చంద్ర‌బాబు అరెస్ట్ సక్రమమే

చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్‌తో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అక్కడ ఓ రకమైన రాజకీయాలు నడుస్తున్నాయి. మేము ఎటువంటి మంచి పని చేసినా కానీ ఎల్లో మీడియా దానిని వక్రీకరించి చూపిస్తుందని వైసీపీ నేతలు చెబుతుంటే అటువంటిదేం లేదు… వైసీపీ పలు అక్రమాలు చేస్తోందని పలువురు అంటున్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఇదే తంతు నడుస్తోంది. 2019 చివర్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వచ్చీ రావడంతో మాజీ ముఖ్యమంత్రి […]

Share:

చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్‌తో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అక్కడ ఓ రకమైన రాజకీయాలు నడుస్తున్నాయి. మేము ఎటువంటి మంచి పని చేసినా కానీ ఎల్లో మీడియా దానిని వక్రీకరించి చూపిస్తుందని వైసీపీ నేతలు చెబుతుంటే అటువంటిదేం లేదు… వైసీపీ పలు అక్రమాలు చేస్తోందని పలువురు అంటున్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఇదే తంతు నడుస్తోంది. 2019 చివర్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వచ్చీ రావడంతో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కట్టించిన ప్రజావేదికను కూల్చేసింది. ప్రజావేదికను కూల్చేయడం సరికాదని చాలా మంది టీడీపీ నాయకులు చెప్పినా కానీ వైసీపీ వారు మాత్రం కాదు ఇది కరెక్టే అన్నారు. రాజకీయ కక్షలోనే భాగంగా ఇలా చేస్తున్నారని వారు మండిపడ్డారు. కానీ అటువంటిదేం లేదు…. టీడీపీ నేతలు పలు అరాచకాలు చేశారని కొంత మంది వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల రాజకీయం మరింత వేడెక్కింది. 

అరెస్టుతో పెరిగిన వేడి… 

తెలుగు దేశం అధినేత, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. అంతకు ముందే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. రూ. 118 కోట్ల కుంభకోణానికి సంబంధించి సమాధానం చెప్పాలని వివరణ కోరింది. చంద్రబాబు వివరణ ఇచ్చినా కానీ ఐటీ శాఖ సంతృప్తి చెందలేదని పలువురు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో కరెక్టుగా తెలియదు కానీ ఈ నోటీసుల మీద టీడీపీ స్పందించాలని పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. 

మధ్యలో జనసేన

ఓ వైపు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దానిని ప్రతిపక్ష టీడీపీ విమర్శిస్తుంటే మరో వైపు నటుడికి చెందిన జనసేన పార్టీ కూడా విమర్శించడం మొదలుపెట్టింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఒక వైపు వారాహి విజయయాత్ర పేరిట యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో వైసీపీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలు పూర్తైన యాత్ర మరో విడతకు కూడా సిద్ధం అవుతోంది. ఈ యాత్ర వల్ల తమ పార్టీకి ఎంతో లాభం చేకూరుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకోసమే పవన్ పార్టీని మరియు పార్టీ నేతలను విమర్శిస్తూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అందుకోసమే పవన్ కల్యాణ్ సినిమాలను సైడ్ చేసి ఫుల్ గా రాజకీయాల మీద కాన్సంట్రేట్ చేసేందుకు సమయం కేటాయిస్తాడని పలువురు చెబుతున్నారు. 

అరెస్టైన మాజీ సీఎం 

ఇలా రాజకీయాలు వేడి మీద ఉండగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. దీంతో ఈ అరెస్ట్ కు రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ, జనసేన తో పాటు మిగతా పక్షాలు కూడా అంటున్నాయి. కానీ ఇది రాజకీయ కక్ష కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాజకీయ కక్ష అయితే మేము ఈ 4 సంవత్సరాలలో ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్లం కదా అని రిప్ల ఇస్తున్నారు. అంతే కాకుండా సీఐడీ తన పనిని తాను పూర్తి స్వేచ్ఛతో నిర్వర్తిస్తుందని వారు చెబుతున్నారు. అమరావతి భూములు, ఏపీ ఫైబర్‌నెట్, అమరావతి రింగ్‌రోడ్డు మొదలైన ఇతర కుంభకోణాల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పలు అక్రమాలు చేశాడని చెబుతున్నారు. అంతే కాకుండా ఈ అక్రమాలను త్వరలో బయటపెడతామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. అంతే కాకుండా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ చట్టానికి అతీతులు కాదని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థ సీఐడీ బాబు ను అరెస్ట్ చేసిందని వారు చెబుతున్నారు. 

అదో తప్పుడు ప్రచారం అందుకే చేస్తున్నారు.. 

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అస్సలుకే అక్రమం కాదని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ ఇష్యూ మీద మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్ అక్రమం ఏం కాదని అన్నారు. ఆయన విషయంలో అధికార పార్టీ కక్ష కట్టి ఇలా చేస్తుందని ప్రచారం చేస్తే అతడికి కాస్త సింపతీ వచ్చి నాలుగు ఓట్లు పడతాయని ఎల్లో మీడియా (చంద్రబాబు అనుకూల మీడియా) ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు. అంతే తప్పా ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తప్పు చేస్తే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా తప్పకుండా అరెస్ట్ కావాల్సిందే అని అన్నారు. ఇక పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు స్కిల్డ్‌ క్రిమినల్‌ అని అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని అన్నారు. ఇప్పుడు ఆయన గురించి ప్రజలకు తెలుస్తోందన్నారు. టీడీపీ పదవీకాలం మొత్తం స్కామ్‌లతో నిండిపోయిందని ఆరోపించారు. డొల్ల కంపెనీల ద్వారా ప్రజల సొమ్మును తనకు మళ్లించుకున్నారని అన్నారు. చంద్రబాబు పేర్కొన్న కంపెనీలేవీ ఏపీలో స్థాపించలేదని, రూ.118 కోట్ల కుంభకోణంలో ఇద్దరు ప్రధాన నిందితులు విదేశాలకు పారిపోయారని ఆయన తెలిపారు. 

సపోర్ట్ చేసిన బీజేపీ 

మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ చాలా మంది ఖండిస్తున్నారు. ఇలా ఖండించిన వారిలో ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఉన్నారు. పురందేశ్వరి చంద్రబాబుకు స్వయాన వదిన కావడం విశేషం. ఆమె ట్వీట్ చేస్తూ చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. ఆమె ట్వీట్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిన సెక్షన్‌ లు నేర తీవ్రత మరియు అతని అవినీతి కార్యకలాపాలను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. సెక్షన్స్ తెలియకపోతే తెలుసుకోవాలని పురందేశ్వరికి చురకలంటించారు.