Pneumonia: చైనాలో న్యూమోనియో కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం అలర్ట్..

అప్రమత్తమైన భారత ప్రభుత్వం..

Courtesy: Twitter

Share:

Pneumonia: చైనాలో(China) న్యుమోనియా కేసులు (Pneumonia Cases) వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం (Indian Govt.)అప్రమత్తమైంది. శ్వాసకోస వ్యాధులను (Respiratory diseases) అరికట్టేందు తీసుకుంటున్న చర్యలను కేంద్రం సమీక్షించడం మొదలుపెట్టింది. జిల్లా, రాష్ట్రాల స్థాయిలో ఇన్‌ఫ్లుయెంజా(Influenza), సారీ లాంటి ఇన్ఫెక్షన్ల పెరుగుదలపై ఓ కన్నేసి ఉంచాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు(Central directives) జారీ చేసింది.

చైనాలో చిన్నారుల్లో న్యుమోనియా కేసులు(Pneumonia Cases) వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం(Indian Govt.) అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది. ప్రజారోగ్యం, హాస్పిటళ్ల సన్నద్ధతను వెంటనే పునః పరిశీలించి, బలోపేతం చేయాలని ఆదేశించింది. శ్వాసకోస వ్యాధులను (Respiratory Diseases) అరికట్టడం కోసం తీసుకుంటున్న చర్యలను కేంద్రం సమీక్షను ప్రారంభించింది. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ఆరోగ్య సంరక్షణ (Health Care) మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ (Covid-19) సమయంలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించారో అదే తరహాలో ఉండాలని సూచించింది. ఇన్‌ఫ్లుయెంజా(Influenza) తరహా ఇన్ఫెక్షన్లు, సారీ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జాగ్రత్తగా గమనించాలని కేంద్రం ఆదేశించింది. ఇన్‌ఫ్లూయెంజా((Influenza)), మైకోప్లాస్మా న్యుమోనియా(Mycoplasma pneumoniae), సార్స్ కోవ్-2(Sars Cove-2) లాంటి ఇన్ఫెక్షన్ల వల్ల శ్వాసకోస సమస్యలు (Respiratory Diseases)పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

మరోవైపు శ్వాసకోస సమస్యలు(Respiratory diseases) పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఆరోగ్య శాఖ(Ministry of Health of China) సైతం అప్రమత్తమైంది. ఫీవర్ క్లినిక్‌లను పెంచాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. కోవిడ్-19(Covid -19)నిబంధనలను సడలించిన తర్వాత చైనాలో ఇదే తొలి చలి కాలం కావడంతో.. ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. చైనాలో గుర్తించని న్యుమోనియా కేసులు (Pneumonia Cases) వేగంగా పెరుగుతుండటంతో.. న్యుమోనియా కేసులకు సంబంధించి మరింత సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) గత వారం చైనాను కోరిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కరోనాకు(Covid-19) సంబంధించిన వివరాలను చైనా మిగతా ప్రపంచ దేశాలతో ముందుగానే పంచుకోని నేపథ్యంలో.. ఈసారి డబ్ల్యూహెచ్‌వో(WHO) అప్రమత్తమైంది. చైనా పరిస్థితులు ఇక్కడ సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఇతర ఏర్పాట్లపై సమీక్ష చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ సదుపాయాలు, టెస్టింగ్‌ కిట్లు వంటివి తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు(Respiratory diseases) , ఇన్ ఫ్లుయెంజా వైరస్‌లతో బాధపడేవారి నమూనాలను ల్యాబ్స్‌కు పంపించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ(Mansukh Mandaviya) సూచించారు. 

చైనా నేషనల్ హెల్త్ కమిషన్(China National Health Commission) నవంబర్ 13న ప్రెస్ కాన్ఫరెన్స్(Press conference) నిర్వహించింది. న్యుమోనియాతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో పిల్లలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బీజింగ్(Beijing), లియావోనింగ్ (Liaoning) లాంటి చైనా ఈశాన్య ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. బీజింగ్‌లోని ఓ ప్రధాన హాస్పిటల్‌లో రోజుకు సగటున 1200 మందికిపైగా ఎమర్జెన్సీ రూమ్‌లో(Emergency room) చేరుతున్నారని అల్ జజీరా పేర్కొంది. న్యుమోనియా బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా బీజింగ్‌లోని పలు స్కూళ్లలో విద్యార్థుల హాజరు తగ్గింది. ఆస్పత్రుల్లో చేరుతున్న పిల్లల్లో అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మంట, ఊపిరితిత్తుల్లో వాపు ఉన్నాయి. కరోనా మాదిరిగా వైరస్ కూడా ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ న్యుమోనియా బాధితుల్లో దగ్గు రాకపోవడం గమనార్హం. అలాగే ఊపిరితిత్తులలో చాలా ఎక్కువ జ్వరం, వాపు లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. చైనా న్యుమోనియా గురించిన పూర్తిస్థాయి సమాచారం బయటకు రానప్పటికీ.. వ్యాప్తిని బట్టి చూస్తే.. ఇది ఒకరి నుంచి మరొకరి కచ్చితంగా వస్తుందని అర్థమవుతుందని నిపుణులు అంటున్నారు.