పిల్లల్లో ఆసక్తిని పెంచిన చంద్రయాన్‌–3

ఇస్రో చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ విద్యార్థుల్లో అంతరిక్షంపై ఆసక్తిని పెంచింది. స్కూళ్లలో ఇప్పుడు చంద్రయన్ గురించి చర్చిస్తున్నారు. క్విజ్‌లు, ఆసైన్‌మెంట్లు వంటివి నిర్వహిస్తున్నారు. ప్రయోగంలోనే కాదు.. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంలోనూ ఇస్రో విజయవంతమైంది.సైకిల్‌పై ఉపగ్రహాలను మోసుకెళ్లే స్థాయి నుంచి.. చంద్రుడిపై అడుగుమోపే దాకా ఎంతో ఎత్తుకు ఎదిగింది ఇస్రో. చంద్రయాన్‌–3తో సూపర్ సక్సెస్ సాధించింది. చంద్రుడి దక్షణి ధ్రువంపై అడుగుపెట్టి.. ఏ దేశానికీ సాధ్యం కాని దాన్ని సాధ్యం చేసింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగగానే, అఖిల […]

Share:

ఇస్రో చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ విద్యార్థుల్లో అంతరిక్షంపై ఆసక్తిని పెంచింది. స్కూళ్లలో ఇప్పుడు చంద్రయన్ గురించి చర్చిస్తున్నారు. క్విజ్‌లు, ఆసైన్‌మెంట్లు వంటివి నిర్వహిస్తున్నారు. ప్రయోగంలోనే కాదు.. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంలోనూ ఇస్రో విజయవంతమైంది.సైకిల్‌పై ఉపగ్రహాలను మోసుకెళ్లే స్థాయి నుంచి.. చంద్రుడిపై అడుగుమోపే దాకా ఎంతో ఎత్తుకు ఎదిగింది ఇస్రో. చంద్రయాన్‌–3తో సూపర్ సక్సెస్ సాధించింది. చంద్రుడి దక్షణి ధ్రువంపై అడుగుపెట్టి.. ఏ దేశానికీ సాధ్యం కాని దాన్ని సాధ్యం చేసింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగగానే, అఖిల భారత దేశం ఆనందపడింది. సంతోషంతో కేరింతలు కొట్టింది. దేశ్యాప్తంగా సంబరాలు ఆకాశాన్నంటేలాసాగాయి. ఇక విద్యార్థులైతే అంతా ఆసక్తిగా చూశారు. అసలు స్కూల్ టైం దాటితే ఎప్పుడెప్పుడు ఇంటికి వెల్దామా అని చూసే విద్యార్థులు కూడా చంద్రయాన్ 3 లాండింగ్ రోజు ఆసక్తిగా 7 గంటల వరకూ వీక్షించారు.  అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో స్కూళ్లు కూడా పిల్లల్లో ఆసక్తిని పెంచే కార్యక్రమాలను చేపడుతున్నాయి.

క్విజ్‌లు, అసైన్‌మెంట్లు

చంద్రయాన్‌–3 విజయం దేశంగా ఇండియాకు మాత్రమే కాదు.. దేశంలోని విద్యార్థులకు ఎంతో ముఖ్యం. అంతరిక్షం స్థాయికి కలలు కనేలా ఈ ప్రయోగం పిల్ల్లల్లో ఎన్నో ఆశలను, ఆలోచనలను నింపింది. మరోవైపు చంద్రాయన్‌–3తో పిల్లల్లో ఏర్పడ్డ ఆసక్తిని మరింత పెంచేలా స్కూళ్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం విద్యార్థులకు క్విజ్‌లు పెడుతున్నాయి. అసైన్‌మెంట్లు ఇస్తున్నాయి. చర్చావేదికలు నిర్వహిస్తున్నాయి. దీంతో పిల్లలు కూడా అంతే ఆసక్తిగా అంతరిక్షం, రాకెట్లు, గ్రహాలు, ఉపగ్రహాలు, పాలపుంత, ప్రయోగాలు వంటి అంశాలను తెలుసుకుంటున్నారు.  

కేవలం సైన్స్ గురించి తెలుసుకోవడమే కాదు..

‘‘ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై మేం సోషల్ స్టడీస్ క్లాసుల్లో అప్పుడప్పుడు చర్చిస్తాం. కానీ చంద్రయాన్–3 మనం ఊహించని విధంగా చరిత్రకు ప్రాణం పోసింది. అంతరిక్ష ప్రయోగాల గురించి తెలుసుకోవడం చరిత్రలో భాగమైనట్లుగా అనిపిస్తోంది” ఓ హైస్కూల్ స్టూడెంట్ రియా కాలింది చెప్పుకొచ్చింది. ‘‘చంద్రాయన్–3 విజయం.. వాస్తవ ప్రపంచంతో నా బోధనలను అన్వయం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సిద్ధాంతాలు, సమీకరణాలు స్పష్టమైన, సంచలనాత్మక విజయాలకు దారితీస్తాయని విద్యార్థులు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు” అని సీమెచ్‌ ప్రవీణ్ అనే సైన్స్ టీచర్ తెలిపారు. ‘‘అంతరిక్ష మిషన్లను అధ్యయనం చేయడం కేవలం సైన్స్ గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు. ఇందులో టీమ్ వర్క్, ఆవిష్కరణలు, డిప్లమసీ కూడా ఉంటుంది. ఇదొక పజిల్. ఇందులో ప్రతి పావు కూడా ముఖ్యమైనదే” అని కారుణ్య కేశవ్ అనే విద్యార్థి వివరించాడు.

ఇదీ చంద్రయాన్ చరిత్ర

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటిదాకా మూడు చంద్రయాన్ ప్రయోగాలను చేపట్టింది. 2008 అక్టోబర్‌‌లో చంద్రయాన్–1, 2019 జులైలో చంద్రయాన్–2 చేపట్టింది. చంద్రయాన్ –1 సక్సెస్ కాగా, చంద్రయాన్ –2 చివరి క్షణంలో విఫలమైంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఇస్రో చంద్రయాన్–3ని చేపట్టింది. చంద్రయాన్–2 ఏ లక్ష్యంతో చేపట్టామో అదే లక్ష్యంతో చంద్రయాన్–3ని చేపట్టింది. జులై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి ప్రయోగించింది. ఒక్కో అడుగును దాటుకుంటూ.. ఆగస్టు 23న సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని యూట్యూబ్, టీవీల్లో భారతదేశ ప్రజలే కాదు.. మొత్తం ప్రపంచం ఆసక్తిగా చూసింది. చంద్రయాన్–3 దిగిన ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోదీ పేరు కూడా పెట్టారు. శివశక్తి అని నామకరణం చేశారు. అంతేకాదు.. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.