తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్న చాందీ ఊమెన్ 

ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన చాందీ ఊమెన్, ఉప ఎన్నికల్లో తన సత్తా చాటుకున్నాడు. తన తండ్రి ఊమెన్ చాందీకి మించిపోయాడు. కేరళలోని పుతుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన చాందీ ఊమెన్ తన తండ్రి 33,255 ఓట్ల ఆధిక్యత రికార్డును బద్దల కొట్టి తన సత్తా చాటుకున్నాడు. తనదే పై చేయి:  కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి శుక్రవారం జరిగిన ఉప ఎన్నికల్లో, కాంగ్రెస్ దిగ్గజం ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్ 36,000 ఓట్లకు పైగా […]

Share:

ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన చాందీ ఊమెన్, ఉప ఎన్నికల్లో తన సత్తా చాటుకున్నాడు. తన తండ్రి ఊమెన్ చాందీకి మించిపోయాడు. కేరళలోని పుతుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన చాందీ ఊమెన్ తన తండ్రి 33,255 ఓట్ల ఆధిక్యత రికార్డును బద్దల కొట్టి తన సత్తా చాటుకున్నాడు.

తనదే పై చేయి: 

కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి శుక్రవారం జరిగిన ఉప ఎన్నికల్లో, కాంగ్రెస్ దిగ్గజం ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్ 36,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు. నిజానికి మొదటి రౌండ్ నుండి కాంగ్రెస్-యుడిఎఫ్ అభ్యర్థి తన సత్తాను చాటుకుంటూ వచ్చాడు. రౌండ్‌లోనూ, ప్రత్యర్థి, అధికార ఎల్‌డిఎఫ్ అభ్యర్థి జైక్ సి థామస్, ఆధిక్యం సాధించలేకపోయారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నాయకుడు ఊమెన్ చాందీ పుతుపల్లి నుంచి ఐదు దశాబ్దాలకు పైగా రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో 33,255 ఓట్ల తేడాతో తన తండ్రి రికార్డును చాందీ ఊమెన్ అధిగమించగలిగారు. ఊమెన్ చాందీ మృతితో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు సెప్టెంబర్ 5న పోలింగ్ జరిగింది. 

చాందీ ఊమెన్ గురించి మరింత: 

కొట్టాయం జిల్లాలోని పుతుపల్లిలో మార్చి 1986లో జన్మించిన చాందీ ఊమెన్, 1992లో లయోలా స్కూల్‌లో తన పదవ తరగతి పూర్తి చేశాడు. న్యూ ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి BA ఆనర్స్ మరియు MA (చరిత్ర) పూర్తి చేశారు.

చాందీ ఊమెన్ 2006 మరియు 2007 మధ్య కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అతని పోస్ట్-గ్రాడ్యుయేషన్ తర్వాత, చాందీ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి LLB మరియు 2015-16లో బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ చట్టంలో LLM పూర్తి చేసారు.

2016లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సమ్మర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, చాందీ ఊమెన్ న్యూ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎమ్ క్రిమినాలజీని పూర్తి చేశారు. అతను ప్రాక్టీస్ లో ఉన్న ఒక లాయర్, అంతేకాకుండా ఢిల్లీలోని అమిటీ యూనివర్సిటీ మరియు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. 37 ఏళ్ల చాందీ ఊమెన్ తన కాలేజీ రోజుల నుంచి కూడా కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. 

ప్రస్తుతం, అతను యూత్ కాంగ్రెస్ జాతీయ ఔట్రీచ్ సెల్ చైర్మన్, అంతేకాకుండా కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) సభ్యుడు. చాందీ ఊమెన్ 2013లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్నారు. అయితే తండ్రి అనారోగ్యం కారణంగా పాదయాత్రను మధ్యలోనే మానుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన విజయంతో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్. 

ఇటీవల వార్తల్లో చాందీ ఊమెన్: 

నియోజకవర్గంలోని ప్రభుత్వ పశువైద్య కేంద్రం నుంచి ఒక టెంపరరీ మహిళా స్వీపర్‌ను తొలగించడంపై కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది. ఒక టెలివిజన్ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని పొగిడినందుకు ఉద్యోగం పోయిందని ప్రభుత్వ పశువైద్య కేంద్రం నుంచి ఒక టెంపరరీ మహిళా స్వీపర్‌కు ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతుగా నిలవగా, సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఆమె ఉద్యోగం పోయినందుకు వస్తున్న ఆరోపణలను ఖండించింది. 

డిప్యూటీ డైరెక్టర్ నిర్వహించిన తనిఖీలో, వాస్తవానికి ఉద్యోగం కోసం నియమించబడిన వ్యక్తి స్థానంలో సత్తిమ్మ పనిచేస్తున్నట్లు తేలిందని మంత్రి తెలిపారు. ఈ పరిశోధనల ఆధారంగా ఆమెను ఉద్యోగం నుండి తొలగించారని, చాందీని ప్రశంసిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు, ఆమె ఉద్యోగం పోవటానికి ఎలాంటి సంబంధం లేదని చించు రాణి పేర్కొన్నారు.