పిల్ల‌ల‌కు గంజాయి కలిపిన చాక్లెట్లు

చాక్లెట్ అంటే ఇష్టపడని వాలు ఎవరైనా ఉంటారా… పెద్దల నుంచి పిల్లల వరుకు అందరు ఇష్టంగా తింటారు…అయితే ఇప్పుడు మార్కెట్ లో కొత్త రకమైన చాకోలెట్స్ దొరుకుతున్నాయి. ఆ చాక్లెట్లు చాలా తీయగా ఉంటాయి. చాలా మత్తెక్కిస్తాయి. వాటి ఖరీదు కూడా పెద్దగా ఏమీ ఉండదు. కేవలం 20 రూపాయలకే  ఆ చాక్లెట్లు లభిస్తున్నాయి  ఇలాంటి చాక్లెట్లు పదే పదే పిల్లలు అడుగుతున్నా, పిల్లల ప్రవర్తనలో తేడా ఉన్నా సందేహించాలంటున్నారు కర్ణాటక పోలీసులు.. మీ పిల్లలు గంజాయి […]

Share:

చాక్లెట్ అంటే ఇష్టపడని వాలు ఎవరైనా ఉంటారా… పెద్దల నుంచి పిల్లల వరుకు అందరు ఇష్టంగా తింటారు…అయితే ఇప్పుడు మార్కెట్ లో కొత్త రకమైన చాకోలెట్స్ దొరుకుతున్నాయి. ఆ చాక్లెట్లు చాలా తీయగా ఉంటాయి. చాలా మత్తెక్కిస్తాయి. వాటి ఖరీదు కూడా పెద్దగా ఏమీ ఉండదు. కేవలం 20 రూపాయలకే  ఆ చాక్లెట్లు లభిస్తున్నాయి 

ఇలాంటి చాక్లెట్లు పదే పదే పిల్లలు అడుగుతున్నా, పిల్లల ప్రవర్తనలో తేడా ఉన్నా సందేహించాలంటున్నారు కర్ణాటక పోలీసులు.. మీ పిల్లలు గంజాయి చాక్లెట్స్ తినే ప్రమాదం ఉంది కనుక తల్లిదండ్రులు తస్మాత్‌ జాగ్రత్త.మీ పిల్లలు తినే చాక్లెట్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది.

మంగళూరులో పోలీసులు దుకాణాలపై రైడ్స్ చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 120 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు దుకాణాల్లోనే ఈ చాక్లెట్లు దొరికాయి. ఒక షాప్‌లో 35 కిలోలు, మరో షాపులో 85 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. 

చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు షాప్ ఓనర్లను అరెస్టు చేశారు. అనంతరం వారిని జుడీష్యియల్ కస్టడీకి తరలించారు. 

ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించిన చాకెట్లను పరీక్షించారు. చాక్లెట్‌లలో గంజాయి ఉన్నట్టు నివేదికలో తెలిసిందని మంగళూరు పోలీస్ కమిషనర్ కుల్దీప్ జైన్ తెలిపారు.

 చాక్లెట్లు ఉత్తర భారతదేశం నుంచి కొనుగోలు చేశారని చెప్పారు. ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

షాపు యజమానిలో ఒకరిని మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మరొకరిని మంగళూరు సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాయచూర్‌లో ఇదే పరిస్థితి… 

రాయచూరులోని ఓ ఇంట్లో గంజాయి చాక్లెట్  విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.ఇళ్లలో సాగిస్తున్న గంజాయి చాక్లెట్స్‌ బిజినెస్‌ గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్‌ పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం మత్తు వ్యాపారంలో ఇంకా ఎవరెవరూ ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

లీసుల సోదాల్లో రూ. 30, రూ. 50, రూ.100 ఇలా అన్ని ధరలలో గంజాయి చాక్లెట్స్‌ తయారు చేసి విక్రయిస్తున్నారు. సుమారు 6 గ్రాముల వరకు గంజాయి మిక్స్‌ చేసి చాక్లెట్ లాగా తయారు చేసి దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తయారైన గంజాయి చాక్లెట్ రాయచూర్‌లోని ఎల్‌బిఎస్ నగర్, ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా రోజులుగా ఈ చాక్లెట్స్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు.

పోలీసుల సోదాల్లో రెండు బ్రాండ్ల పేరుతో ఉన్న మొత్తం 482 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. పట్టుబడిన వారి నుంచి కింగ్‌పిన్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి సోదాలు చేపట్టారు. ప్రస్తుతం ఎక్సైజ్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గంజాయి అక్రమ వ్యాపారం వెనుక ఉన్న అసలు సూత్రదారుల కోసం వేట సాగిస్తున్నారు

అందుకే పేరెంట్స్  కాస్త  జాగ్రత్త గా ఉండాలి.. మీ పిల్లలు తినే చాక్లెట్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది. మీరు కాస్త బద్ధకంగా ఉండి, వారిని గమనించకుండా ఉంటే.. మీ పిల్లలు గంజాయి చాక్లెట్స్ తినే ప్రమాదం ఉంది.ఇప్పుడు మార్కెట్లో గంజాయి చాక్లెట్స్‌ విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. రాయచూరులోని ఓ ఇంట్లో గంజాయి చాక్లెట్ గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లలో సాగిస్తున్న గంజాయి చాక్లెట్స్‌ బిజినెస్‌ గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్‌ పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం మత్తు వ్యాపారంలో ఇంకా ఎవరెవరూ ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.