కాలంతో పాటే విద్యా వ్య‌వ‌స్థా మారాలి: సీఎం జ‌గ‌న్

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్  రియాలిటీ మరియు ఆగ్యుమెంటెడ్ రియాలిటీ లను మెడికల్ మరియు సైన్స్ కోర్సులలో ప్రారంభించాలని తెలిపారు. మన రాష్ట్ర యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్త కొత్త ప్రయోగాలను చేసి అనేకమైనవి రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ మరియు వైస్ ఛాన్స్లర్ తో కలిసి క్యాంప్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో తెలిపారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మనం విద్యార్థులను ఆచరణాత్మక జ్ఞానంలోనే కాకుండా, టీచింగ్ మెథడ్స్ ఎలా […]

Share:

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్  రియాలిటీ మరియు ఆగ్యుమెంటెడ్ రియాలిటీ లను మెడికల్ మరియు సైన్స్ కోర్సులలో ప్రారంభించాలని తెలిపారు.

మన రాష్ట్ర యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్త కొత్త ప్రయోగాలను చేసి అనేకమైనవి రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ మరియు వైస్ ఛాన్స్లర్ తో కలిసి క్యాంప్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో తెలిపారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మనం విద్యార్థులను ఆచరణాత్మక జ్ఞానంలోనే కాకుండా, టీచింగ్ మెథడ్స్ ఎలా డిజైన్ చెయ్యాలో మరియు క్యూస్షన్ పేపర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మొత్తం అన్నిటిలో కూడా మార్పులు తేవాలని చెప్పారు. ఎక్కువగా థియరీ కి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు. దానికి సంబంధించిన కొన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యి సంబంధించి 4-5 యూనివర్సిటీల సహకారంతో ఇంజనీరింగ్, మెడికల్ మరియు ఇతర ఫ్యాకల్టీలు పనిచేయాలని తెలిపారు.

ముఖ్యమంత్రి మాటల్లో: 

ముఖ్యమంత్రి యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్ తో సమవేశమైనప్పుడు విద్యా బోధనలో లక్ష్యాలు మరియు విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేలాగా ఎక్కడ కూడా మన విద్య తక్కువ కాకూడదని చెప్పారు. పూర్వం స్టీమ్ ఇంజన్ల నుంచి ఈనాటి కంప్యూటర్స్ వరకు మనం ఒకల్ని అనుసరిస్తూనే వచ్చాం అని, కానీ మనకంటూ ఒక గుర్తింపు రావాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం వేరే దేశాలను చూసుకుంటే ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ల విద్యా విధానం మరియు పరీక్ష విధానాలు చాలా ఆధునికంగా ఉన్నాయి అన్నారు. మనం కూడా అలాంటి ప్రక్రియలో లేదా విద్యాసంస్థలో పలు మార్పులు చేసినట్లయితే మనం నిపుణులను పిలిచి ఒక సమావేశంలో వీటి గురించి చర్చిద్దాం అని చెప్పారు. రెండు వేరువేరు బోర్డ్స్ ఉండాలని చెప్పారు. ఒకటి ప్రైమరీ ఎడ్యుకేషన్ మరొకటి హయ్యర్ ఎడ్యుకేషన్. దానివల్ల విద్య బోధన అనేది బాగుంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వైపు అడుగులు: 

రాష్ట్రంలో ఉన్న వైస్ ఛాన్స్లర్ అందర్నీ హయ్యర్ ఎడ్యుకేషన్ కి కీలక పాత్రగా ఉండాలని తెలియజేశారు. ప్రతి విద్యా సంస్థలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ విద్యా పరికరాలలో వాడాలని సూచించారు. దానివల్ల విద్యార్థులు తమకు తానుగా ఆలోచించుకునే విధానం పెరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

జర్మన్ కౌన్సిలర్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. ఆయన వారి దేశంలో బాగా పని చేసేవారు లేరని చాలా తక్కువ మంది ఉన్నారని వాస్తవానికి మిగతా దేశాలలో కూడా జనాభా అసమాతుల్యత చెందుతున్నారని చెప్పారు. వారి దేశంలో 70 శాతం జనాభా మాత్రమే పని చేయగలిగే జనాభా ఉన్నారని చెప్పారు. మనం విద్యార్థులను ప్రాపర్ గా ట్రైన్ చేసి ప్రపంచ జ్ఞానాన్ని పెంచాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మనం వివిధ విద్య రంగాల్లో కొత్త కోర్సులు పెట్టాలని, దానివల్ల విద్యార్థులకు ఎంపిక చేసుకునే అవకాశం దొరుకుతుందని చెప్పారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ విద్యాబోధనలో కూడా మార్పులు తేవాలని చెప్పారు. దానిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ ని చేర్చాలని చెప్పారు. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ మరియు విరుచువల్ రియాలిటీ కూడా కోర్సులలో చేర్చాలని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మన విద్యాబోధన ఎక్కడ తగ్గకూడదని ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం కూడా సమానంగా పోటీ పడాలని ఆధునిక పద్ధతుల్లో విద్యార్థులు చాలా ఉన్నత స్థాయికి చేరాలని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ విషయాలపై చర్చించారు.