మ‌హిళ‌తో హ‌ర్యానా సీఎం వెట‌కారం

ఇటీవల జరిగిన ఒక సమావేశంలో హరియాన చీఫ్ మినిస్టర్ మనోహర్లాల్ కట్టర్, ఒక ఆవిడ అడిగిన చిన్న విషయానికి వెటకారంగా సమాధానం చెప్పారు. సమాధానం చెప్పిన విధానం బాగోలేదని, ఆడవారితో ఎలా ప్రవర్తించాలో ముఖ్యమంత్రికి తెలియదని విపక్షాలు మండిపడుతున్నాయి.  ఏం సమాధానం చెప్పాడు:  ఒక గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన బిజెపి రాజకీయవేత్త, హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్లాల్ చెప్పిన సమాధానం తాలూకా వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక సమావేశం జరుగుతుండగా, […]

Share:

ఇటీవల జరిగిన ఒక సమావేశంలో హరియాన చీఫ్ మినిస్టర్ మనోహర్లాల్ కట్టర్, ఒక ఆవిడ అడిగిన చిన్న విషయానికి వెటకారంగా సమాధానం చెప్పారు. సమాధానం చెప్పిన విధానం బాగోలేదని, ఆడవారితో ఎలా ప్రవర్తించాలో ముఖ్యమంత్రికి తెలియదని విపక్షాలు మండిపడుతున్నాయి. 

ఏం సమాధానం చెప్పాడు: 

ఒక గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన బిజెపి రాజకీయవేత్త, హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్లాల్ చెప్పిన సమాధానం తాలూకా వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక సమావేశం జరుగుతుండగా, ఒక మహిళ తమ గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మించమని, తమ ఊర్లో వారు కూడా పని చేసుకునే వీలు దొరుకుతుంది అంటూ విజ్ఞప్తి చేస్తుంది. అయితే విషయాన్ని అడిగిన ఆవిడకి, తనదైన శైలిలో వెటకారంగా సమాధానం చెప్పడం జరిగింది హర్యానా చీఫ్ మినిస్టర్. ఫ్యాక్టరీ కట్టమని అడిగినందుకు ఆవిడని నవ్వుల పాలు చేశారు. ఆవిడ అడిగిన విషయాన్ని పక్కన పెట్టి, నెక్స్ట్ టైం చంద్రయాన్-4 పంపించినప్పుడు అందులో ఆమెను చంద్రుడు మీదకి పంపిస్తామని వెటకారంగా సమాధానం చెప్పారు హర్యానా చీఫ్ మినిస్టర్. 

మండిపడుతున్న విపక్షాలు: 

ప్రస్తుతం హర్యానా చీఫ్ మినిస్టర్ చెప్పిన సమాధానం చాలా వెటకారంగా ఉంది అంటూ కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీలు మండిపడుతున్నాయి. తమ ఊర్లో ఫ్యాక్టరీ వస్తే తమ ఊరి బాగుపడుతుందని తమ వాళ్ళందరికీ పని దొరుకుతుందని ఆశతో అడిగిన మహిళను, కించపరిచేలా మాట్లాడారని విపక్షాలు హర్యానా చీఫ్ మినిస్టర్ మాటలను ఖండించాయి. అంతేకాకుండా, అసలు విషయాన్నీ పక్కన పెట్టి చంద్రయ్-4 పంపించినప్పుడు ఆమెను అందులో చంద్రుడు మీదకి పంపిస్తామని సమాధానం, నిజానికి సిగ్గుపడాల్సిన విషయం అంటూ విపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. 

ఒక ఆడావిడ అడిగిన ప్రశ్నకు ఆమెను కించపరచడమే కాకుండా, సమావేశంలో అందరి ముందు నవ్వుల పాలు చేశారని సోషల్ మీడియా ద్వారా పార్టీ ప్రతినిధులు మండిపడుతున్నారు. తమకు ఏదో చేస్తారని ఆశతో ఓటు వేసిన పబ్లిక్ మీద హాస్యాస్పదంగా మాట్లాడడం, ఓటు వేయించుకొని మళ్ళీ తిరిగి వారిని నవ్వుల పాలు చేయడం బిజెపి పార్టీకే తగును అంటూ ట్విట్టర్ లో మరి కొంతమంది పోస్ట్ చేశారు. 

తమ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టమని అడిగిన మహిళతో వెటకారం చేసిన అదే ముఖ్యమంత్రి, ఒకవేళ ప్రధానమంత్రి మోదీ ఫ్యాక్టరీ కట్టమంటే స్పందన నిజంగా వేరేగా ఉంటుందని, మోదీ అడిగిన కోరికకి సంతోషపడిపోవడమే కాకుండా, మొత్తం ప్రభుత్వాన్ని ఫ్యాక్టరీ కట్టెందుకు దింపుతారు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు ప్రతిపక్ష నేతలు. 

ఆడవారు అంటే గౌరవమే లేదు: 

అంతేకాకుండా హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్లాల్ కట్టర్, తాను చెప్పిన సమాధానానికి సిగ్గుపడాలని, నిజంగా బిజెపి, ఆర్ఎస్ఎస్ బుద్ధి ఎటువంటిదో మరొకసారి చూపించారు అంటూ చీఫ్ మినిస్టర్ వ్యాఖ్యలను, ట్విట్టర్ వీడియో ద్వారా గుర్తు చేశారు కాంగ్రెస్ నేతలు. అయితే నిజానికి బిజెపి నాయకులకు ఆడవారి పట్ల గౌరవం లేదని, ఇటువంటి సంఘటనల ద్వారా మరొకసారి బిజెపి కించపరిచే బుద్ధి బయటపడిందని, ప్రతిపక్ష నేతలు వాపోతున్నారు. 

నిజానికి సమావేశంలో ఆవిడ అడిగిన విషయానికి, గౌరవప్రదమైన సమాధానం కోసం ఎదురుచూసిన మహిళకు చేదు అనుభవమే ఎదురయింది. హర్యానా చీఫ్ మినిస్టర్ ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. ఎంతో ఆశతో తమ ఊర్లో ఒక ఫ్యాక్టరీ వస్తే ఊరు బాగుపడుతుందని, తమవారికి ఉపాధి కలుగుతుందని ఆమె భావించి, ఆ విషయాన్ని స్వయంగా చీఫ్ మినిస్టర్ ముందు పెట్టడం జరిగింది. పదవిలో ఉన్న చీఫ్ మినిస్టర్ తమకు న్యాయం జరిగేలా చూస్తారని ఆశతో ఆ విషయాన్ని అడిగింది ఊరు మహిళ. కానీ అనుకోని సంఘటన ఎదురయింది. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన వ్యాఖ్యలు కరెక్టేనా?