రిలీఫ్ క్యాంప్స్ వ‌ల్లే ఈ రోగాలు

కండ్ల కళక, చర్మ వ్యాధులు ఎక్కువ అయ్యాయి :    ఉత్తర భారత దేశాన్ని వరదలు ముంచి ఎత్తుతుంది సంగతి మన అందరికీ తెలిసిందే. దీనివల్ల జనజీవనం స్తంభించి పోయింది. ఎక్కడ చూసిన కుండపోత వర్షాలతో అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వరదల వల్ల డెంగ్యూ , మలేరియా మరియు చికున్ గున్యా వంటి వ్యాధుల వ్యాప్తి చాలా తీవ్రవంతం అయ్యిందని విస్తృతంగా ప్రచారం అయ్యింది. ఇది అక్కడ నివసిస్తున్న ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేసింది. దీని […]

Share:

కండ్ల కళక, చర్మ వ్యాధులు ఎక్కువ అయ్యాయి :   

ఉత్తర భారత దేశాన్ని వరదలు ముంచి ఎత్తుతుంది సంగతి మన అందరికీ తెలిసిందే. దీనివల్ల జనజీవనం స్తంభించి పోయింది. ఎక్కడ చూసిన కుండపోత వర్షాలతో అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వరదల వల్ల డెంగ్యూ , మలేరియా మరియు చికున్ గున్యా వంటి వ్యాధుల వ్యాప్తి చాలా తీవ్రవంతం అయ్యిందని విస్తృతంగా ప్రచారం అయ్యింది. ఇది అక్కడ నివసిస్తున్న ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేసింది. దీని గురించి ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి శౌరభ్ భరద్వాజ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ వరదల వల్ల జనాల్లో డెంగ్యూ , మలేరియా, చికున్ గున్యా లాటి వ్యాధులు బాగా వ్యాప్తి చెందుతున్నాయని జనాల్లో భయాలు మొదలైనట్టు మా దృష్టికి వచ్చింది. అయితే రిలీఫ్ క్యాంప్స్ నుండి మాకు ఈ వ్యాధుల గురించి ఎలాంటి రిపోర్ట్ రాలేదు. ఎక్కువగా కండ్ల కళక  మరియు చర్మ వ్యాధుల కేసులు నమోదు అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు శౌరభ్ భరద్వాజ్.

రికార్డు స్థాయిలో నమోదైన యమునా నది వాటర్ లెవెల్స్ :

వరద తీవ్రత కాస్త తగ్గింది అని ఆనందించే లోపు మళ్ళీ యమునా నది వాటర్ లెవెల్స్ పెరిగింది అని వార్తలు వినిపిస్తున్నాయి , దీనికి మీరు ఏమంటారు అని శౌరభ్ ని మీడియా అడగగా,దానికి ఆయన సమాధానం చెప్తూ ‘గడిచిన 48 గంటల నుండి కుండపోత వర్షాలు పడుతూనే ఉండడం వల్ల డ్రైన్స్ మొత్తం నదిలో కలిసిపోతున్నాయి, అందువల్ల వాటర్ లెవెల్ బాగా పెరిగిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఢిల్లీ లో ప్రవహిస్తున్న యమునా నది వాటర్ లెవెల్ గత రాత్రి తో పోలిస్తే కాస్త పెరిగిందని శౌరభ్ భరద్వాజ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. గత రాత్రి వాటర్ లెవెల్ 205.52 మీటర్లు ఉండగా, ఇప్పుడు అది 205.58 మీటర్స్ కి ఎగబాకింది, అలాగే మేము  హట్నీకుద్ బ్యారేజి యొక్క రిపోర్ట్స్ కూడా అడిగాము అంటూ చెప్పుకొచ్చాడు. రిలీఫ్ క్యాంప్స్ ని సమర్థవతంగా నిర్వహించి ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తామని శౌరభ్ భరద్వాజ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

తాజ్ మహల్ గోడలకు తాకినా యమునా నది :

ఇది ఇలా ఉండగా గత వారం రోజుల నుండి యమునా నది పొంగి పొర్లుతుంది, బుధవారం నాటికి వాటర్ లెవెల్స్ 207.71 మీటర్స్ కి ఎగబాకి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది. 1978 వ సంవత్సరం ఇలాగే వరదలు వచ్చిన యమునా నది లో వాటర్ లెవెల్స్ 207.48 మీటర్లు నమోదు అయ్యింది. కానీ ఇప్పుడు ఆ రికార్డు కూడా బద్దలైంది. ఈ సంద్రాభంగా కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అతిషి మాట్లాడుతూ యమునా నది ఇంకా ఉదృత రూపం దాల్చినందున జనాలెవ్వరు కూడా రిలీఫ్ క్యాంప్స్ నుండి బయటకి వచ్చేందుకు వీలు లేదని, అక్కడే ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేసారు. హర్యానా వంటి ప్రాంతాలలో వర్ష తీవ్రత మరింత పెరిగిపోవడం వల్ల యమునా నది ఇంకా పొంగుతుందని ఈ సందర్భంగా అతిషి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఢిల్లీ లో ఇప్పటి వరకు 26 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 18 వేల మందిని పునరావాస కేంద్రాలలో ఉంచారు.  మరో భయాందోళనకు గురి చేసే విషయం ఏమిటంటే యమునా నది ఉదృతి పెరిగి తాజ్ మహల్ గోడలను తాకింది. గడిచిన 48 ఏళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడే వచ్చింది. తాజ్ మహల్ చుట్టూ ఉన్న తోటలు మొత్తం పూర్తిగా మునిగిపోయాయి. ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో సెన్సేషనల్ న్యూస్ గా మారిపోయింది.