మమతా బెనర్జీ మీద ఫైర్ అయిన కాంగ్రెస్ నాయకుడు 

కాంగ్రెస్ నాయకుడు అదిర్ రంజన్, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ స్పెయిన్ యాత్రకు వెళ్ళినందుకు ఆరోపించారు. తమ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు అంతకంతకు ఎక్కువవుతున్న క్రమంలో మమతా బెనర్జీ అవేమి పట్టించుకోకుండా స్పెయిన్ యాత్రకు ఎలా వెళ్లారు అంటూ ప్రశ్నించారు వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అదిర్ రంజన్ చౌదరి.  కాంగ్రెస్ చీఫ్ మాటల్లో:  రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో నుంచి డెంగ్యూ వ్యాధి అధికంగా ఉన్నదని తాము ఇప్పటికే హెచ్చరించినట్లు […]

Share:

కాంగ్రెస్ నాయకుడు అదిర్ రంజన్, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ స్పెయిన్ యాత్రకు వెళ్ళినందుకు ఆరోపించారు. తమ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు అంతకంతకు ఎక్కువవుతున్న క్రమంలో మమతా బెనర్జీ అవేమి పట్టించుకోకుండా స్పెయిన్ యాత్రకు ఎలా వెళ్లారు అంటూ ప్రశ్నించారు వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అదిర్ రంజన్ చౌదరి. 

కాంగ్రెస్ చీఫ్ మాటల్లో: 

రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో నుంచి డెంగ్యూ వ్యాధి అధికంగా ఉన్నదని తాము ఇప్పటికే హెచ్చరించినట్లు వెల్లడించారు కాంగ్రెస్ చీఫ్. అంతేకాకుండా ప్రజలకు అండగా ఉండాల్సిన రాష్ట్రం ముఖ్యమంత్రి, ప్రజలను పక్కనపెట్టి చక్కగా స్పెయిన్ యాత్రకు ఎలా వెళ్లారో అర్థం కావట్లేదని మరొకసారి వెల్లడించారు, వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్. అంతేకాకుండా ప్రజలను గాలికి వదిలేసి, తాము మాత్రం ఎంచక లగ్జరీ హోటల్స్ లో రోజుకి మూడు లక్షల ఖర్చు పెట్టి ఉండడాన్ని ఏమంటారు అంటూ కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నించారు. 

ప్రజల సొమ్మును దోచుకుంటూ తమ లగ్జరీ బ్రతుకుల కోసం డబ్బులు ఖర్చు పెట్టడాన్ని ఏమంటారు అంటూ, ప్రజలని అమాయకులను చేయడమే తమ ఉద్దేశం అనుకుంటా అంటూ.. మరొకసారి ఎత్తిచూపారు వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అదిర్ రంజన్ చౌదరి.. 

అన్ ఎంప్లాయ్మెంట్ గురించి: 

బిశ్వబంగ్లా ఇండస్ట్రియల్ మీట్ లో ఖర్చుపెట్టిన దాంట్లో కేవలం 10 శాతం ఖర్చుపెట్టిన, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎంతోమంది నిరుద్యోగులకు ఈ పాటికే ఉద్యోగాలు వచ్చేవని, అయితే ఇప్పుడు స్పెయిన్ యాత్రకు వెళ్ళినందుకు స్పానిష్ కంపెనీలు ఎన్ని వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉపాధిని కల్పిస్తాయో చూడాల్సి ఉందని, మమతా గవర్నమెంట్ గురించి మాట్లాడారు కాంగ్రెస్ చీఫ్. 

నిజానికి బుల్లెట్ ట్రైన్ల గురించి ఇంతకుముందు ప్రమాణం చేసిన ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడేమో వందే భారతి ఎక్స్ప్రెస్ ట్రైన్లు అంటూ ఏవో పిచ్చిపిచ్చి ట్రైన్లు గురించి ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోందని, వందే భారత్ రైలు కేవలం నార్మల్ రైళ్లలాగే సమాన స్పీడులో వెళ్తాయని, మరి ఇందులో అసలు వింత ఏముందని మరో 9 వందే భారత్ రైళ్లను మరిన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారని కూడా ప్రస్తావించారు కాంగ్రెస్ చీఫ్. 

ముర్షిదాబాద్ కిరితేశ్వరి అని ఒక చిన్న గ్రామానికి బెస్ట్ టూరిజం విలేజ్ ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, అసలు ఏ ఉద్దేశంతో ఆ విలేజ్ కి బెస్ట్ టూరిజం విలేజ్ అనే బిరుదు ఇచ్చారో అర్థం కాలేదని, కేవలం ఆ గ్రామంలో ఒక పురాతన గుడి తప్పిస్తే ఏమీ కనిపించలేదని ఆయన మరొకసారి ప్రస్తావించారు. 

మహిళా రిజర్వేషన్ బిల్: 

మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో స్పెషల్ సెషన్ రోజున అమలులోకి తీసుకువచ్చిన బిజెపి ఎత్తుగడ అని  తమకు తెలుసని, కేవలం ప్రజలను అసలు విషయాల నుంచి, దేశంలో ఉన్న అసలు సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు మాత్రమే, ఎలక్షన్స్ ముందున మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుమీద, బిజెపి ప్రజల మన్ననలు దక్కించుకోవాలని ప్రయత్నించిందని కూడా గుర్తుచేసారు కాంగ్రెస్ నాయకులు. అంతేకాకుండా సభలోని బిజెపి ఎంపి రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ, నిజానికి ఇదే బిజెపి తీరు అని, ఇతరులను కించపరిచేలా మాట్లాడడం బిజెపికే తగును అంటూ అభిప్రాయపడ్డారు అదిర్ రంజన్ చౌదరి. అంతేకాకుండా ఇటువంటి తీరుని ఎప్పటికీ ఖండిస్తామని, అంతేకాకుండా ఈ విషయాల గురించి ఇప్పటివరకు ప్రధానమంత్రి మాట్లాడకపోవడం గమనార్హం అంటూ గుర్తు చేశారు.