వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మరో ట్విస్ట్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలుస్తూ, రాష్ట్రానికే కాదు దేశ వనరుల ఆదాయాలను కూడా పెంచుతూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని సంస్థలు బలోపేతం చేస్తామని.. ఇటీవల కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. […]

Share:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలుస్తూ, రాష్ట్రానికే కాదు దేశ వనరుల ఆదాయాలను కూడా పెంచుతూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని సంస్థలు బలోపేతం చేస్తామని.. ఇటీవల కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మరొక ట్విస్ట్ ఇచ్చింది. ప్రైవేటీకరణ ఆపడం లేదు అని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఊహించని విధంగా షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇటీవల కీలక ప్రకటన కూడా విడుదల చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం లేదు అంటూ ఉక్కు శాఖ కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోంది అని,  కేంద్ర ఉక్కు శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.  కంపెనీ సహకారంతో ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని ప్రభుత్వం వివరించింది. ఇకపోతే ఆర్‌ఐ‌ఎన్ ఎల్ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఆగిపోదని చెప్పుకొచ్చింది. ఇక ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా రిపోర్ట్‌లలో నిజం లేదు అంటూ స్పష్టం చేసింది.

స్టీల్ ప్లాంట్‌కు ప్రధాన సమస్యగా ఉన్న మైనింగ్ ఐరన్ ఓర్ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నాము అంటూ ఫగ్గన్ తెలిపారు. మరొకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా కేంద్రమంత్రి కొట్టి పారేశారు.  ఇక సింగరేణి ప్రతినిధులు స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక కోసం పర్యటిస్తున్న సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టే విషయంలో బిఆర్ఎస్ పార్టీది రాజకీయ ఎత్తుగడ మాత్రమే అంటూ కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగుతుందని చర్చ తెరపైకి వచ్చింది దీంతో కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా ప్రైవేటీకరణ ఆగిపోయింది అన్న వార్తలు కూడా ప్రచారం చేశాయి. అయితే ఈ విషయంలో రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిని మరొకసారి స్పష్టం చేసే ప్రయత్నం చేశాయి. కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని ఉక్కు శాఖ ప్రైవేటీకరణ ఆపలేదని ప్రకటన చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇకపోతే ప్రైవేటీకరణ రద్దు చేయాలి అని ఎప్పటినుంచో పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే కానీ ఇలా కేంద్రం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉండడంతో కార్మికులు మరింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రైవేటీకరణ ఆపాలి అని దీనివల్ల ఎవరికి ఉపయోగం? ప్రజలు నష్టపోతారు అంటూ కూడా చాలామంది వాదిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అటు కార్మికులు, ఇటు ప్రజలు,  రాష్ట్రాల అధినేతలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది మరింత హాట్ టాపిక్ గా మారింది.  ఏది ఏమైనా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంత మంచిది కాదనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. మరి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే దిశగా అడుగులు వెయ్యట్లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా కార్మికుల పనులకు  అంతరాయం కలగకుండా వారి కుటుంబాలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూసుకోవాలని కూడా అక్కడి కార్మికులు పోరాటం చేస్తున్నారు.

Tags :