు.

విన్నూతన పద్దతి లో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ :

ఈ టమోటా ధరలపై ప్రతిపక్ష పార్టీలు అధికారా బీజేపీ పార్టీ పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు కార్యకర్తలు టమోటా రేట్లు పెరుగుదలపై చాలా విన్నూతనమైన రీతిలో నిరసన తెలిపారు. భూపాల్ లోని ఒక మార్కెట్ లో టమోటాలను కొనుగోలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక బ్రీఫ్ కేసు లో టమోటాలను పెట్టుకొని,అత్యంత భద్రం గా దానికి కాపలా కాస్తూ, ఎదో బంగారం, వజ్ర వైఢూర్యాలను ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో, అంత జాగ్రత్తగా చూసుకుంటూ, మళ్ళీ దానికి కాపలా గా గన్ మ్యాన్ ని కూడా పెట్టుకున్నారు. అలా మార్కెట్ లో జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకెళ్లిన టమోటా బ్రీఫ్ కేసుని సమీపం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోకి దూరి, అక్కడ బీరువా లో టమోటాలను భద్రపరిచారు. తద్వారా టమోటా ధరలపై వినూతన రీతిలో నిరసన వ్యక్త పరిచిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఎక్కడ చూసినా ఈ వీడియోనే సిర్క్యులేట్ అవుతుంది.

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి విక్కీ కోమ్ఘల్ మాట్లాడుతూ ‘ కాంగ్రెస్ పార్టీ హయాం లో ద్రవ్యోల్బణాన్ని మంత్రగత్తె గా అభివర్ణించిన బీజేపీ పార్టీ  కి , ఇప్పుడుఈ అదే ప్రేయసి అయిపోయింది. చూస్తూ ఉంటే రాబొయ్యే రోజుల్లో కేజీ టమోటాలను కొనుక్కునేందుకు జనాలు ఒకరి మీద ఒకరు యుద్దాలు చేసుకునే పరిస్థితి వచ్చేట్టు ఉంది. ఇది పూర్తిగా బీజేపీ పార్టీ అసమర్థత పాలనకు నిదర్శనం లాంటిది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ టమోటా ధరల కారణంగా బీజేపీ పార్టీ విపరీతమైన నెగటివిటీ ని మూటగట్టుకుంటుంది. ఎన్నికల సమయం నిత్యావసర సరుకులు మరియు కూరగాయల రేట్లను పెంచడం అనేది, బీజేపీ పార్టీ మద్దతుదారులకు కూడా తీవ్రమైన అసహనం రప్పించేలా చేస్తుంది. ఇప్పటికే పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు ఒక రేంజ్ లో పెంచేసి జనాల నుండి విపరీతమైన నెగటివిటీ ని మూటగట్టుకున్న బీజేపీ పార్టీ, ఇప్పుడు పెరుగుతున్న కూరగాయల రేట్లు మరియు నిత్యావసర సరుకుల రేట్లను నియంత్రించలేకపోవడం  బీజేపీ పార్టీ అసమర్థత పాలన కి నిదర్శనం అని నెటిజెన్స్ సైతం పెదవి విరుస్తున్నారు . ఇదే పద్దతి కొనసాగితే సెంట్రల్ ఈసారి బీజేపీ పార్టీ అధికారం లోకి రావడం అనేది అసాధ్యం అని చెప్తున్నారు. మరోపక్క ఈ ధరలు కేవలం తాత్కాలికం మాత్రమే అని, త్వరలోనే ప్రజలకు అందుబాటు అయ్యే ధరల్లోకి వస్తుందని బీజేపీ పార్టీ నాయకులూ చెప్తున్నారు.