చంద్రుడికి అతి చేరువలో చంద్రయాన్-3

సుమారు మూడు వారాలుగా ప్రయాణం చేస్తూ చంద్రయాన్-3 చంద్రుడికి అతి చేరువలోకి చేరింది. జూలై 5న శనివారం సాయంత్రం సరిగ్గా సాయంత్రం 7pm గంటలకు, చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెట్టింది చంద్రయాన్-3. ఇదే చంద్రయాన్-3 మొదటి విజయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్యలో చంద్రుడు మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే అవకాశం ఉంది.  విజయానికి చేరువలో:  జూలై 5న శనివారం సాయంత్రం సరిగ్గా సాయంత్రం 7pm గంటలకు, చంద్రుడి కక్ష్యలోకి […]

Share:

సుమారు మూడు వారాలుగా ప్రయాణం చేస్తూ చంద్రయాన్-3 చంద్రుడికి అతి చేరువలోకి చేరింది. జూలై 5న శనివారం సాయంత్రం సరిగ్గా సాయంత్రం 7pm గంటలకు, చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెట్టింది చంద్రయాన్-3. ఇదే చంద్రయాన్-3 మొదటి విజయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్యలో చంద్రుడు మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే అవకాశం ఉంది. 

విజయానికి చేరువలో: 

జూలై 5న శనివారం సాయంత్రం సరిగ్గా సాయంత్రం 7pm గంటలకు, చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెట్టింది చంద్రయాన్-3. ఇదే చంద్రయాన్-3 మొదటి విజయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్యలో చంద్రుడు మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే అవకాశం ఉంది. “నాకు చంద్రుని గురుత్వాకర్షణ తెలుస్తోంది,” అనే చంద్రయాన్-3 మెసేజ్ ఇస్రో కి అందింది. అంతరిక్ష సంస్థ ప్రతిష్టాత్మక ₹600 కోట్ల మిషన్‌ ప్రస్తుతం చంద్ర కక్ష్యలోకి వెళ్లడం అనేది ఒక ప్రధాన మైలురాయిని చెప్పుకోవాలి.  

చంద్రయాన్-3: 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో(ISRO) చంద్రుడిపైకి తన మూడవ మిషన్, చంద్రయాన్-3ని, జులై 14 వ తారీఖున,2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలో లాంచ్ చేయడం జరిగింది. ల్యాండింగ్ విజయవంతమైతే, యునైటెడ్ స్టేట్స్, రష్యా మరియు చైనా తర్వాత ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం అవుతుంది. 

2019లో ఇజ్రాయెల్ మరియు భారతదేశం ద్వారా పంపించిన మిషన్లు క్రాష్-ల్యాండింగ్ అయినప్పటి నుండి పలు పరిశోధనల తర్వాత మరొకసారి ప్రయత్నం చేయబోతోంది భారత్. జపాన్ నుండి ల్యాండర్-రోవర్ మరియు యుఎఇ నుండి రోవర్‌లు కూడా 2022లో అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత విఫలమయ్యాయి. 

చంద్రయాన్-3 విశేషాలు: 

అయితే భూమి నుంచి చంద్రుడిని చేరుకోవటానికి సుమారు ఒక నెల రోజులపాటు సమయం పడుతుంది అంటున్నారు సైంటిస్టులు. అంటే ఆగస్టు 23 వ తారీఖున, లాంచ్ చేసిన మిషన్ చందమామ మీద అడుగు పెట్టబోతోంది అని అంటున్నారు. 

అయితే చందమామ మీద లాంచ్ అయిన అనంతరం సుమారు 14 రోజులు రీసర్చ్ కండక్ట్ చేస్తారు. అంటే చందమామ మీద ఒక రోజుతో సమానం. ముఖ్యంగా అక్కడ చందమామ మీద ఉండే లూనార్ మట్టి మీద పరిశోధన జరుగుతుంది. అంతే కాకుండా 14 రోజులపాటు చందమామ మీద భూమిపైన కొన్ని విశేషాలను సేకరిస్తారు. 

GSLV మార్క్ 3 (LVM 3) హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్‌పై అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నారు. ఈ శక్తివంతమైన మూడు-దశల మీడియం-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ISRO ద్వారా పంపిస్తున్న అత్యంత బలమైన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ LVM-3 లిఫ్ట్‌ఆఫ్ మిషన్ సుమారు 43.5 మీటర్ల ఎత్తులో మరియు 4 మీటర్ల వ్యాసంతో, 640 టన్నుల బరువు ఉంటుంది. దీని స్ట్రెంత్ 8,000 కిలోగ్రాముల వరకు పేలోడ్‌లను రవాణా చేయడానికి అనుకూలంగా తయారు చేశారు. అంతేకాకుండా ఇది సుదూర గమ్యస్థానాలకు, ఇది సుమారుగా 4,000 కిలోగ్రాముల పేలోడ్‌ను మోయగలదు. 

ISRO ప్రకారం, ఇటీవల డెవలప్ చేసిన ఈ అద్భుతమైన మిషన్ పార్ట్స్ అనేవి కొన్ని క్లిష్టమైన సందర్భంలో కూడా విజయవంతమైన ల్యాండింగ్‌ జరిగేలా చూస్తాయని సైంటిస్టు నొక్కి మరి చెప్తున్నారు. సెన్సార్ పనిచేయకపోవడం, ఇంజిన్ బ్రేక్‌డౌన్, అల్గారిథమిక్ గ్లిచ్‌లు అంతేకాకుండా ఇంక ఎటువంటి లోపాలు వచ్చినప్పటికీ, అది చేయాల్సిన పని మాత్రం విజయవంతంగా చేసేందుకు ఆటోమేటిక్ రిపేర్ సిస్టం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.