అడ్వొకేట్‌పై మండిప‌డ్డ సీజేఐ

భార‌త చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) డీవై చంద్ర‌చూడ్.. ఓ అడ్వొకేట్‌పై మండిప‌డ్డారు. మూడు నెల‌లుగా అట్టుడికిపోతున్న మ‌ణిపూర్ హింస గురించి సుప్రీంకోర్టులో వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇద్ద‌రు కుకి జాతికి చెందిన మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించిన అంశం గురించి అడ్వొకేట్ బాన్సురి స్వ‌రాజ్ వాద‌న‌లు వినిపించారు. ఈ ఘ‌ట‌న మణిపూర్‌లో జ‌రిగింది. అలాంట‌ప్పుడు ఆయ‌న మ‌ణిపూర్ గురించే మాట్లాడ‌కుండా వెస్ట్ బెంగాల్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌డ్‌ల‌లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయి అని అన్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల […]

Share:

భార‌త చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) డీవై చంద్ర‌చూడ్.. ఓ అడ్వొకేట్‌పై మండిప‌డ్డారు. మూడు నెల‌లుగా అట్టుడికిపోతున్న మ‌ణిపూర్ హింస గురించి సుప్రీంకోర్టులో వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇద్ద‌రు కుకి జాతికి చెందిన మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించిన అంశం గురించి అడ్వొకేట్ బాన్సురి స్వ‌రాజ్ వాద‌న‌లు వినిపించారు. ఈ ఘ‌ట‌న మణిపూర్‌లో జ‌రిగింది. అలాంట‌ప్పుడు ఆయ‌న మ‌ణిపూర్ గురించే మాట్లాడ‌కుండా వెస్ట్ బెంగాల్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌డ్‌ల‌లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయి అని అన్నారు.

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల చంద్ర‌చూడ్ స్పందిస్తూ.. ఇప్పుడు మ‌ణిపూర్ గురించి కేసు వ‌చ్చింది కాబ‌ట్టి దాని గురించి మాట్లాడుకుందాం.. ఇత‌ర రాష్ట్రాల గురించి త‌ర్వాత చ‌ర్చించుకుందాం అని అన్నారు. అయిన‌ప్ప‌టికీ బాన్సురి స్వ‌రాజ్ విన‌కుండా ప‌దే ప‌దే ఇత‌ర రాష్ట్రాల్లో మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రిగిన అఘాయిత్యాల గురించి ప్ర‌స్తావించారు. దాంతో చంద్ర‌చూడ్‌కి ఒళ్లు మండిపోయింది. అంటే ఏంటి మీరు అనేది. అయితే దేశంలోని అందరు ఆడ‌వాళ్ల‌ని ర‌క్షించాలి, లేదంటే ఎవ్వ‌రికీ ర‌క్షించ‌కూడ‌దు అని అంటున్నారా అని మండిప‌డ్డారు. దాంతో అడ్వొకేట్ బాన్సురి స్వరాజ్ సైలెంట్ అయిపోయారు.

ఎక్క‌డో ఏదో జ‌రిగింది కాబ‌ట్టి మ‌ణిపూర్‌లోనూ జ‌రిగింది అని చేతులు దులిపేసుకోవ‌డానికి వీల్లేద‌ని సీజేఐ డీవై చంద్ర‌చూడ్ మంద‌లించారు. కేసు హియ‌రింగ్‌లో భాగంగా చంద్ర‌చూడ్ మ‌ణిపూర్ పోలీసుల‌పై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇద్ద‌రు కుకి జాతికి చెందిన మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించిన వీడియో బ‌య‌టికి వ‌చ్చింది జులైలో. కానీ ఆ ఘ‌ట‌న జ‌రిగింది మే 4న అయిన‌ప్పుడు ఎందుకు వెంట‌నే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. దానికి పోలీసులు బిక్క మొహం వేసుకుని చూస్తుండిపోయారు. కాబ‌ట్టి ఈ కేసు విచార‌ణ‌ను పోలీసుల‌కు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని  చెప్పారు. ఎందుకంటే ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను మెతీ వ‌ర్గానికి అప్ప‌గించి నగ్నంగా ఊరేగించేలా చేసిన ఘ‌ట‌న‌లో పోలీసులు హ‌స్తం కూడా ఉంద‌ని క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంద‌ని అన్నారు.

ఈ నేప‌థ్యంలో చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ఆరు ప్ర‌శ్న‌ల‌ గురించి చ‌ర్చించారు. ఈ ఆరు ప్ర‌శ్న‌ల‌కు 24 గంట‌ల్లో జ‌వాబులు స‌బ్మిట్ చేయాల‌ని డిమాండ్ చేసారు. ఇంత‌కీ ఆ 6 ప్ర‌శ్న‌లు ఏంటంటే..

  1. న‌మోదైన కేసుల‌కు సంబంధించిన పూర్తి బ్రేకప్ స్ట్ర‌క్చ‌ర్ కావాలి (వివ‌ర‌ణాత్మ‌కమైన‌వి)
  2. ఎన్ని జీరో ఎఫ్ఐఆర్లు న‌మోదు చేసారు?
  3. ఎన్ని పోలీస్ స్టేష‌న్ల‌కు ఆ కేసుల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసారు?
  4. ఇప్ప‌టివ‌ర‌కు ఈ కేసుల‌కు సంబంధించి ఎంత మందిని అరెస్ట్ చేసారు?
  5. అరెస్ట్ చేసిన నిందితుల‌కు లీగ‌ల్‌గా ఎలాంటి సాయ‌మైనా చేసారా? అంటే వారి త‌ర‌ఫున వాదించ‌డానికి ఎవ‌రైనా లాయ‌ర్ల‌ను నియ‌మించారా?
  6. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్ని సెక్ష‌న్ 164 వాంగ్మూలాల‌ను రికార్డ్ చేసారు?

ఈ ఆరు ప్రశ్న‌ల‌కు 24 గంట‌ల్లో స‌మాధానాలు కావాల‌ని సీజేఐ ఆదేశాలు జారీ చేసారు. అంతేకాదు, ఈ మ‌ణిపూర్ కేసును నిర్భ‌య‌తో పోల్చ‌లేమ‌ని ఈ సంద‌ర్భంగా సీజేఐ అన్నారు. ఈ కేసు గురించి ఇంకా చ‌ర్చించుకుంటూ కూర్చునే టైం లేద‌ని, మ‌ణిపూర్‌కి ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా కోలుకునేలా చేయాల‌ని తెలిపారు. అయితే కుకి జాతికి చెందిన ఆ ఇద్ద‌రు బాధిత మ‌హిళ‌లు త‌మ కేసుని సీబీఐకి ఇవ్వొద్ద‌ని సుప్రీంకోర్టును అభ్య‌ర్ధించారు. దాంతో సీజేఐ ఈ కేసును ప‌క్క రాష్ట్ర‌మైన అస్సాంకు ఇచ్చి విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది.