చంద్రుడికి మ‌రింత చేరువ‌లో చంద్ర‌యాన్ 3

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఉపగ్రహ నౌక చంద్రయాన్ 3. చంద్రుడి గురించి అనేక విషయాలను కనుగొనేందుకు ఈ నౌక ప్రయోగం చేశారు. గత నెల 14వ తేదీన నెల్లూరు జిల్లాలోని శ్రీ హరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని పరీక్షించారు. ఈ ప్రయోగం ఫస్ట్ ఫేస్ సక్సెస్ కావడంతో అంతా ఆనందంగా గడిపారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ దశలో ఉండగా.. […]

Share:

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఉపగ్రహ నౌక చంద్రయాన్ 3. చంద్రుడి గురించి అనేక విషయాలను కనుగొనేందుకు ఈ నౌక ప్రయోగం చేశారు. గత నెల 14వ తేదీన నెల్లూరు జిల్లాలోని శ్రీ హరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని పరీక్షించారు. ఈ ప్రయోగం ఫస్ట్ ఫేస్ సక్సెస్ కావడంతో అంతా ఆనందంగా గడిపారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ దశలో ఉండగా.. మొన్న ఆగస్టు 5వ తేదీన చంద్రయాన్ 3 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిందని ఇస్రో ప్రకటించింది. ఇంకా కేవలం అక్కడ ల్యాండ్ కావడం మాత్రమే బ్యాలెన్స్ ఉందని ప్రకటించింది. 

వెల్లువెత్తిన అభినందనలు

పోయిన సారి చంద్రయాన్ మిషన్ ఫెయిల్ కావడంతో ఈ సారి ప్రయోగం మీద అందరి కళ్లు పడ్డాయి. ఈ సారైనా మిషన్ సక్సెస్ కావాలని చాలా మంది కోరుకున్నారు. అందరి కోరికలకు తగ్గట్టుగానే ఈ సారి చంద్రయాన్ ప్రాజెక్టు సక్సెస్ అయింది. దీంతో అందరి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. జయహో భారత్, జయహో ఇస్రో అంటూ పోస్టులు హోరెత్తించారు. ఇక ఇటీవలే విజయవంతంగా కక్ష్యను తగ్గించుకుంటూ వచ్చిన ఇస్రో మరో శుభావార్తను మోసుకొచ్చింది. ఆగస్టు 5న జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించినట్లు ప్రకటించింది. ఇక ఈ ప్రకటనతో అంతా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చంద్రయాన్ ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

మరింత సంబురం.. 

ఇక ఈ రోజు ఆపరేషన్ స్పేస్ క్రాఫ్ట్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్పేస్ క్రాఫ్ట్ తన కక్ష్యను 100 కి.మీx 100 కి.మీ రేంజ్ కు తీసుకొచ్చింది. ఇది మరింత వృత్తాకార పథాన్ని సూచిస్తుందని ఇస్రో తెలిపింది. ఇది చంద్రయాన్ మిషన్ మార్గాన్ని మరింత సుగమం చేస్తుందని ఇస్రో ప్రకటించింది. 

ఇంకా వారమే

ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ జాబిల్లి మీద అడుగుపెట్టనుంది. ఈ ఘట్టం కోసం యావత్ దేశంతో పాటు ప్రపంచం కూడా ఆసక్తిగా తిలకిస్తోంది. మరి ఆగస్టు 23 రోజున ఏం జరుగుతుందో… చంద్రయాన్ లక్ష్యం ఒకటే అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇది చంద్రుడి యొక్క దక్షిణ ధృవం మీద రోవర్ ని ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఈ లక్ష్యం నెరవేరాలని అంతా కలలు కంటున్నారు. చంద్రయాన్ 3 టీం కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. 

మనం నాలుగో దేశంగా.. 

ఒక వేళ ఆగస్టు 23న కనుక ల్యాండింగ్ విజయవంతం అయితే రష్యా, యునైటెడ్ స్టేట్స్, చైనా తర్వాత ఇంతటి ఘనత సాధించిన నాల్గో దేశంగా మనం నిలుస్తాం. ఇప్పటి వరకు తమకు టెక్నాలజీలో సాటే లేదని అనుకుంటున్న జపాన్ కూడా ఇటువంటి ప్రయోగం చేయలేకపోయింది. ఇక రష్యా, యూఎస్ అనేవి ఎంతో పెద్ద దేశాలు కాబట్టి వాటికి సాధ్యం అయింది. దీంతో మనదేశం కూడా ఆ దేశాల సరసన చేరుతుందని అంతా విశ్వసిస్తున్నారు. ఇస్రోకు ఆల్ ది బెస్ట్ చెబుతూ విష్ చేస్తున్నారు. 

అప్పుడే మొదలు

ల్యాండర్ అనేది ప్రొపల్షన్ మాడ్యూలర్ నుంచి విడిపోయి 100×30కి.మీ రేంజ్ కి వచ్చిన తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 30 కి.మీ ఎత్తులో ల్యాండర్ దాని థ్రస్ట్ లను ఉపయోగించి సాఫ్ట్ ల్యాండింగ్ కు నావిగేషన్ ప్రారంభిస్తుంది. ఈ మొత్తం ప్రయోగంలో ఎంతో ముఖ్యమైన ఈ ప్రక్రియ సాఫీగా సాగాలని యావత్ దేశంతో పాటు మనం కూడా కోరుకుందాం.