జీ20 స‌మ‌యంలో పోలీసులు పెట్టుకున్న కోడ్ నేమ్స్

దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడితోపాటు బ్రిటన్, యూఏఈ, సౌదీ, ఇటలీ, ఫ్రాన్స్, తదితర దేశాల అధినేతలకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించేందుకు ఢిల్లీ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. అత్యంత జాగ్రత్తగా ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేసి.. సెక్యూరిటీ పరంగా ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా చూడగలిగారు. ఇందుకోసం ఢిల్లీ పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల బృందం, ఎస్పీజీ అధికారుల బృందం కలిసి మూడ్రోజుల పాటు […]

Share:

దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడితోపాటు బ్రిటన్, యూఏఈ, సౌదీ, ఇటలీ, ఫ్రాన్స్, తదితర దేశాల అధినేతలకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించేందుకు ఢిల్లీ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. అత్యంత జాగ్రత్తగా ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేసి.. సెక్యూరిటీ పరంగా ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా చూడగలిగారు. ఇందుకోసం ఢిల్లీ పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల బృందం, ఎస్పీజీ అధికారుల బృందం కలిసి మూడ్రోజుల పాటు ప్రత్యేకంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా వీవీఐపీలు బస చేసే హోటల్స్ పేర్లు, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అనే వివరాలను ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇందుకోసం ప్రతి హోటల్ కు ఓ కోడ్ నేమ్ పెట్టుకున్నారు. వీవీఐపీలు ఉన్న ప్లేస్ లు, వారు వెళ్తున్న ప్లేస్ ల వివరాలు ఎవరికీ తెలియకుండా వైర్ లెస్ కమ్యూనికేషన్లలో సైతం కోడ్ నేమ్స్ తోనే మాట్లాడుకున్నారు. మరోవైపు ఈ కోడ్ నేమ్స్, వీవీఐపీల కదలికల వివరాలన్నీ ఉన్నత స్థాయి ఆఫీసర్లకు తప్ప.. కిందిస్థాయి సిబ్బందికీ తెలియనివ్వలేదు. ఇలా ఈ మూడ్రోజుల పాటు వీవీఐపీలకు సెక్యూరిటీని విజయవంతంగా కల్పించిన దానికి సంబంధించిన వివరాలను పోలీస్ శాఖ మంగళవారం వెల్లడించింది. 

కోడ్ నేమ్స్.. 

ఏ దేశానికి వెళ్లినా అమెరికా అధ్యక్షుడికి భద్రత మామూలుగా ఉండదు. అలాగే ఢిల్లీలో కూడా బైడెన్​కు పకడ్బందీగా సెక్యూరిటీ కల్పించారు. ఆయన బస చేసిన ఐటీసీ మౌర్య షెరటాన్ హోటల్ ను ఎస్పీజీ అధికారులు పండోరా అనే కోడ్ నేమ్ తో పిలుచుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య బస చేసిన షాంగ్రిలా హోటల్ గురించి సమారా అనే కోడ్ నేమ్​తో మాట్లాడుకున్నారు. ఇక ప్రగతి మైదాన్​ను గ్రౌండ్ జీరో అని, భారత్ మండపాన్ని నికేతన్ అని వ్యవహరించారు. అలాగే అన్ని దేశాల అధినేతలు వచ్చి రాజ్ ఘాట్​లో జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించడటంతో ఆ ప్లేస్​ను కూడా రుద్రపూర్ అనే కోడ్ నేమ్​తో ఢిల్లీ పోలీసులు, ఎస్పీజీ అధికారులు తమ కమ్యూనికేషన్స్​లో ఉపయోగించారు. ఇక నైజీరియా, నెదర్లాండ్స్, స్పెయిన్, మారిషస్ అధినేతలు, వరల్డ్ బ్యాంక్ అధికారులు స్టే చేసిన లీ మెరిడియన్ హోటల్​ను మహాబోధిగా వ్యవహరించారు. అలాగే యూఏఈ యువరాజు బసచేసిన తాజ్ మాన్ సింగ్ హోటల్​కు పారామౌంట్ అని కోడ్ నేమ్ పెట్టారు. వీటితోపాటు ద లలిత్, ద గ్రాండ్, క్లారిడ్జెస్, ఇతర ముఖ్యమైన హోటల్స్​కు కూడా కోడ్ వర్డ్స్ ఉపయోగించారు. 

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. 

వీవీఐపీల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు కారణమైన రెండు సంఘటనలు భద్రతా అధికారులను హడలెత్తించాయి. ముందు గా బైడెన్ కాన్వాయ్​లోని ఓ కారు అనూహ్యంగా యూఏఈ  యువరాజు బస చేసిన హోటల్ ముందు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. అయితే, వేరే ప్యాసింజర్​ను తీసుకొని వచ్చానని, ప్రొటోకాల్ విషయం తనకు తెలియదని ఆ కారు డ్రైవర్ చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇక, రెండో ఘటనలో.. హోటల్​లో సౌదీకి చెందిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా సౌదీ యువరాజుకు దగ్గరి దాకా దూసుకెళ్లడంతో సెక్యూరిటీ సిబ్బంది టెన్షన్ పడ్డారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీలో బస చేసిన హోటల్ పేరు పండోరా. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతులు ఉన్న హోటల్ పేరు సమారా. జీ20 సమిట్ వేదిక పేరేమో నికేతన్.. ఇదేంటీ? ఈ హోటళ్ల పేర్లు కొత్తగా ఉన్నాయి? జీ20 సమిట్ జరిగింది భారత్ మండపంలో.. అవునా.. కాదా? అనుకుంటున్నారా! నిజమే కానీ.. ఇవన్నీ వీవీఐపీల భద్రత కోసం సెక్యూరిటీ టీంలు పెట్టుకున్న కోడ్ నేమ్స్. ఈ కోడ్ నేమ్స్ తోనే ఢిల్లీలో మూడ్రోజుల పాటు వీవీఐపీల కదలికలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఈ వ్యవహారాన్నంతా కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు అనుక్షణం అలర్ట్​గా ఉండి పర్యవేక్షించారు.