మీటింగ్ సమయంలో ఛత్తీస్‌గఢ్ సీఎం మొబైల్లో ఆటలు

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఎలక్షన్ కమిషన్ కూడా పలు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలను ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే పలు రాజకీయ సమావేశాలు జరుగుతున్న క్రమం కనిపిస్తుంది. ఛత్తీస్‌గఢ్ సీఎం కాంగ్రెస్ మీటింగ్ జరుగుతున్న సమయంలో మొబైల్ ఫోన్లో తనకి నచ్చిన గేమ్స్ ఆడుతూ ఉన్నాడంటూ, బిజెపి ఛత్తీస్‌గఢ్ సీఎం ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.  ఛత్తీస్‌గఢ్ సీఎం మొబైల్లో ఆటలు:  తన […]

Share:

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఎలక్షన్ కమిషన్ కూడా పలు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలను ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే పలు రాజకీయ సమావేశాలు జరుగుతున్న క్రమం కనిపిస్తుంది. ఛత్తీస్‌గఢ్ సీఎం కాంగ్రెస్ మీటింగ్ జరుగుతున్న సమయంలో మొబైల్ ఫోన్లో తనకి నచ్చిన గేమ్స్ ఆడుతూ ఉన్నాడంటూ, బిజెపి ఛత్తీస్‌గఢ్ సీఎం ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది. 

ఛత్తీస్‌గఢ్ సీఎం మొబైల్లో ఆటలు: 

తన మొబైల్ ఫోన్‌లో సీఎం గేమ్ ఆడుతున్న చిత్రాన్ని షేర్ చేసింది, ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతిపక్ష బీజేపీ. మంగళవారం రాత్రి రాజధాని రాయ్‌పూర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం రాజీవ్ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ వార్త బయటపడింది. సోషల్ మీడియాలో బిజెపి షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కుమారి సెల్జా, రాష్ట్ర పార్టీ చీఫ్ దీపక్ బైజ్ మరియు ఇతర నాయకులు సమావేశంలో కనిపించగా, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ అజయ్ మాకెన్ మరియు మరికొందరు సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ జాతీయ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫోటో షేర్ చేస్తూ, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం రాదని తెలిసి కూడా రిలాక్స్‌గా ఉన్నారు అని రాశారు. 

స్పందించిన చత్తీస్‌గఢ్ సీఎం: 

నేను క్యాండీ క్రష్ ఆడుతున్న ఫోటో చాలా బాగా తీశారని స్పందించారు సీఎం. ఇప్పుడు దానికి బీజేపీ అభ్యంతరం చెబుతోందని.. ఇంకా ఊరుకుంటే నిజానికి నేను ఉన్నందుకు కూడా వారికి అభ్యంతరం ఉండొచ్చేమో అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. అయితే ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో చత్తీస్‌గఢ్ ప్రజలే నిర్ణయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరేమనుకున్నప్పటికీ గేడి ఆడడం, క్యాండీ క్రష్ ముఖ్యంగా ఆడడం తనికి ఎంతో ఇష్టమని, ఇప్పటికే చాలా లెవెల్స్ క్రాస్ చేసి ముందుకు వెళ్లాలని, మరి ముఖ్యంగా ఎవరికి ప్రభుత్వం వస్తుందో ఎవరికీ రాదో అంతా ప్రజల చేతిలో ఉందని మరొకసారి గుర్తు చేశారు సీఎం.

ఎన్నికల జోరు: 

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తేదీలు ఖరారు చేసింది. 

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7 మరియు 17 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ఇప్పటివరకు 90 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ ఇప్పటివరకు 85 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న అంతేకాకుండా నవంబర్ 17న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న రాజస్థాన్ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది మరియు డిసెంబర్ 5 నాటికి పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మాత్రమే రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు.