Chandrayaan 3: తమిళ మట్టిని వాడిన ఇస్రో

యావత్ దేశం మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా మంది చంద్రయాన్ 3 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరెన్ని గొప్పలు చెప్పినా భారత్ మాత్రం సైలెంట్ గా తన పనిని ముగించిందంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా భారత్ చాలా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. భారత కీర్తి పతాకాన్ని చంద్రుడి మీద సగర్వంగా పాతేలా చేసిన ఇస్రోని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. చంద్రయాన్ 3 మిషన్ లో పని చేసిన ప్రతి ఒక్క ఇంజనీర్ గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ […]

Share:

యావత్ దేశం మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా మంది చంద్రయాన్ 3 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరెన్ని గొప్పలు చెప్పినా భారత్ మాత్రం సైలెంట్ గా తన పనిని ముగించిందంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా భారత్ చాలా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. భారత కీర్తి పతాకాన్ని చంద్రుడి మీద సగర్వంగా పాతేలా చేసిన ఇస్రోని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. చంద్రయాన్ 3 మిషన్ లో పని చేసిన ప్రతి ఒక్క ఇంజనీర్ గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. మన ప్రాంతానికి చెందిన ఎవరైనా ఇంజనీర్ ఆ మిషన్ లో ఉంటే చాలా గొప్పగా అతడి గురించి అతడి విజయం గురించి రాస్తున్నారు. అటువంటి సమయంలో చంద్రయాన్ 3 మిషన్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ వార్త ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. నేషనల్ మీడియా కూడా ఈ వార్తకు భారీ ఇంపార్టెన్స్ ఇస్తోంది. దీంతో అసలేంటీ ఈ స్టోరీ అంటూ అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. 

ఇస్రోలో మొదటి నుంచి తమిళ వ్యక్తులే

ఇస్రో స్థాపించిన నాటి నుంచి నేటి వరకు తమిళ వ్యక్తుల కాంట్రిబ్యూషన్ మరువలేనిది అని మరో వార్త వైరల్ గా మారింది. అవును ఇది ముమ్మాటికీ నిజం. మాజీ రాష్ట్రపతిగా సేవలందించిన తమిళనాడుకు చెందిన ఏపీజే అబ్దుల్ కలాంతో పాటు చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్, ఇప్పటి చంద్రయాన్ 3 మిషన్ డైరెక్టర్ కూడా తమిళనాడు చెందిన వారే కావడం గమనార్హం. 

2012 నుంచే ఆ మట్టి

చంద్రయాన్ మిషన్ కోసం 2012 నుంచి తమిళనాడులోని ఒక గ్రామానికి చెందిన మట్టిని వాడుతున్నారు. ఆ గ్రామం చంద్రుడి ఉపరితలం ఎలా ఉంటుందో అలా ఉండడంతో మిషన్ కేపబులిటీని టెస్ట్ చేసేందుకు ఆ మట్టిని ఉపయోగిస్తున్నారు. ఇంతటి ఘన కీర్తి సాధించిన ఈ ఊరి పేరు నమక్కల్. చంద్రయాన్ మిషన్ కోసం మట్టిని పంపించిన ఈ జిల్లా తమిళ రాజధాని చెన్నై నగరానికి 400 కి.మీ దూరంలో ఉంటుంది. ప్రస్తుతం చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ కావడంతో అంతా ఆ మట్టి గురించి చర్చించుకుంటున్నారు. నమక్కల్ ప్రాంతపు లక్షణాలు చంద్రుడి ఉపరితలం మీద లాగే ఉండడంతో ఆ ప్రాంత మట్టిని ఈ మిషన్ కోసం ఉపయోగించారు. కావున చంద్రయాన్ 3 ల్యాండర్ సక్సెస్ లో తమిళనాడుకు కూడా భాగం ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది మూడోసారి

ఇస్రో చేపట్టే  ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులైన చంద్రయాన్ ప్రాజెక్టుల కోసం నమక్కల్ మట్టిని ఉపయోగించడం ఇది తొలి సారి ఏం కాదు. ఇదే ప్రాంతపు మట్టిని ఇస్రో గత మూడు పర్యాయాలుగా ఉపయోగించింది. అక్కడ ఉన్న మట్టి అచ్చం చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఉన్న మట్టిని పోలి ఉంటుందని పెరియార్ యూనివర్సిటీ జియాలజీ విభాగం హెడ్ ఎస్. అన్బళగన్ తెలిపారు. అందుకోసమే ఇస్రో ఇక్కడి మట్టినే చంద్రయాన్ ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తుందని ఆయన అన్నారు. 

అప్పుడే బీజాలు

అసలు అక్కడెక్కడో తమిళనాడులోని ప్రాంతంలో ఉన్న మట్టి గురించి ఇస్రో శాస్త్రవేత్తలకు ఎలా తెలిసిందని అంతా అనుకోవడం సహజం. చంద్రయాన్ 1 మిషన్ సక్సెస్ అయిన తర్వాత చంద్రుడి ఉపరితలం మీద పరిశోధనలకు ఇస్రో ప్రయోగాలు చేస్తోందని అందుకు సంబంధించిన మిషన్ తయారు చేసే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని పోలి ఉండే ఈ మట్టిని పరీక్షల కోసం ఇస్రోకు పంపితే వారు పరీక్షలు చేసి సరిపోయిందని చెప్పారని అన్బగళన్ తెలిపారు.