లాంచ్‌కి సిద్ధ‌మైన చంద్రయాన్-3

చందమామ పైన మరింత రీసెర్చ్ చేసేందుకు ISRO పంపించబోతున్న మరో మిషిన్ చంద్రయాన్-3. అయితే ఈ రోజే ఈ లాంచ్కి ముహూర్తం ఫిక్స్ చేశారు. సుమారు నెలరోజుల ప్రయాణం తర్వాత అడుగుపెట్టబోతోంది చంద్రయాన్-3.  చంద్రయాన్-3:  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో(ISRO) చంద్రుడిపైకి తన మూడవ మిషన్, చంద్రయాన్-3ని ఈరోజు మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలో ప్రారంభించనుంది. ల్యాండింగ్ విజయవంతమైతే, యునైటెడ్ స్టేట్స్, రష్యా మరియు చైనా తర్వాత ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన నాల్గవ […]

Share:

చందమామ పైన మరింత రీసెర్చ్ చేసేందుకు ISRO పంపించబోతున్న మరో మిషిన్ చంద్రయాన్-3. అయితే ఈ రోజే ఈ లాంచ్కి ముహూర్తం ఫిక్స్ చేశారు. సుమారు నెలరోజుల ప్రయాణం తర్వాత అడుగుపెట్టబోతోంది చంద్రయాన్-3. 

చంద్రయాన్-3: 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో(ISRO) చంద్రుడిపైకి తన మూడవ మిషన్, చంద్రయాన్-3ని ఈరోజు మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలో ప్రారంభించనుంది. ల్యాండింగ్ విజయవంతమైతే, యునైటెడ్ స్టేట్స్, రష్యా మరియు చైనా తర్వాత ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం అవుతుంది. 

2019లో ఇజ్రాయెల్ మరియు భారతదేశం ద్వారా పంపించిన మిషన్లు క్రాష్-ల్యాండింగ్ అయినప్పటి నుండి పలు పరిశోధనల తర్వాత మరొకసారి ప్రయత్నం చేయబోతోంది భారత్. జపాన్ నుండి ల్యాండర్-రోవర్ మరియు యుఎఇ నుండి రోవర్‌లు కూడా 2022లో అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత విఫలమయ్యాయి. 

చంద్రయాన్-3 గురించి ఆసక్తికరమైన విషయాలు: 

అయితే భూమి నుంచి చంద్రుడిని చేరుకోవటానికి సుమారు ఒక నెల రోజులపాటు సమయం పడుతుంది అంటున్నారు సైంటిస్టులు. అంటే ఆగస్టు 23 వ తారీఖున, లాంచ్ చేసిన మిషన్ చందమామ మీద అడుగు పెట్టబోతోంది అని అంటున్నారు. 

అయితే చందమామ మీద లాంచ్ అయిన అనంతరం సుమారు 14 రోజులు రీసర్చ్ కండక్ట్ చేస్తారు. అంటే చందమామ మీద ఒక రోజుతో సమానం. ముఖ్యంగా అక్కడ చందమామ మీద ఉండే లూనార్ మట్టి మీద పరిశోధన జరుగుతుంది. అంతే కాకుండా 14 రోజులపాటు చందమామ మీద భూమిపైన కొన్ని విశేషాలను సేకరిస్తారు. 

GSLV మార్క్ 3 (LVM 3) హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్‌పై అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నారు. ఈ శక్తివంతమైన మూడు-దశల మీడియం-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ISRO ద్వారా పంపిస్తున్న అత్యంత బలమైన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ LVM-3 లిఫ్ట్‌ఆఫ్ మిషన్ సుమారు 43.5 మీటర్ల ఎత్తులో మరియు 4 మీటర్ల వ్యాసంతో, 640 టన్నుల బరువు ఉంటుంది. దీని స్ట్రెంత్ 8,000 కిలోగ్రాముల వరకు పేలోడ్‌లను రవాణా చేయడానికి అనుకూలంగా తయారు చేశారు. అంతేకాకుండా ఇది సుదూర గమ్యస్థానాలకు, ఇది సుమారుగా 4,000 కిలోగ్రాముల పేలోడ్‌ను మోయగలదు. 

ISRO ప్రకారం, ఇటీవల డెవలప్ చేసిన ఈ అద్భుతమైన మిషన్ పార్ట్స్ అనేవి కొన్ని క్లిష్టమైన సందర్భంలో కూడా విజయవంతమైన ల్యాండింగ్‌ జరిగేలా చూస్తాయని సైంటిస్టు నొక్కి మరి చెప్తున్నారు. సెన్సార్ పనిచేయకపోవడం, ఇంజిన్ బ్రేక్‌డౌన్, అల్గారిథమిక్ గ్లిచ్‌లు అంతేకాకుండా ఇంక ఎటువంటి లోపాలు వచ్చినప్పటికీ, అది చేయాల్సిన పని మాత్రం విజయవంతంగా చేసేందుకు ఆటోమేటిక్ రిపేర్ సిస్టం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

చంద్రయాన్- 2: 

చంద్రయాన్- 2, మొదట 2019 జూలై 15 న జరపాలని తలపెట్టిన ప్రయోగాన్ని సాంకేతిక కారణాల వలన ప్రయోగానికి 56 నిముషాల ముందు రద్దు చేసారు. క్రయోజనిక్ స్టేజిలో అనుకోకుండా ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన తరువాత, 2019 జూలై 22 న మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె3 ఎమ్1 వెహికల్ ద్వారా ప్రయోగించి భూకక్ష్యలో ప్రవేశ పెట్టడం జరిగింది.

అయితే ఆ తర్వాత, చంద్రయాన్-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలో చేరాక, ప్లాను ప్రకారమే ఆర్బిటరు, ల్యాండరు విడిపోయాయి. ఆ తరువాత ల్యాండరు ఆ కక్ష్య నుండి రెండు అంచెలలో దిగువ కక్ష్య లోకి దిగి, అక్కడి నుండి చంద్రుడి ఉపరితలం పైకి ప్రయాణం సాగించింది. ల్యాండరు చంద్రుడి ఉపరితలం నుండి 2.1 కి.మీ. ఎత్తున ఉండగా, దానికి భూమితో ఉన్న సంబంధాలు తెగిపోయినట్లు అప్పట్లో సమాచారం అందింది. అంటే దాని అర్థం మిషన్ ఫెయిల్ అయిపోయింది. కాకపోతే ఈ చంద్రయాన్- 2 మెషిన్ అనేది పూర్తి కానప్పటికీ, 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ఇస్రో తెలిపింది.