Chandrababu: తిరుమల శ్రీవారి దర్శనానికి చంద్రబాబు..

మళ్లీ జనంలోకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్

Courtesy: Twitter

Share:

Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం (AP Skill Development Scam) కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ (Regular Bail) లభించిన సంగతి తెలిసిందే. ఇక న్యాయస్థానం విధించిన ఆంక్షలు నెల 29తో ముగియనుండగా తన తర్వాతి కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు చంద్రబాబు (Chandrababu). ఇక ప్రధానంగా ఈసారి నేరుగా జనంలోకి వెళ్లకుండా టెంపుల్ రన్ అంటే దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయనున్నారట.

చంద్రబాబు (Chandrababu) నెల 30 తిరుమలకు (Thirumala) చేరుకుంటారు.. రాత్రికి అక్కడే బస చేస్తారు. డిసెంబర్ 1 ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం అయ్యాక అక్కడి నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయం (Renigunta Airport) నుంచి అమరావతి చేరుకుంటారు. తర్వాత బెజవాడ దుర్గమ్మ (Bejawada Durgamma), సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్ననూ దర్శించుకోవాలని భావిస్తున్నారు. తర్వాత నుంచి పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో బిజీ కానున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆయన మూడు బహిరంగ సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని నాయకత్వం ఆలోచిస్తోంది.

ఇటీవలే కంటి శస్త్ర చికిత్స (Eye Surgery) చేయించుకున్న చంద్రబాబు (Chandrababu) కొంత కాలంగా హైదరాబాద్లో (Hyderabad) విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజులు కంట్లో దుమ్ము పడకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సూచించడంతో ఇంటికే పరిమితమయ్యారు. అయినా కొన్ని నియోజకవర్గాల నేతలను పిలిపించుకుని విడివిడిగా మాట్లాడుతున్నారు. స్కిల్డెవలప్మెంట్కేసులో (Skill Development Case) హైకోర్టు రెగ్యులర్బెయిల్‌ (High Court Regular Bail) మంజూరు చేయడంతో డిసెంబరు మొదటి వారం నుంచి ఆయన పూర్తిస్థాయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబునాయుడు (Chandrababu) ఇవాళ ఢిల్లీ వెళ్లారు. తన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా (Siddhartha Luthra) కుమారుడి వివాహ రిసెప్షన్ కు చంద్రబాబు హాజరుకానున్నారు. వాస్తవానికి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకు రాగానే మొదట తిరుమలకే వెళ్లాలని అనుకున్నారు. కానీ అనారోగ్య సమస్యలు (Health Problems) ఉండడంతో వైద్యుల సూచనతో హైదరాబాద్వెళ్లారు. డిసెంబర్ నుంచి మళ్లీ బిజీ కానున్నారు. సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో (Delhi Airport) చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. రేపు సాయంత్రం చంద్రబాబు తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ (Hyderabad) చేరుకోనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Developement Case) సెప్టెంబరు 9 చంద్రబాబును సీఐడీ (CID) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మొదట మధ్యంతర బెయిల్ (Interim bail) మంజూరు చేసింది. తర్వాత రెగ్యులర్ బెయిల్ (Regular bail) ఇచ్చింది. నేపథ్యంలో అక్టోబరు 31 చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) నుంచి విడుదలయ్యారు.

మద్యం కేసులో (Liquor case) చంద్రబాబు నాయుడుకు (Chandrababu) ఊరట లభించింది. కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో (High Court) వాదనలు ముగిశాయి. మద్యం కంపెనీలకు అనుమతుల్లో అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబుపై నమోదైన కేసులో తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్ (Andhra Pradesh High Court Reserve) చేసింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర పిటిషన్లపై సీఐడీ(CID), చంద్రబాబు తరఫున లాయర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

మద్యం కేసులో ఈనెల 23 విచారణ జరగగాచంద్రబాబు తరఫున సీనియర్న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. మద్యం షాపుల లైసెన్స్దారులకు (License of Liquor Shops) 2015-17 మధ్య ప్రివిలేజ్ఫీజు విధింపు నిబంధన తొలగింపు ప్రతిపాదించిన ఫైల్ అప్పటి సీఎం చంద్రబాబు (Chandrababu) వద్దకు వెళ్లలేదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎక్సైజ్శాఖ మంత్రి, కమిషనర్స్థాయిలో నిర్ణయం తీసుకున్నారన్నారు. ఫైలును ఆర్థికశాఖకు పంపకపోవడాన్ని సీఐడీ తప్పుపట్టడం సరికాదన్నారు. సీఐడీ (CID) దురుద్దేశపూర్వకంగా అప్పటి సీఎం, మంత్రిని బాధ్యులను చేయాలని కేసు పెట్టిందని వాదనలు వినిపించారు.