Chandrababu: చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)కు స్కిల్‌ డెవలెప్‌మెంట్ కేసు(Skill Development Case)లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌(Bail) మంజూరైంది. నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు(High Court) తీర్పు వెలువరించింది టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు(Skill Development Case)లో కోర్టు మధ్యంతర బెయిల్(Bail) మంజూరు చేసింది. నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు(Justice Tallapragada Mallikarjuna Rao) […]

Share:

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)కు స్కిల్‌ డెవలెప్‌మెంట్ కేసు(Skill Development Case)లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌(Bail) మంజూరైంది. నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు(High Court) తీర్పు వెలువరించింది

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు(Skill Development Case)లో కోర్టు మధ్యంతర బెయిల్(Bail) మంజూరు చేసింది. నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు(Justice Tallapragada Mallikarjuna Rao) తీర్పును వెల్లడించారు. చంద్రబాబుకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని.. కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని.. ఇతర సమస్యలు వెంటాడుతున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా(Siddharth Luthra) వాదనలు వినిపించారు. బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

Read More: Survey: డబ్బును ఖర్చు చేయాలా లేదా భవిష్యత్తు కోసం ఆదా చేయాలా?

అయితే చంద్రబాబు(Chandrababu)కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని.. కంటి ఆపరేషన్ ఇప్పుడు అవసరం లేదని.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ(CID) తరఫు లాయర్లు వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు. నవంబర్‌ 10న రెగ్యులర్‌ బెయిల్‌పై హైకోర్టు (High court)విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పుతో సెప్టెంబర్ 10 నుంచి జైల్లో ఉన్న చంద్రబాబుకు రిలీఫ్ దక్కింది.

చంద్రబాబును స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో సెప్టెంబర్ 9న సీఐడీ నంద్యాలలో అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 10న విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు(Rajamahendravaram Central Jail)కు తరలించారు. రెండు రోజుల పాటూ సీఐడీ(CID) అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.. ఆ తర్వాత ఏసీబీ కోర్టు(ACB Court) బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ మల్లికార్జునరావు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెల్లడించారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుపై తాజాగా మరో కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో సీఐడీ కేసు(CID Case) నమోదైంది. పీసీ ( Prevention of Corruption) యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు ఫైల్ చేశారు. ఐపీసీ సెక్షన్ 166,167,409,120(B), రెడ్ విత్ 34, సెక్షన్ 13(1)(d) రెడ్ విత్ 13(2) పిసి యాక్ట్, 1968 కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఏ 1 గా అప్పటి ఎక్సైజ్ కమీషనర్ శ్రీనివాస నరేష్, ఏ2 గా మాజీమంత్రి కొల్లు రవీంద్ర, ఏ3గా చంద్రబాబు నాయుడు పేర్లను చేర్చారు.

చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని సీఐడీ ఏసీబీ కోర్టు(ACB Court)కు మెమో రూపంలో తెలిపింది. మద్యం షాపులు, మద్యం కంపెనీలకు అక్రమ మార్గంలో చంద్రబాబు ప్రభుత్వం లబ్ది చేకూర్చిందనే అభియోగాలు ఉన్నాయి. మద్యం షాపులు (A4) ప్రివిలైజ్ ఫీజు తొలిగించింది అప్పటి ప్రభుత్వం.. ఈ నిర్ణయంతో ప్రతి ఏటా ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం కలిగించిందని.. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి దాదాపు భారీగా నష్టం జరిగిందన్నారు.

తెలంగాణలో ఉన్న ప్రివిలైజ్ ఫీజును ఏపీలో తొలగించారని.. అప్పట్లో లిక్కర్ సిండికేట్లతో కుమ్మక్కై చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం తగ్గించేసిందన్నారు. టీడీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి సంస్థ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీకి లబ్ది చేకూరుస్తూ వడ్డీ తగ్గించారని.. హైకోర్టు ఆదేశాలని అమలు చేయకుండా ఏకపక్షంగా వడ్డీ తగ్గించారన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం వడ్డీ తగ్గించిందని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత హడావిడిగా లిక్కర్ కంపెనీలకు భారీగా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

త్రిసభ్య కమిటీ సిఫార్సులు కి విరుద్ధంగా లిక్కర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చారని.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన పీఎంకే డిస్టీలరీస్ కి అనుమతి ఇఛ్చారన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కి చెందిన విశాఖ డిస్టీలరీస్‌కి అనుమతి ఇచ్చారన్నారు. అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కొన్ని బ్రాండ్లకు హడావుడిగా అనుమతులు ఇచ్చారన్నారు. అన్ని వ్యవహరాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తమ విచారణలో తేలిందన్నారు సీఐడీ.