కాల్పులు జ‌రిపిన పోలీస్‌కి బ్రెయిన్‌లో క్లాట్

జైపూర్-ముంబై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలులో నలుగురిని కాల్చి చంపిన విషాద సంఘటనకు కారణమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీస్‌ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ఇప్పుడు ప్రభుత్వ రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. పాల్ఘర్ సమీపంలో జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒక్కసారిగా భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఏం జరిగింది:  పోలీస్‌ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కుటుంబ సభ్యులు ఇండియా టుడేతో మాట్లాడుతూ, మధురలోని చేతన్ సింగ్ పరిస్థితి మునపటి నుంచి బాగోలేదని, అతని ఎక్కువ ఒత్తిడికి […]

Share:

జైపూర్-ముంబై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలులో నలుగురిని కాల్చి చంపిన విషాద సంఘటనకు కారణమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీస్‌ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ఇప్పుడు ప్రభుత్వ రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. పాల్ఘర్ సమీపంలో జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒక్కసారిగా భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

అసలు ఏం జరిగింది: 

పోలీస్‌ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కుటుంబ సభ్యులు ఇండియా టుడేతో మాట్లాడుతూ, మధురలోని చేతన్ సింగ్ పరిస్థితి మునపటి నుంచి బాగోలేదని, అతని ఎక్కువ ఒత్తిడికి గురవునట్లు చెప్పారు. అంతేకాకుండా చేతన్య ఆరోగ్యం క్షయణించిన కారణంగా, అతను మరింత ఒత్తిడికి లోనవ్వడం వల్ల బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టిందని, దాని గురించి చేతన్ సింగ్ మందులు వాడుతున్నాడని అతని భార్య వెల్లడించింది. అయితే, కోపానికి సంబంధించిన సమస్యలు ఏమీ అతనికి ప్రస్తుతానికి లేవని ఆమె స్పష్టం చేసింది.

చేతన్ సింగ్ గురించి మరింత: 

చేతన్ సింగ్ తన తండ్రి మరణానంతరం RPFలో చేరాడు. అతను తన కుటుంబం మరియు పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతున్న జీవితం. అతను ఎప్పుడూ వివాదాలకు పాల్పడలేదని మరియు సహోద్యోగులతో ఎటువంటి విభేదాలు లేకుండా 14 సంవత్సరాలుగా రైల్వేలో పనిచేశాడని అతని కుటుంబం, రైలులో హత్యలకు పాల్పడిన చేతన్ సింగ్కు సపోర్టుగా మాట్లాడారు.

సంఘటన సమయంలో రైలులో ఉన్న RPF కానిస్టేబుల్ అమయ్ ఘనశ్యామ్ ఆచార్య చెప్పిన దాని ప్రకారం, చేతన్ సింగ్ రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో కాస్త అనారోగ్యంతో కనిపించడని, అందుకే అతనిని కాలి బర్త్ కి పంపించినట్లు చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఒక దుర్ఘటన రైల్వేలో ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నందున, కాల్పుల వెనుక ఉద్దేశంపై దర్యాప్తు కొనసాగుతోంది. 

ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?: 

ఏది ఏమైనాప్పటికీ నిజ నిజాలు బయట పడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం, దేశంలో అనేకమైన హత్యలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి మనిషి ఆలోచన తప్పు దారి పడుతుందని ఇలాంటి సంఘటనలు వెంటనే తెలుస్తుంది. ఒక మనిషిని మరొక మనిషి చంపే అంత క్రూరమైన ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయి? ఈ మధ్యకాలంలో ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయి .ముఖ్యంగా యువతలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం కుటుంబం మీద, దేశ భవిష్యత్తు మీద దృష్టి ఉంచే యువత ముఖ్యంగా ఇప్పుడు, కేవలం మాదకద్రవ్యాలు మీద కుట్రలు, హత్యలు మీద దృష్ట పెడుతున్నారు.

ఒకరకంగా వీటన్నిటికీ కారణం యువతని ప్రేరేపించే వ్యసనాలు అందుబాటులోకి రావడం. అంతే కాకుండా, కుట్రలు కుతంత్రాలతో కూడిన సినిమాలకు యువత ఎక్కువగా ఆకర్షితం అవడం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించుకోకపోవడం వల్ల పిల్లలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. కేవలం చిన్నతనం నుంచి అలవాటు చేసే కొన్ని విలువలు, యువతని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా చెడు స్నేహం, పతనానికి మొదటి మెట్టు. అందుకే యువత మంచి స్నేహాన్ని మాత్రమే వెతకాలి. చెడు స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉందని గుర్తుంచుకోండి. 

ఇప్పుడు జరిగిన సంఘటనలో తప్పు చేసినప్పటికీ, చంపుకునే అంత క్రూరమైన ఆలోచన అయితే తప్పు. అందుకే, అసలు చంపాలని ఆలోచన కూడా మన బుర్రలోకి రాకుండా చూసుకోవాలి. చావుకి సంబంధించి ప్రేరేపించే కొన్ని విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. ఈ భూమ్మీద ప్రతి మనిషికే కాదు ప్రతి ప్రాణికి బ్రతికే అవకాశం సమానంగా ఉంటుంది. ఒకరిని చంపే హక్కు మరొకరికి ఎవరిచ్చారు? ఒకరు తప్పు చేస్తే తప్పకుండా వారికి ఏదో ఒక రోజు శిక్ష పడక తప్పదు. ఇలాంటివి గుర్తు చేసుకుంటే కనుక, చెడు ఆలోచనలు, ఒకరిని హింసించే ఆలోచనలు, మనిషి ఆలోచనలకు రావు.