తమిళనాడు వాసి బ్యాంక్ అకౌంట్లో రూ.753 కోట్లు

తమిళనాడులో కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అనుకోకుండా కొంతమంది వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో తమకు తెలియకుండానే కోట్ల రూపాయలు కనిపిస్తుండడంతో చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియనప్పటికీ, ఇటీవల మరొకరి ఎకౌంట్లో సుమారు రూ.753 కోట్లు ఉన్నాయని తెలిసి బ్యాంకును ఆశ్రయించాడు ఒక వ్యక్తి.  అసలు విషయం:  ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో చాలామంది అకౌంట్లో కోట్ల రూపాయలు జమవుతున్న క్రమం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియనప్పటికీ, ఇటీవల మరొక సంఘటన […]

Share:

తమిళనాడులో కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అనుకోకుండా కొంతమంది వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో తమకు తెలియకుండానే కోట్ల రూపాయలు కనిపిస్తుండడంతో చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియనప్పటికీ, ఇటీవల మరొకరి ఎకౌంట్లో సుమారు రూ.753 కోట్లు ఉన్నాయని తెలిసి బ్యాంకును ఆశ్రయించాడు ఒక వ్యక్తి. 

అసలు విషయం: 

ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో చాలామంది అకౌంట్లో కోట్ల రూపాయలు జమవుతున్న క్రమం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియనప్పటికీ, ఇటీవల మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫార్మసీలో పని చేస్తున్న ఒక వ్యక్తి తన స్నేహితుడికి రూ.2,000 పంపిద్దామని తన అకౌంట్ చూసుకునేసరికి, సుమారు రూ.753 కోట్లు అతని అకౌంట్లో ఉన్నట్లు గుర్తించాడు. అంత డబ్బును తన అకౌంట్లో చూసుకున్న ఆ వ్యక్తి మొదటిగా ఆశ్చర్యపోయాడు. తర్వాత బ్యాంకు వాళ్ళని సంప్రదించగా వెంటనే ఆయన అకౌంట్ ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. 

తమిళనాడు రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగడం ఇది మూడోసారి. తమిళనాడుకు చెందిన ఒక టాక్సీ డ్రైవర్ రాజకుమార్ అనే వ్యక్తి ఎకౌంట్లో సుమారు రూ.9,000 కోట్లు ఉన్నాయని గ్రహించి వెంటనే, ఆయన ఎకౌంటు ఉన్న తమిళనాడు మరిసెంట్రల్ బ్యాంక్ వాళ్లకి సమాచారం అందించగా, వాళ్ళు వెంటనే ఆయన అకౌంట్ లో నుంచి డబ్బులను విత్ డ్రా చేశారు. తంజావూర్ కి చెందిన గణేషన్ అనే మరో వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో రూ.756 కోట్లు ఇటీవల గుర్తించినట్లు సమాచారం. 

రూ. 2,000 నోట్ల కథ ముగిసినట్టే: 

2,000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి గడువు ముగియడానికి ఒక రోజు ముందు, RBI ప్రజలకు మరింత సమయం ఇవ్వడానికి వెసులుబాటు కనిపించింది. ఈ ఏడాది మే 19వ తేదీన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలు తమ రూ. 2,000 కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే, ఇటీవల ఆర్‌బిఐ రూ. 2,000 కరెన్సీ నోట్లను తిరిగి ఇవ్వడానికి లేదా బ్యాంకులకు మార్చుకోవడానికి అక్టోబర్ 7 వరకు సమయం ఇచ్చింది. 

రూ.2,000 నోట్లను నవంబర్ 2016లో ప్రవేశపెట్టారు, కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దును ప్రకటించిన వెంటనే అన్ని రూ.500 మరియు రూ.1,000 నోట్ల చట్టబద్ధమైన టెండర్ హోదాను ఉపసంహరించుకుంది. మార్చి 2017 నాటికి రూ.2000 నోట్లలో దాదాపు 89 శాతం విడుదలయ్యాయి. తర్వాత ఆర్థిక సంవత్సరం నాటికి, చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.6.73 లక్షల కోట్ల నుంచి రూ.3,63 లక్షల కోట్లకు తగ్గింది. RBI మింట్ ప్రకారం చూసినట్లయితే 2018-2019లో రూ. 2,000 నోట్ల ముద్రణను అనేది నిజానికి నిలిపివేసింది. ఆగస్టు చివరి తేదీకి, సుమారు 0.24 లక్షల కోట్ల రూ. 2,000 నోట్ల కలెక్షన్ జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు అక్టోబర్ 7 తర్వాత నుంచి బ్యాంకు వాళ్లు కూడా 2,000 రూపాయల నోట్లు సేకరణ ఆపేసినట్లు తెలుస్తోంది.

నిజంగా చెప్పుకోవాలంటే, 2016 లో నోట్లు రద్దు అయినప్పుడు  ఇంకా చెప్పుకోవాలంటే, ఎంతోమంది ముసలి వాళ్ళు బ్యాంకులలో దాచుకోకుండా, ఇంట్లో దాచుకున్న డబ్బు పూర్తిగా వృధా అయిపోయింది. చాలామందికి నోట్ల రద్దు విషయం లేటుగా తెలిసినందువల్ల, ఇంట్లో దాచుకున్న డబ్బు ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా వరకు నష్టపోయారు. కానీ ఈసారి, అలా జరగకుండా ఉండేందుకు, సెప్టెంబర్ చివరి తేదీ వరకు రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి గడువు ఇచ్చారు. అయితే ఇప్పుడు కొన్ని మినహాయింపులు కారణంగా, 2,000 రూపాయల నోట్లు డిపాజిట్ అలాగే ఎక్స్చేంజ్ కి సంబంధించి అక్టోబర్ 7 వరకు సమయాన్ని అందించారు.