ఆపరేషన్ ముస్కాన్ లో 559 మందిని కాపాడిన ఛత్తీస్గఢ్ పోలీసులు

ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 72 మంది అబ్బాయిలు, 487 మంది అమ్మాయిలను రెస్క్యూ చేసిన చత్తీస్గడ్ పోలీసులు.ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 559 మందిని రెస్క్యూ చేసినట్టు మంగళవారం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా చాలామందిని పోలీసులు రెస్క్యూ చేశారు. ఇందులో 76 మంది జంజిగీర్ చంపాకు చెందినవారు, 56 మంది రాయ్ పూర్ కి చెందినవారు, 52 మంది బిలాస్పూర్ కి చెందినవారు, 52 మంది సక్తీ కి […]

Share:

ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 72 మంది అబ్బాయిలు, 487 మంది అమ్మాయిలను రెస్క్యూ చేసిన చత్తీస్గడ్ పోలీసులు.ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 559 మందిని రెస్క్యూ చేసినట్టు మంగళవారం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా చాలామందిని పోలీసులు రెస్క్యూ చేశారు. ఇందులో 76 మంది జంజిగీర్ చంపాకు చెందినవారు, 56 మంది రాయ్ పూర్ కి చెందినవారు, 52 మంది బిలాస్పూర్ కి చెందినవారు, 52 మంది సక్తీ కి చెందినవారు. మిగిలిన వాళ్ళు వేరే జిల్లాలకు చెందిన వాళ్లు. రికవర్ అయిన పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు తెలియజేశారు. పిల్లలను చూసి తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారని పోలీసులు తెలియజేశారు.

చత్తీస్గడ్ లో ఆపరేషన్ ముస్కాన్:

మిస్ అయిన పిల్లల కోసం జూన్ 1 నుంచి జూన్ 30 వరకు ఒక క్యాంపు కండక్ట్ చేయడం జరిగిందని పోలీసులు చెప్పారు. దీనికి సి ఐ డి ఎస్ సీ ద్వివేది నాయకత్వం వహించారు.దీన్ని చాలా రాష్ట్రాల్లో కండక్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, జమ్ము కాశ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, కర్ణాటకలో వెతికి వీరిని తమ తల్లిదండ్రులకు అప్పగించారు. హోం మినిస్టర్ తమరద్వాజ్ సాహూ ఆదేశాలతో మేము ఇదంతా చేశామని పోలీసులు చెప్పారు. 

ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏంటి? :

తప్పిపోయిన పిల్లలను ట్రేస్ చేయడానికి చత్తీస్గడ్ పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ అనే పేరుతో చాలామంది పిల్లలను రెస్క్యూ చేశారు. మన దేశంలో రోజుకి చాలామంది పిల్లలు మిస్ అవుతున్నారు. అందులో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మిగిలిన వాళ్లు కూడా నరకాన్ని అనుభవిస్తున్నారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులకు దూరం అవ్వడం వల్ల వారి లైఫ్ నాశనం అవుతుంది. కొంతమంది తమకు పని దొరికిన దగ్గరే పని చేసుకుంటూ చదువుకు దూరం అవుతున్నారు. ఇంకొంతమంది అన్నం కూడా లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా మిస్ అయిన వాళ్లని పట్టుకొని వాళ్ల పేరెంట్స్ కి అప్పగించడం అనేది అభినందించదగ్గ విషయం. చత్తీస్గడ్ పోలీసుల లాగే వేరే రాష్ట్ర పోలీసులు కూడా ఇలా అందరు పిల్లల్ని వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి చేరిస్తే చాలామంది జీవితాలని మార్చిన వాళ్లు అవుతారు. మనదేశంలో చాలామంది పిల్లలు తప్పిపోతున్నారు. తప్పిపోయిన పిల్లలు పడే బాధ వర్ణనాతీతం. వాళ్లు చాలా రకాలుగా ఇబ్బందుల పాలు అవుతుంటారు. వాళ్లకు సరైన తిండి కూడా దొరకదు. వాళ్లకు కావాల్సినవి ఏవి దొరకవు. నిజం చెప్పాలంటే చాలామందికి ఒక పూట అన్నం కూడా దొరకదు. అలాంటి వాళ్లని  తల్లిదండ్రుల దగ్గరికి చేరిస్తే వాళ్ల జీవితం మెరుగవుతుంది. అన్ని రాష్ట్రాల పోలీసులు ఇలాగే చేస్తూ ఉంటే మన దేశం అన్ని రకాలుగా ముందు వరుసలో ఉంటుంది. దేశంలో ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయి. పోలీసులు ఇలా చేస్తే వీటిలో సగం తగ్గిపోతాయి. ఏదేమైనా చత్తీస్గడ్ పోలీసులు ఒక కొత్త మార్గానికి శ్రీకారం చుట్టారు.దీన్ని అన్ని రాష్ట్రాల వాళ్లు ఆదర్శంగా తీసుకొని వాళ్లు కూడా ఇలాగే చేస్తారని ఆశిద్దాం.