చంద్ర‌బాబు సహకరించడం లేదు

స్కిల్  డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ మీద రాష్ట్రంలో చాలా మంది అల్లర్లు చేస్తున్నారు. అయినా కానీ పోలీసులు వెనక్కు తగ్గడం లేదు. వారు అనుకున్నదే చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పక్కా ప్లాన్ ప్రకారమే అరెస్ట్ చేశారని కొంత మంది వాదిస్తుండగా.. అటువంటిదేం లేదని మరికొంత మంది అంటున్నారు. ఏదేమైనా కానీ చంద్రబాబును […]

Share:

స్కిల్  డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ మీద రాష్ట్రంలో చాలా మంది అల్లర్లు చేస్తున్నారు. అయినా కానీ పోలీసులు వెనక్కు తగ్గడం లేదు. వారు అనుకున్నదే చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పక్కా ప్లాన్ ప్రకారమే అరెస్ట్ చేశారని కొంత మంది వాదిస్తుండగా.. అటువంటిదేం లేదని మరికొంత మంది అంటున్నారు. ఏదేమైనా కానీ చంద్రబాబును మాత్రం అరెస్ట్ చేసి పోలీసులు పెద్ద పనికి పూనుకున్నారు. ఆయనను అరెస్ట్ చేశారని తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ వారి నిరసనను తెలియజేశారు. అటువంటిది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఒక వేళ ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా కానీ ఎవరూ పానిక్ కాకుండా ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ కేసులో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది.  విచార‌ణ స‌మ‌యంలో చంద్ర‌బాబు స‌హ‌క‌రించ‌డంలేద‌ని సీఐడీ తెలిపింది.

ముందే చెప్పిన బాబు

అరెస్టుకు కొన్ని రోజుల ముందే తనను అరెస్ట్ చేస్తారు కావొచ్చని చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పేశారు. కానీ అప్పుడు ఆయన వ్యాఖ్యలను అంతా లైట్ తీసుకున్నారు. తీరా కొద్ది రోజుల తర్వాత చూస్తే ఏపీ సీఐడీ పోలీసులు నిజంగానే చంద్రబాబును అరెస్ట్ చేసి చూపారు. ఈ అరెస్టుకు ముందు ఆయనకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని కూడా పేర్కొంది. ఆయన్ను ఈ కేసులో అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏపీ సీఐడీ అతడిని అరెస్ట్ చేసింది. దీంతో రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న టీడీపీ శ్రేణులు ఫైర్ అయ్యారు. 

ఓ వైపు సంబురాలు మరో వైపు ధర్నాలు

ఎవరైనా నాయకుడు అరెస్ట్ అయితే సంబురాలు లేదా ధర్నాలు జరగాలి కానీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం రెండు జరిగాయి. కొంత మంది అతడి అరెస్ట్ ను సెలబ్రేట్ చేసుకుంటే కొంత మంది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తూ ధర్నాలు చేశారు. కొంత మంది స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆత్మ సంతోషపడుతుందని సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆయన సహకరించట్లేదు: పోలీసులు 

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ చంద్రబాబును ఈ కేసులో నిందితుడు 37 (ఏ37)గా పేర్కొంది. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం, సీఐడీ  విచారణ సమయంలో చంద్రబాబు తమకు  సహకరించడం లేదని ఆరోపించింది. అంతే కాకుండా కొన్ని అంశాలు అతనికి గుర్తులేవని అస్పష్టంగా సమాధానం ఇచ్చినట్లు సీఐడీ అధికారులు కోర్టుకు విన్నవించారు. దీంతో తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించడం చాలా కష్టం అయిందని వారు అంటున్నారు. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన ఒక రోజు తర్వాత నాయుడుని ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీబీ కోర్టులో కట్టుదిట్టమైన భద్రత మధ్య హాజరుపరిచారు. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వమని సీఐడీ అధికారులు కోర్టును కోరుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాల నుంచి విజయవాడకు తీసుకెళ్లారు. ఇలా నంధ్యాల నుంచి తీసుకెళ్లేందుకు అతడికి హెలికాప్టర్ ను అరేంజ్ చేసినా కానీ చంద్రబాబు దానిని నిరాకరించారని సీఐడీ అధికారులు తెలిపారు. ఇక రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఉన్న కాన్వాయ్ ని టీడీపీ కార్యకర్తలు చాలాసార్లు అడ్డుకున్నారట. ఇది అధికారులను భయబ్రాంతులకు గురి చేసిందని సీఐడీ వాపోయింది. చట్టం ప్రకారం పని చేస్తున్న తమను ఇలా చేయడం సబబు కాదని అంది. 

అడిగిన ప్రశ్నలివే… 

ఈ కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబును నంధ్యాల నుంచి విజయవాడకు తీసుకువచ్చిన తర్వాత అధికారులు ఈ కేసు డైరీలోని సాక్ష్యంలో భాగమైన నోట్ ఫైల్స్ ఆధారంగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. కానీ ఇన్ని ప్రశ్నలు అడిగినా కానీ చంద్రబాబు అధికారుల ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పలేదట. అంతే కాకుండా కొన్ని ప్రశ్నలకు అతడు అస్పష్టంగా సమాధానం ఇచ్చినట్లు సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించిన రిపోర్ట్ లో తెలిపారు. అంతే కాకుండా అతడి న్యాయవాదిని సంప్రదించడానికి, అతని కుటుంబ సభ్యులను కలవడానికి మరియు ఆహారం మరియు ఫలహారాలు తీసుకోవడానికి అతని అభ్యర్థన మేరకు అతనికి విరామం ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కోట్లాది రూపాయల కుంభకోణంలో చంద్రబాబును శనివారం నంద్యాలలో ముందస్తు ఆపరేషన్‌లో భాగంగా సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలోని జ్ఞానపురంలో కల్యాణ మండపంలో అతడు బస చేస్తుండగా.. ఉదయం 6 గంటల సమయంలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారు చంద్రబాబు నాయుడే అని సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ తెలిపారు. కానీ ఈ కేసుకు చంద్రబాబుకు అసలు సంబంధం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చేసిన పాపం ఊరికే పోదని వైసీపీ నేతలు అంటున్నారు.