వెజ్, నాన్ వెజ్ ఆర్డ‌ర్ల‌ను మిక్స్ చేసేసిన కాన్సు బేక‌రీ

ఈ మధ్యకాలంలో రెస్టారెంట్స్ మీద ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ఇప్పటివరకు చాలా సంఘటనలు చూసే ఉంటాం, అయితే ముఖ్యంగా ఓన్లీ శాకాహారం తినేవారికి నాన్ వెజ్ ఐటమ్స్ పంపించిన కొన్ని రెస్టారెంట్స్ మీద కంప్లైంట్స్ ఫైల్ అవ్వడం కూడా మనం చూసాం. ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఎగ్ లెస్ కేక్ ఆర్డర్ చేస్తే, డెలివరీ టైమ్ లో దానికి బదులు నార్మల్ కేక్ అంటే, ఎగ్ కలిసిన కేక్ డెలివరీ అవ్వడంతో, రెస్టారెంట్ మీద […]

Share:

ఈ మధ్యకాలంలో రెస్టారెంట్స్ మీద ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ఇప్పటివరకు చాలా సంఘటనలు చూసే ఉంటాం, అయితే ముఖ్యంగా ఓన్లీ శాకాహారం తినేవారికి నాన్ వెజ్ ఐటమ్స్ పంపించిన కొన్ని రెస్టారెంట్స్ మీద కంప్లైంట్స్ ఫైల్ అవ్వడం కూడా మనం చూసాం. ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఎగ్ లెస్ కేక్ ఆర్డర్ చేస్తే, డెలివరీ టైమ్ లో దానికి బదులు నార్మల్ కేక్ అంటే, ఎగ్ కలిసిన కేక్ డెలివరీ అవ్వడంతో, రెస్టారెంట్ మీద కంప్లైంట్ నమోదయింది. అంతేకాకుండా రెస్టారెంట్ నుంచి సుమారు 50 వేల రూపాయల ఫైన్ పడింది.

అసలు విషయం:

కాన్సు రెస్టారెంట్ ఎంత ప్రసిద్ధిగాంచిందో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా అది ముఖ్యంగా బేకరీ ఫుడ్ ఐటమ్స్ కు ప్రసిద్ధి. రెస్టారెంట్ నుంచి రోజు ఎన్నో వేలు కేకలు ఆర్డర్ లు అవుతూ ఉంటాయి. అయితే ఇదే క్రమంలో కిందటి సంవత్సరం ఆగస్టు నెలలో ఒక మిస్సెస్ చౌదరి, ప్రగతి నగర్ నుంచి ఎగ్ లెస్ వెజ్ కేక్ ఆర్డర్ చేయడం జరిగింది. కాకపోతే అన్ని ఆర్డర్లు కలిపేయడంతో ఆమె డెలివరీ తీసుకునే సమయానికి ఆమె చేతిలోకి ఎగ్ తో చేసిన కేకు వెళ్లిపోయింది. అయితే తన కజిన్ ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వాళ్ల దగ్గరికి కేక్ తీసుకు వెళ్లడం జరిగింది. బర్త్డే సందర్భంగా ఆర్డర్ చేసిన కేక్ కట్ చేసి, మిస్సెస్ చౌదరి నోట్లో పెట్టడం జరిగింది. అయితే వెంటనే ఈ కేక్ ఎగ్ లెస్ కేకు కాదని, ఎగ్ స్మెల్ రావడంతో, రెస్టారెంట్ వాళ్లు వేరే కేక్ డెలివరీ చేశారని ఆమెకు అర్థమైంది.

అయితే ఆమె ఎప్పటినుంచోడిస్తేగా పాటిస్తున్న వాళ్ళ కుటుంబ ఆచారం లో భాగంగా నాన్ వెజ్ ముట్టుకోమని కానీ ఈ సంఘటన కారణంగా, ఎగ్ తో చేసిన కేక్ తినాల్సి వచ్చినందుకు ఆమె చాలా బాధపడింది. అంతేకాకుండా, ఈ విషయాన్ని గురించి రెస్టారెంట్ వాళ్ళకి కంప్లైంట్ కూడా చేసింది ఆమె. అయితే రెస్టారెంట్ వాళ్ళు ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పారు. అంతేకాకుండా, కాంప్లిమెంటరీ డిన్నర్ ఆర్ లంచ్ కూడా అరేంజ్ చేస్తామన్నారు కానీ, ఆమె ససిమేరా నిరాకరించింది. 

తమ కుటుంబంలో నాన్ వెజ్ తినమని, ఈ సంఘటన కారణంగా ఎగ్ పొరపాటున తినాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. అంతేకాకుండా కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయించి రెస్టారెంట్ మీద కంప్లైంట్ కూడా నమోదు చేసింది. అయితే, గత సంవత్సరం కంప్లైంట్ ఆధారంగా, కోర్టు ఈ సంవత్సరంలో తీర్పునివ్వడం జరిగింది. అయితే రెస్టారెంట్ మీద నమోదైన కేసు ప్రకారం, రెస్టారెంట్ సుమారు 50 వేల రూపాయలు పరిహారంగా ఆమెకు అందించాలని, 45 రోజుల్లో ఫైన్ పే చేయాలని కోరింది.

ఇలా ఎందుకు జరిగింది:

ఒక జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు రెస్టారెంట్ మీద పెద్ద అభయోగమే పడినట్లు అయింది. చిన్న రెస్టారెంట్లైన పెద్ద రెస్టారెంట్లు అయినా సరే, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవచ్చు.

ముఖ్యంగా వెజ్ , నాన్ వెజ్ విషయాలలో జాగ్రత్త తీసుకోవడం కంపల్సరీ. చాలామంది నాన్ వెజ్ తినని వారు, ఆచారాలు మీద గౌరవం ఉన్నవాళ్లు, ఇలాంటి సంఘటనలు చోటు చూసుకుంటున్నప్పుడు, కంప్లైంట్ చేసే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మరి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా, చిన్న చిన్న పొరపాట్లు చేసిన సరే.. ఎంత పెద్ద రెస్టారెంట్ అయినప్పటికీ ఇలాంటి చిక్కుల్లో పడ్డాం ఖాయమని చెప్పాలి.