కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగుపెట్టనుంది: కేటీఆర్

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఈ మేరకు చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మన బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, కేంద్రంలోని కొత్త ప్రభుత్వం నేత కార్మికులపై 5% జీఎస్‌టీని వెనక్కి తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ శాఖ మంత్రి కెటి రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు.  కేటీఆర్ ఇచ్చిన మాట:  […]

Share:

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఈ మేరకు చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మన బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, కేంద్రంలోని కొత్త ప్రభుత్వం నేత కార్మికులపై 5% జీఎస్‌టీని వెనక్కి తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ శాఖ మంత్రి కెటి రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. 

కేటీఆర్ ఇచ్చిన మాట: 

సోమవారం మన్నెగూడలో జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం నిలిపివేసిన నేత కార్మికుల సంక్షేమ పథకాలను వచ్చే ప్రభుత్వం కూడా మళ్లీ ప్రవేశపెట్టాలన్నారు. నేత కార్మికుల సంక్షేమం కోసం సీఎం కే చంద్రశేఖర్‌రావు అనేక వార్తా పథకాలను ప్రవేశపెట్టారని, ఇప్పటికే ఉన్న కొన్ని పథకాలను సవరించారని మంత్రి తెలిపారు. ఉప్పల్‌ భగత్‌లో చేనేత కన్వెన్షన్‌ సెంటర్‌, హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్‌ మ్యూజియంకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. 

నేతన్నలకు వార్షిక కవరేజీ 25 వేలతో హెల్త్‌కార్డులు అందజేస్తామని, నేతన్నకు చేయూత పథకంతో అనుసంధానం చేసి 59-75 ఏళ్ల మధ్య వయసు ఉన్న నేత కార్మికులకు కూడా ప్రస్తుత నేతన్నకు బీమా వర్తింపజేయడం జరుగుతుందన్నారు. టెస్కో సభ్యులకు ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని 12,500 నుంచి 25,000కు పెంచుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. సవరించిన చేనేత మిత్ర పథకం కింద 3,000 నేరుగా నేత కార్మికుల ఖాతాల్లో జమ చేస్తారు. గతంలో, నూలు, రంగులు అంతేకాకుండా కావలసిన కెమికల్స్ కొనుగోలుపై 50% సబ్సిడీ ఇప్పటికే అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 

మీకు ఏ ప్రభుత్వం కావాలి: 

అయితే చేనేత కార్మికులకు తమ తరఫునుంచి అన్ని సదుపాయాలు ఎప్పటిలాగే అందుతాయని పేర్కొన్నారు కేటీఆర్. వచ్చే ఎలక్షన్స్ లో ప్రజలు ఎవరిని ఎన్నుకొనాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారని, తప్పకుండా ఎవరి దగ్గర న్యాయం జరుగుతుందో ప్రజలకు బాగా తెలుసు అంటూ మాట్లాడారు కేటీఆర్. అయితే వచ్చే ఎలక్షన్స్ గురించి మరింత మాట్లాడుతూ, మీకు ఏ ప్రభుత్వం కావాలో మీరే నిర్ణయించుకోండి అంటూ, పథకాలు మాట ఇచ్చి పక్కకి తప్పుకునే కాంగ్రెస్ కావాలా? మతాల పేరు చెప్పి చిచ్చుపెట్టే బీజేపీ కావాలా? అంటూ ప్రస్తావించారు కేటీఆర్. 

ప్రతి ఏటా కేటీఆర్ పుట్టినరోజుకి సేవా కార్యక్రమాలు: 

తెలంగాణ బిఆరెస్ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కార్యకర్తలు, బిఆరెస్ నేతలు, మరి ఎంతోమంది అభిమానులు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పేరు మీద ఎన్నో వివిధ సేవాకార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. 

నిమ్స్(NIMS) హాస్పిటల్లో ప్రస్తుతం డయాలసిస్ తీసుకుంటూ క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఒక అబ్బాయి కోసం సహాయం కోరుతూ, సహాయ అభ్యర్థన ఆఫీసులో ఇవ్వడం జరిగింది. అయితే మరొక అభ్యర్థన యాదాద్రి బొంగిరి జిల్లా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చిన్నపిల్లవాడు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సహాయం కోరుతూ ఆఫీసుకు లెటర్ అందించారు. అంతేకాకుండా సన్ సిటీ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హాస్పటల్లో చేరిన మహమ్మద్ అనే వ్యక్తికి కూడా తమ తరఫునుంచి సరైన సాయం అందుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు కేటీఆర్.

ప్రతి ఎటా జూలై 24న, కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా, తెలంగాణలోని అనేక చోట్ల సేవా కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటాయి. కేటీఆర్ పేరు మీద ఎంతోమంది, ఆయన పుట్టినరోజు సందర్భంగా అవసరం అయిన వారికి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు.