చంద్ర‌యాన్ 3.. ఆ పేరు ఎందుకు పెట్టారంటూ మోదీపై విమ‌ర్శ‌లు

చంద్రుడు మీద ఆగస్టు 23, 2023లో అడుగు పెట్టిన చంద్రయాన్-3 విజయం అనంతరం భారతదేశంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు గర్వంగా చూస్తుంది. ఈ క్రమంలోనే, మొదటిసారి చంద్రుడు మీద ల్యాండర్ ఎక్కడైతే అడుగు పెట్టిందో దాన్ని శివశక్తి పాయింట్ అంటూ, నరేంద్ర మోదీ ఒక పేరును సిఫార్సు చేయడం జరిగింది. మరోపక్క మోదీ తీసుకున్న పేరుకి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆ పాయింట్ జవహర్ పాయింట్ అంటూ ప్రస్తావించారు. […]

Share:

చంద్రుడు మీద ఆగస్టు 23, 2023లో అడుగు పెట్టిన చంద్రయాన్-3 విజయం అనంతరం భారతదేశంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు గర్వంగా చూస్తుంది. ఈ క్రమంలోనే, మొదటిసారి చంద్రుడు మీద ల్యాండర్ ఎక్కడైతే అడుగు పెట్టిందో దాన్ని శివశక్తి పాయింట్ అంటూ, నరేంద్ర మోదీ ఒక పేరును సిఫార్సు చేయడం జరిగింది. మరోపక్క మోదీ తీసుకున్న పేరుకి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆ పాయింట్ జవహర్ పాయింట్ అంటూ ప్రస్తావించారు. ఈ విధంగా కాంగ్రెస్, మోదీ పెట్టిన పేరుని వ్యతిరేకించడంపై, వారు చేస్తున్న ఆరోపణలు యాంటీ హిందు విధానంలో ఉన్నాయంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్ల ఎత్తిచూపారు. 

జవహర్ పాయింట్ అంటున్న కాంగ్రెస్: 

నరేంద్ర మోదీ చంద్రయాన్-3 ల్యాండర్ అడుగు పెట్టిన స్థలానికి శివశక్తి పాయింట్ అనే పేరుని సిఫార్సు చేయడం జరిగింది. అయితే దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు అల్వి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ పెట్టిన పేరు విన్న ప్రతి ఒక్కరు కచ్చితంగా నవ్వుతారని, కాకపోతే చంద్రయాన్-3 విజయవంతం అవ్వటానికి ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం అంటూ, అందులో ఎటువంటి సందేహం లేదు అంటూ కానీ, చంద్రుడు మీద అధికారం చలాయించే హక్కు మనకి లేదు అంటూ మాట్లాడారు. అంతేకాకుండా ఆయన జవహర్ పాయింట్ అంశాన్ని కూడా తీసుకువచ్చారు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ తో పోటీ పడడం, మోదీకి సబబు కాదు అని, నిజానికి చంద్రుడు మీద మిషన్ సక్సెస్ఫుల్గా జరిగినందుకు మనం జవహర్లాల్ నెహ్రూ గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలపాలని గుర్తు చేశారు. ఇస్రో వంటి పెద్ద కట్టడాలకు ఎంతగానో తోడ్పడిన పండిత్ నెహ్రూకి మీద పేరు ఉండాలని కాంగ్రెస్ నేత అల్వి పేర్కొన్నారు. 

మరో పక్క బీజేపీ నాయకులు షెహజాద్ పూనావల్ల మాట్లాడుతూ, కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా ఆంటీ హిందూగా అనిపిస్తున్నట్లు ఆయన ప్రస్తావించరు. అంతేకాకుండా శివశక్తి పాయింట్ అలాగే తిరంగా పాయింట్ అనేది రెండు కూడా భారతదేశానికి సంబంధించినవే కదా అంటూ, మరి ఇటువంటి పేర్లను సిఫారసు చేసినప్పుడు కాంగ్రెస్ నేతలకు ఎందుకు నచ్చట్లేదు అంటూ ప్రశ్నించారు బిజెపి నేత. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు అన్నిటి మీద తమ ముద్రను వేసుకోవడానికి ముందు ఉంటారని, ఒకవేళ తమ ఆధ్వర్యంలో చంద్రయాన్ 2 అదేవిధంగా చంద్రయాన్-3 పంపించలేదు కానీ, ఒకవేళ పంపిస్తే, ఆ పాయింట్లకి ఇందిరా పాయింట్ రాజీవ్ పాయింట్ అని పేర్లు పెడతారేమో అంటూ కాంగ్రెస్ నేతల మీద దుమ్మెత్తి పోశారు బిజెపి నేతలు. 

చంద్రయాన్-3: 

ఇస్రో ద్వారా ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ఇప్పటికే సగం పని పూర్తి చేసుకుందని చెప్పుకోవాలి. ఆగస్టు 5కి ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క కక్ష్య(ఆర్బిట్)లోకి ప్రవేశించి మొదటి విజయాన్ని సాధించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరవుతూ చివరి కక్ష్య (ఆర్బిట్)లోకి ప్రవేశించడమే కాకుండా ఆగస్టు 23 సాయంత్రం సమయంలో, చంద్రుడు మీద అడుగు పెట్టబోతోంది చంద్రయాన్-3. 

ఆగస్టు 23న చంద్రుడు మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే క్షణాలు దగ్గర పడుతున్నాయి. భారతదేశం యావత్తు కూడా చంద్రయాన్-3 చంద్రుడు మీద సురక్షితంగా అడుగు పెట్టాలని తమ వంతు ప్రార్థనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి లూనార్ లాండర్ పనితీరు సవ్యంగానే ఉన్నట్లు సమాచారం అందింది. ఇంకో కొన్ని గంటలలోనే, సాయంత్రం సమయం నాటికి చంద్రుడు మీద, చంద్రయాన్-3 లాండర్ సురక్షితంగా, విజయవంతంగా అడుగుపెట్టే అవకాశం ఉంది అని ఇస్రో తెలియజేస్తుంది.