ప్రధాని సూసైడ్‌ నోట్‌ జోక్‌పై మండిపడిన ప్రియాంకా గాంధీ

ప్రధాని నరేంద్ర మోది చేసిన ‘సూసైడ్‌నోట్‌’ జోక్‌పై కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ప్రధాని మంత్రి మోదీ చేసిన జోక్‌కి నవ్వుకున్న వారు… సున్నితమైన మానసిక ఆరోగ్య సమస్యలను అనారోగ్యకరమైన రీతిలో ఆపహాస్యం చేయడం కంటే సూసైడ్‌ లు చేసుకొకుండా వాటిపై అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని మండిపడ్డారు. మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలు ముఖ్యంగా యువతలో నవ్వుకునే అంశాలు కావని ఎద్దేవా చేశారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) సమాచారం […]

Share:

ప్రధాని నరేంద్ర మోది చేసిన ‘సూసైడ్‌నోట్‌’ జోక్‌పై కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ప్రధాని మంత్రి మోదీ చేసిన జోక్‌కి నవ్వుకున్న వారు… సున్నితమైన మానసిక ఆరోగ్య సమస్యలను అనారోగ్యకరమైన రీతిలో ఆపహాస్యం చేయడం కంటే సూసైడ్‌ లు చేసుకొకుండా వాటిపై అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని మండిపడ్డారు.

మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలు ముఖ్యంగా యువతలో నవ్వుకునే అంశాలు కావని ఎద్దేవా చేశారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) సమాచారం ప్రకారం… 2021లో 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆమె తెలిపారు. కాగా వీరిలో అధిక శాతం 30 ఏళ్లలోపు వయసు వారే ఉన్నారని ఆమె అన్నారు. ఇది హృదయవిదారకమైన అంశమని… జోక్‌ కాదని ప్రధాని మోదీపై మండిపడ్డారు. . ఈ మధ్యకాలంలో ఓ మీడియా ఛానెల్‌ నిర్వహించిన సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ ఛానెల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ హిందీలో స్పష్టంగా మాట్లాడుతున్నారని, ముంబాయిలో ఉండటంతో హిందీ బాగా మాట్లాడగలుగుతున్నారని మోదీ అన్నారు.

 అనంతరం ఓ జోక్‌ను చెప్పారు. ఒక ప్రొఫెసర్‌ తన కుమార్తె రాసిన సూసైడ్‌ నోట్‌ను చదువుతున్నప్పుడు, తన కుమార్తె ఆ సూసైడ్‌ నోట్‌లో స్పెల్లింగ్స్‌ తప్పుగా రాయడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడని మెదీ అన్నారు. కాగా అక్కడున్న వారంతా నవ్వుతూ ఆ జోక్‌ను ఎంజాయ్ చేయడం గమనార్హం.

ఇంతకీ సూసైడ్ నోట్‌లో ఏం ఉంది..?

ఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మహత్యల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఓ చిన్న కథ చెప్పారు.

ఓ ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఓ సూసైడ్ నోట్ రాసింది ఇలా… నాకు బతకాలని లేదు. చనిపోతున్నాను.. ఈ జీవితంతో నేను పోరాడలేక పోతున్నానని ఆమె ఆ నోట్‌లో రాసిందని మోదీ చెప్పారు. కాగా ప్రొఫెసర్ ఉదయం నిద్ర లేచి చూసే సరికి తన కూతురు కనిపించలేదు. దీంతో ఆ ప్రొఫెసర్ చాలా కంగారు పడిపోయాడు. అప్పుడే ఆ అమ్మాయి గదిలో ఓ నోట్ దొరికింది. అది చూసి ఆయనకు చాలా కోపం వచ్చింది. నేనోక ప్రొఫెసర్‌ని. ఎంతో మందికి పాఠాలు చెప్పాను. అయినా నా కూతురు Conquer స్పెలింగ్ తప్పుగా రాసిందని, ఆ ప్రొఫెసర్ తన కూతురు రాసిన నోట్‌పై మండి పడ్డాడరని ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జోక్ కింద అభివర్ణించారు.

దీంతో ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే హాల్‌లో ఉన్న అందరూ గట్టిగా నవ్వారు. అనంతరం చప్పట్లు కొట్టారు. జోక్‌లో భాగంగా మోదీ కూడా నవ్వారు. కాగా ఈ జోక్‌ వైరల్ కావడంతో వీడియోని విపక్షపార్టీ నేతలు షేర్ చేసి మోదీపై విరుచుకు పడుతున్నారు. సూసైడ్‌ లాంటి సీరియస్ ఇష్యూ‌లను జోక్‌ కింద అభివర్ణించడం సరైనది కాదని ప్రశ్నిస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ కూడా ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు.

కాగా ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె. సైకాల‌జీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన త‌ర్వాత ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీకి అంకిత‌మయ్యారు. త‌న కుటుంబ స‌భ్యుల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న‌ప్ప‌టికీ, ప్రతికూల రాజకీయాల్లో ఆమె ఎక్కువ శాతం తెర‌వెనుకే ఉండిపోయారు. 2007 ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పార్టీలో నెల‌కొన్న అస‌మ్మ‌తిని ప‌రిష్క‌రించేందుకు ఆమె ప్ర‌య‌త్నించారు. ప్రియాంకా గాంధీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న‌ ఆద‌ర‌ణ కార‌ణంగా చివ‌రికి ఆమె ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు.