ఏపీ రాజ‌ధాని వైజాగేన‌ని సీఎం ఫిక్స‌య్యారు:  విడ‌ద‌ల రజిని 

ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీకి రాజ‌ధాని అనేదే లేకుండా పోయింది. సుమారుగా పదేళ్ల నుండి అదిగో రాజధాని, ఇదిగో రాజధాని అని అంటూనే ఉన్నారు కానీ, ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం అనేదే జరగలేదు. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు – విజయవాడకి సమీపంలో ఉండే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంచుకున్నట్టు అధికారిక ప్రకటన చేసాడు. రైతుల దగ్గర నుండి వేల ఎకరాల భూములను సేకరించి రాజధాని నిర్మాణం మొదలు […]

Share:

ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీకి రాజ‌ధాని అనేదే లేకుండా పోయింది. సుమారుగా పదేళ్ల నుండి అదిగో రాజధాని, ఇదిగో రాజధాని అని అంటూనే ఉన్నారు కానీ, ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం అనేదే జరగలేదు. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు – విజయవాడకి సమీపంలో ఉండే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంచుకున్నట్టు అధికారిక ప్రకటన చేసాడు. రైతుల దగ్గర నుండి వేల ఎకరాల భూములను సేకరించి రాజధాని నిర్మాణం మొదలు పెట్టారు. అయితే 2019 వ సంవత్సరం లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాత అమరావతిని కాకుండా, మన రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతున్నాయని చెప్పుకొచ్చాడు. అది ప్రాక్టికల్ గా వర్కౌట్ కాకపోవడంతో విశాఖపట్నం ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు కొంతకాలం క్రితమే అధికారిక ప్రకటన చేసాడు ముఖ్యమంత్రి జగన్.

విశాఖపట్నం – గాజువాక అభివృద్ధి పై చర్చించుకున్నాం : విడదల రజిని 

ఇకపోతే రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని కూడా మన ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని గా వైజాగ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. వైజాగ్ ప్రాంతానికి వైసీపీ పార్టీ తరుపున  ఇంచార్జి గా వ్యవహరిస్తున్న విడదల రజిని ఇటీవలే ఒక వైజాగ్ అభివృద్ధి మీద ఒక రివ్యూ మీటింగ్ ని ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ కి రీజినల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బా రెడ్డి కూడా హాజరయ్యాడు. ఈ మీటింగ్ లో విశాఖపట్నం మరియు గాజువాక ప్రాంతాల అభివృద్ధి గురించి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో విడదల రజిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం అభివృద్ధి పై ప్రత్యేకమైన ద్రుష్టి సారించాడు అని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘రాజధాని గా వైజాగ్ ప్రాంతాన్ని  ప్రకటించినప్పటి నుండి  ముఖ్యమంత్రి గారు వైజాగ్ అభివృద్ధి పై ప్రత్యేకమైన ద్రుష్టి సారించాడు. ఇక ఈరోజు మేము ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో వైజాగ్ మరియు గాజువాక ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రధానంగా చర్చ సాగింది. రెవిన్యూ,GVMC, గడప గడపకి మన ప్రభుత్వం, నాడు నేడు వంటి కార్యక్రమాల గురించి కూడా చర్చించుకున్నాము’ అంటూ చెప్పుకొచ్చింది విడదల రజిని.

గ్లోబల్ స్టాండర్డ్స్ తో 5 సరికొత్త మెడికల్ కాలేజీలు :

విడ‌ద‌ల రజిని మాట్లాడుతూ ‘అన్నీ నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్స్ ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. జగనన్న సురక్షా పధకం క్రింద 11 రకాల సంక్షేమ కార్యక్రమాలను జగన్ గారు ప్రారంభించారు. ఈ పధకాలు మొత్తం అందరికీ అందుతున్నాయా లేదా అనేది సమీక్షించాము. ఈ సందర్భంగా మేము చేపట్టిన గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం లో జనాలకు సంక్షేమ పథకాలు సకాలం లో అందుతున్నాయో లేదో తెలుసుకున్నాము. వారి నుండి అద్భుతమైన స్పందన లభించింది’ అంటూ చెప్పుకొచ్చింది విడదల రజిని. ఇక తన ఆరోగ్య శాఖ కి సంబంధించి ఆమె మాట్లాడుతూ ‘ఇప్పటికే ఈ జిల్లాలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్ తో మరో 5 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించబోతున్నాము. విద్యార్థులు మెడికల్ చదవడానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఇక ఏమాత్రం లేదు, ఇక్కడే ఉన్నతమైన విద్య ని అందుకోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది విడదల రజిని. విడ‌ద‌ల రజిని మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రివ్యూ మీటింగ్ కి మేయర్ హరి వెంకట కుమారి, కేకే రాజు కూడా పాల్గొన్నారు.