6 ప్రత్యేకమైన స్కీముల హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొన్ని కోట్ల మంది ప్రజలకు భరోసా ఇస్తూ ఎన్నికల సమీపిస్తున్న వేళా సన్నాహాలు మొదలుపెట్టింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా ఇంటింటికి వెళ్లి జనం యొక్క సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన తరపు నుంచి తెలుగుదేశం పార్టీ అనేది ఆరు రకాల స్కీమ్స్ ప్రత్యేకించి ప్రజల సమస్యలను తీర్చేందుకు, తమకి బంగారు భవిష్యత్తు కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.  బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ:  ఇప్పటివరకు […]

Share:

తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొన్ని కోట్ల మంది ప్రజలకు భరోసా ఇస్తూ ఎన్నికల సమీపిస్తున్న వేళా సన్నాహాలు మొదలుపెట్టింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా ఇంటింటికి వెళ్లి జనం యొక్క సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన తరపు నుంచి తెలుగుదేశం పార్టీ అనేది ఆరు రకాల స్కీమ్స్ ప్రత్యేకించి ప్రజల సమస్యలను తీర్చేందుకు, తమకి బంగారు భవిష్యత్తు కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. 

బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ: 

ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యకు వెళ్లిన సందర్భంలో సుమారు మూడు కోట్ల మంది ప్రజలకు భరోసా ఇస్తూ కొన్ని స్కీమ్స్ అనేవి ఏర్పాటు చేస్తామని గ్యారెంటీ ఇచ్చారు. అంతేకాకుండా ఆ ఆరు స్కీములలో ప్రత్యేకించి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే స్కీం ప్రత్యేకించి ప్రతి ఒక్కరు బంగారు భవిష్యత్తు గురించి ఈ స్కీం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఒకవేళ ఎన్నికల తరువాత మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తను వైపు నుంచి ఖచ్చితంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే స్కీం వెలుగులోకి వస్తుందని ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు అందిస్తుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 

అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫునుంచి చాలామంది నాయకులు తమ ఇంటి వద్దకే వస్తారని, అంతేకాకుండా తమ సమస్యలను ఎటువంటి భయం లేకుండా వెల్లడించాలని ప్రజలను కోరారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ప్రజలు అండ ఉంటే తాను తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తానని ప్రజలకు సేవ చేస్తానని వెల్లడించారు. 

అదిరిపోయే మరిన్ని స్కీములు: 

చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా, ఆయన మరో ఐదు స్కీములను కూడా అమల్లోకి తెచ్చే క్రమంలో ఉన్నారని, అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ స్కీములన్ని అందుబాటులోకి వస్తాయని చాలా నమ్మకంతో చెప్పారు. ఆడవారికి ప్రత్యేకించి ఫైనాన్షియల్ అండను ఇచ్చేందుకు మహాశక్తి స్కీం అనేది అమల్లోకి తెస్తామని, అయితే ఆడవారు తమ పిల్లల్ని చదివించుకోవడానికి వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి మహాశక్తి స్కీమ్ సహాయపడుతుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా తల్లికి వందనం అనే స్కీం ద్వారా రూ. 15,000 తల్లి ఖాతాలో పడతాయని, తమ కుటుంబంలో ఉండే ప్రతి బిడ్డకు కూడా ప్రత్యేకించి రూ. 15,000 అందజేస్తామని చదువు కోసం తల్లికి వందనం అనే స్కీం చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. 

అయితే ఆడవారికి ప్రత్యేకించి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు లోపు ఉన్నవారికి నెలకు రూ.1,500 తరుపున ఆడబిడ్డ నిధి స్కీం ద్వారా అందిస్తామని వెల్లడించారు చంద్రబాబు నాయుడు. అయితే తెలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఆడవారికి బస్సులో ప్రయాణించినందుకు ఎటువంటి ఖర్చు లేకుండా చూసుకుంటామని, అంతేకాకుండా ప్రతి గృహానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందజేస్తామని, వాటితో పాటు అన్నదాత, యువగలం, బీసీల కోసం ప్రత్యేకమైన స్కీం, మరి ముఖ్యంగా ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు అందచేస్తామని చంద్రబాబు నాయుడు తన 45 రోజుల ప్రజల వద్దకు పర్యటనలో వెల్లడించారు. ఈ క్రమంలోనే, ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా మారాలని, పేదరికం అనేదే ఉండకూడదని ఆయన భావించి స్కీములు తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. దసరా రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పారు. 

ప్రజలు తప్పకుండా తెలుగుదేశం పార్టీని నమ్మి తమకు సపోర్ట్ చేస్తారని, కచ్చితంగా తాము అధికారంలోకి వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు జరిపిస్తామని హామీ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.