అనంతనాగ్ ఆపరేషన్లో వీరమరణం పొందిన మన్ ప్రీత్ సింగ్

17 సంవత్సరాలుగా తన కర్తవ్యాన్ని ఎంతో బాగా నిర్వర్తించిన మన్ ప్రీత్ సింగ్ బుధవారం జరిగిన అనంతనాగ్ ఆపరేషన్ లో వీర మరణం పొందారు. అయితే తమ కుటుంబ సభ్యులతో బుధవారం ఉదయం 6 గంటలకు మాట్లాడారని, తమ కుటుంబ సభ్యులు చెప్పుకుని బాధపడుతున్నారు.  వీరమరణం పొందిన మన్ ప్రీత్ సింగ్:  అనంతనాగ్ ఆపరేషన్ జరిగిన రోజునే ఉదయం తెల్లవారుజామున ఆయనతో మాట్లాడినట్లు తమ కుటుంబ సభ్యులలో ఒకరైన మన్‌ప్రీత్ సింగ్ బావ వీరేంద్ర గిల్ చెప్పారు. […]

Share:

17 సంవత్సరాలుగా తన కర్తవ్యాన్ని ఎంతో బాగా నిర్వర్తించిన మన్ ప్రీత్ సింగ్ బుధవారం జరిగిన అనంతనాగ్ ఆపరేషన్ లో వీర మరణం పొందారు. అయితే తమ కుటుంబ సభ్యులతో బుధవారం ఉదయం 6 గంటలకు మాట్లాడారని, తమ కుటుంబ సభ్యులు చెప్పుకుని బాధపడుతున్నారు. 

వీరమరణం పొందిన మన్ ప్రీత్ సింగ్: 

అనంతనాగ్ ఆపరేషన్ జరిగిన రోజునే ఉదయం తెల్లవారుజామున ఆయనతో మాట్లాడినట్లు తమ కుటుంబ సభ్యులలో ఒకరైన మన్‌ప్రీత్ సింగ్ బావ వీరేంద్ర గిల్ చెప్పారు. అంతేకాకుండా ఆ సమయంలో తనకి మాట్లాడే సమయం లేద,ని తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ సేన పతకాన్ని అందుకున్నాడు. ధోనక్ 15వ సిక్కు LIకి చెందినవాడు. మన్ ప్రీత్ సింగ్ గాయపడినట్లు ముందు సమాచారం అందింతని.. అనంతరం వీరమరణం పొందినట్లు తమకి మధ్యాహ్నం సమయంలో కబురు అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మన్ ప్రీత్ సింగ్ తన భార్య, ఇద్దరు పిల్లలు, తన తల్లితో నివసిస్తుండేవాడు.

అనంతనాగ్ ఆపరేషన్: 

ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరుగుతుండగా కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ ప్రాణాలు కోల్పోయారు. ఇంటిలిజెన్స్ టీం తో కలిసి ఉగ్రవాదులను వెతికే క్రమంలో ఈ దుర్ఘటన సంభవించినట్లు, ఇండియన్ ఆర్మీ అఫీషియల్స్ వెల్లడించారు.  

మరోవైపు, జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలోని నార్లా ప్రాంతంలో మంగళవారం ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయని ANI నివేదించింది. అధికారుల అందించిన సమాచారం ప్రకారం, బుధవారం సాయంత్రం కొనసాగిన ఎన్‌కౌంటర్ మధ్య జరిపిన శోధనలో పెద్ద మొత్తంలో, పాకిస్తాన్ ముద్ర వేసిన, యుద్ధప్రాతిపదిక స్టోర్స్, మందులతో సహా, మరికొన్నింటిని, భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. 

ఇటీవల సెప్టెంబర్ 7 నుంచి, ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ట్రాక్ చేస్తున్నారని డిఫెన్స్ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్త్వాల్ తెలిపారు. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను చుట్టుముట్టాయని, సెప్టెంబర్ 12న భారీ కాల్పులు జరిగాయని, అదే రాత్రి ఒక ఉగ్రవాది హతమయ్యాడని.. అయితే మరో ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో రాత్రంతా కాల్పులు జరిపినప్పటికీ, అండర్ గ్రౌండ్ లో ఉన్న ఉగ్రవాది తెల్లవారుజామున బయటికి రాగా, భారత సైన్యం ఉగ్రవాదిని హతమార్చింది.. అని ఇండియన్ ఆర్మీ అఫీషియల్స్ వెల్లడించారు. అయితే ఈ క్రమంలోనే భారీ మొత్తంలో పాకిస్తాన్ తరపున ఉన్న కొన్ని మందు గుండు సామాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది ఆర్మీ. ఈ క్రమంలోనే మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారని, ఒక ఆర్మీ కుక్క కూడా మరణించింది అని ఇండియన్ ఆర్మీ తన ప్రకటనలో తెలిపింది.

ఉగ్రవాదుల దాడిలో ఇప్పటివరకు మన భారత సైన్యంలో ఎంతోమంది ప్రతి ఏటా తమ ప్రాణాల్ని కోల్పోతూనే ఉన్నారు. మన భారతదేశం కోసం ఎంతగానో పాటుపడుతున్న సైనికులు ఎంతోమంది. రాత్రనకా పగలనకా కష్టపడుతూ భారతదేశ బార్డర్ చుట్టూ నిరంతరం కాపలా కాస్తున్న సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపలాకాస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల దాడిలో, బలైపోతున్న సైనికులను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది కుటుంబాలను ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వీరులను తయారు చేస్తూనే ఉన్నారు. అలాంటి కుటుంబాలను మరొక్కసారి గుర్తు చేసుకుని, ఈరోజు చనిపోయిన వారు సైనికుల ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం.