చాట్‌జీపీటీ నా జీవితాన్ని దెబ్బకొట్టింది అంటున్న‌ కోల్‌కతా విద్యార్థి

చాట్‌ జీపీటీ వంటి AI సాధనాలు ప్రారంభమైనప్పటి నుండి, అవి కంటెంట్ సృష్టిలో వందలాది ఉద్యోగాల పోవడానికి  కారణమయ్యాయని, ఫలితంగా ప్రజల జీవనోపాధిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నమ్ముతారు.అలంటి సంఘటనే  శరణ్య బట్టాచార్య కు జరిగింది  డిజిటలైజేషన్‌ ప్రక్రియతో ఉన్న లాభాల వల్ల అనేక సంస్థలు తమ వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయుక్తమైన టెక్నాలజీగా భావిస్తున్నాయి. ఇది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మానవ వనరులకున్న ప్రాధాన్యతను ఇది తగ్గించేలా చేస్తోంది. […]

Share:

చాట్‌ జీపీటీ వంటి AI సాధనాలు ప్రారంభమైనప్పటి నుండి, అవి కంటెంట్ సృష్టిలో వందలాది ఉద్యోగాల పోవడానికి  కారణమయ్యాయని, ఫలితంగా ప్రజల జీవనోపాధిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నమ్ముతారు.అలంటి సంఘటనే  శరణ్య బట్టాచార్య కు జరిగింది 

డిజిటలైజేషన్‌ ప్రక్రియతో ఉన్న లాభాల వల్ల అనేక సంస్థలు తమ వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయుక్తమైన టెక్నాలజీగా భావిస్తున్నాయి. ఇది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మానవ వనరులకున్న ప్రాధాన్యతను ఇది తగ్గించేలా చేస్తోంది. 2022 చివరి నాటికి ఆమె పనిభారం నెలకు 1-2 కథనాలకు తగ్గిందని శరణ్య భట్టాచార్య వెల్లడించారు.

కోల్‌కతాకు చెందిన ఓ 22 ఏళ్ల యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఛాట్ జీపీటీ వల్ల తన ఆదాయం ఎలా తగ్గిపోయిందో సోషల్ మీడియాలో వివరించారు కోల్‌కతాకు  చెందిన శరణ్య భట్టాచార్య AI తో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం డిగ్రీ చదువుతోన్న శరణ్య.. స్థానికంగా క్రియేటివ్‌ సొల్యూషన్స్‌ ఏజెన్సీకి కాపీరైటర్‌గా ఫ్రీలాన్సింగ్‌ చేస్తోంది. తద్వారా వచ్చిన డబ్బులతో ఆమె చదువు కుంటోంది. ఎస్‌ఈవోకి అనుగుణంగా కథనాలు రాసి నెలకు దాదాపు రూ.20,000 వరకు సంపాదించేది.

కానీ, చాట్‌జీపీటీ వినియోగంలోకి వచ్చిన తర్వాత శరణ్య జీవితాన్ని కష్టాలు మొదలయ్యాయి. గతేడాది చివరితో పోల్చితే వర్క్‌లోడ్‌ బాగా తగ్గిపోవడం .. నెలకు 1 లేదా 2 కథనాలకు మాత్రమే ఆ ఏజెన్సీ అవకాశం ఇవ్వడం మరియు  ఎక్కువ కథనాలు రాసేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ సంస్థ అడిగితే వారి నుంచి ఎలాంటి వివరణ రాలేదు అని  తాను చేసే పనిని AI తో ఆ సంస్థ చేయించుకుంటోందని.. అందుకే తక్కువ పనిని తనకు అప్పగిస్తున్నారని శరణ్య పేర్కొన్నారు. 

తన  తల్లి చీరలు అమ్ముతూ ఉంటారు అని ఖర్చుల కోసం ఆమెను డబ్బులు అడగడం బాధగా ఉందని శరణ్య తనబాధ ను వెళ్లబోసుకున్నారు. ఇంటి ఖర్చుల కోసం లెక్కలు వేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.మనం ఎంత తింటున్నామో గమనించాల్సి వస్తోంది..అని  తినడానికి బయటికి వెళ్లడం వంటి చిన్న చిన్న సంతోషాలను పక్కనబెట్టేశాం.అని . మేము ఇప్పుడు ప్రతి రెండు నెలలకు ఒకసారి మాత్రమే రెస్టారెంట్‌కు వెళ్లగలం.. ఆహారం, బిల్లుల వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చుచేయాల్సి వస్తోంది’అని పేర్కొన్నారు శరణ్య .

ఎవరిపైనా ఆధారపడకుండా చదువు కొనసాగించానని, AI  తన జీవితాన్ని కష్టాల్లోకి నెట్టిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు, గత రెండు నెలలుగా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వివరించింది. యంత్రాలు చేసే పనికి, మనుషులు చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంటుందన్న ఆమె.. ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని సంస్థలు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. లేదంటే చాలా మంది రోడ్డున పడాల్సి వస్తుందని తన కోపాన్ని బాధ రూపం లో వెల్లడించారు. 

భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కాపీ రైటర్‌లు దీనివల్ల ప్రభావితమవుతున్నారు.. భవిష్యత్తులో మానవులు తమ రాత నైపుణ్యాలనుAI తో అనుసంధానించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మార్గం ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ భట్టాచార్య పోస్ట్ లో తెలిపారు 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ బయోలాజికల్ సైన్స్ చేస్తున్నారు శరణ్య. అమ్మ కి తోడుగా తను సంపాదించిన డబ్బుతో చదువుకుంటూ హాయిగా ఉండే నేను అకస్మాతుగా తన జీవితం మారిపోయింది అని బాధపడ్డారు అంతే కాకుండా  ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బంది తగ్గింపుకు సంబంధించి కంపెనీలు మరింత నైతిక విధానాన్ని అవలంబించాలని భావిస్తోంది. మానవ కార్మికులకు మద్దతు ఇస్తూనే AI సాంకేతికతను ఉపయోగించాలి అని ఆమె అభిప్రాయాన్ని తెలిపారు