ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం

ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఓ మహిళపై ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. కాగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌లో చేర్చారు. దాడికి పాల్పడిన వ్యక్తి లాయర్ దుస్తుల్లో వచ్చినట్లు సమాచారం. రంజాన్‌ పండగ వేళ దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించడంతో సాకేత్‌ కోర్టులో న్యాయవాదులు, ఢిల్లీ వాసులు ఉలిక్కి పడ్డారు. లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగుడు కోటు మాటు నుంచి తుపాకీ తీసి విచక్షణారహితంగా ఫైరింగ్ జరిపారు. దీంతో ఓ […]

Share:

ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఓ మహిళపై ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. కాగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌లో చేర్చారు. దాడికి పాల్పడిన వ్యక్తి లాయర్ దుస్తుల్లో వచ్చినట్లు సమాచారం. రంజాన్‌ పండగ వేళ దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించడంతో సాకేత్‌ కోర్టులో న్యాయవాదులు, ఢిల్లీ వాసులు ఉలిక్కి పడ్డారు. లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగుడు కోటు మాటు నుంచి తుపాకీ తీసి విచక్షణారహితంగా ఫైరింగ్ జరిపారు. దీంతో ఓ మహిళా కడుపులోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. ఏం జరుగుతోందో తెలియక లాయర్స్ బ్లాక్‌లో ఉరుకులు పరుగులు పెట్టారు. కాల్పుల ఉదంతంతో సాకేత్ కోర్టు పరిసరాలు భయకరంగా మారాయి. ఈ విషయంపై న్యాయవాదులు, ఇతరులను పోలీసులు విచారిస్తున్నారు. ఆ మహిళ ఏదో కేసులో సాక్ష్యం చెప్పేందుకు వచ్చినట్లు సమాచారం. బుల్లెట్ తగలగానే ఆ మహిళ కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో అక్కడున్న వారు వెంటనే మహిళను ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

దాడి చేసిన వ్యక్తిని గుర్చించే పనిలో పోలీసులు

కోర్టు తెరిచిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తికి గతంలో క్రైం హిస్టరి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళకు, నిందితుడికి మధ్య ఆర్ధిక లావాదేవాల విషయంలో గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే దాడి తర్వాత దాడి చేసిన వ్యక్తి కోర్టు నుండి పరారీ అయ్యాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. దాడి చేసిన వ్యక్తి ఒంటరిగానే కోర్టుకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సాకేత్ కోర్టు భద్రతపై ప్రశ్నఆయుధాలతో పట్టపగలు ఆ వ్యక్తి కోర్టుకు ఎలా చేరుకున్నాడన్న ప్రశ్న తలెత్తుతోంది. కోర్టు ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ కూడా ఉంది. ఇదిలావుండగా.. ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయంపై అనుమానాలు వస్తున్నాయి. కోర్టు భద్రత సిబ్బంది ఎవరైనా దుండగుడికి సహయం చేసారా లేదా దుండగుడే సిబ్బంది కళ్లుకప్పి కోర్టు ఆవరణలోకి ప్రవేశించాడనే అనుమానులు వస్తున్నాయి. ఎది ఎమైనప్పటికి ఇలాంటి పరిస్థితుల్లో సాకేత్ కోర్టులో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోర్టు ఆవరణలో దాడి జరిగింది. అటువంటి పరిస్థితిలో ఇంత భద్రత ఉన్నప్పటికీ దాడి చేసిన వ్యక్తి అక్కడికి ఎలా చేరుకున్నాడు. ఈ కేసులో భద్రతా లోపమే స్పష్టంగా కనిపిస్తోందని పలువురు లాయర్లు, ప్రజలు అంటున్నారు.