విమానంలో తాగేసి త‌ల్లీకూతుళ్ల‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

ఇటీవలి కాలంలో విమాన ప్రయాణంలో గొడవలు ఎక్కువైపోయాయి. అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవ్వరు సర్దుకొని పోవడం లేదు. వారి కంపర్ట్ వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పక్క వారికి ఇబ్బందులు కలిగిస్తూ గొడవకు దిగుతున్నారు. కొంత మంది మహిళలతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌‌లైన్స్లో జరిగింది. ఓ వ్యక్తి ఫ్లైట్లో ఫుల్లుగా తాగి తల్లీకూతుళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విమాన సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదు. […]

Share:

ఇటీవలి కాలంలో విమాన ప్రయాణంలో గొడవలు ఎక్కువైపోయాయి. అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవ్వరు సర్దుకొని పోవడం లేదు. వారి కంపర్ట్ వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పక్క వారికి ఇబ్బందులు కలిగిస్తూ గొడవకు దిగుతున్నారు. కొంత మంది మహిళలతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌‌లైన్స్లో జరిగింది.

ఓ వ్యక్తి ఫ్లైట్లో ఫుల్లుగా తాగి తల్లీకూతుళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విమాన సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆ తల్లి ఆ ఎయిర్‌‌లైన్స్‌పై రూ.16 కోట్లకు దావా వేసింది. 2022 జులై 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. అసలేం జరిగిందటే.. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఎయిర్‌‌పోర్ట్ నుంచి గ్రీస్‌లోని ఏథెన్స్‌ కు అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌‌ లైన్స్‌ విమానం బయలుదేరింది. అందులో ఓ తల్లి తన మైనర్‌‌ కూతురితో కలిసి ఎక్కింది. ఫ్లైట్ టేకాఫ్‌ అవ్వగానే, వీళ్ల పక్కన కూర్చున్న ఓ వ్యక్తి ఎయిర్‌‌లైన్స్‌ సిబ్బంది సప్లై చేసిన మద్యం తాగడం మొదలుపెట్టాడు. వారు ఇచ్చిన కొద్దీ తాగుతూనే ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి పక్కనున్న మైనర్‌‌తో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బాలికను తాకడం, చేతులు వేయడం లాంటివి చేశాడు. దీంతో ఆ బాలిక తల్లికి విషయాన్ని చెప్పగా, ఆమె అతనికి వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో మరింత  రెచ్చిపోయిన ఆ వ్యక్తి.. తల్లీకూతుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఎక్కడపడితే అక్కడ పట్టుకోవడం, తాకడం చేశాడు.ఈ క్రమంలో  ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. గమనించిన తోటి ప్రయాణికులు.. ఆ

వ్యక్తిని ప్రశ్నించగా, వారిపై కూడా ఆ వ్యక్తి గట్టిగట్టిగా అరిచాడు. అతని ప్రవర్తనపై ఆ తల్లి ఫ్లైట్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. తమ సీటు మార్చాలని, ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పింది. అయినా ఫ్లైట్‌ సిబ్బంది పట్టించుకోలేదు. అంతేకాకుండా ఆ వ్యక్తి అడిగిన కొద్దీ వైన్‌ సప్లై చేశారు. దాదాపు 11 సార్లు అతనికి మందు సరఫరా చేశారు. ఫ్లైట్‌ టేకాఫ్‌ అయినప్పటి నుంచి ల్యాండ్‌ అయ్యేంత వరకు దాదాపు 9 గంటలు అతను మందు తాగుతూనే ఉన్నాడు. ఆ తల్లీకూతుళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు.

ఇంత జరుగుతున్నా ఫ్లైట్‌లో సిబ్బంది కానీ, తోటి ప్రయాణికులు గానీ ఏమీ చేయలేకపోయారు. 9 గంటల తర్వాత ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యాక ఏమీ ఎరగనట్టు ఆ వ్యక్తి విమానం దిగి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఫ్లైట్‌ సిబ్బంది కూడా అతనిపై పైఅధికారులకు ఎలాంటి కంప్లైట్‌ ఇవ్వలేదు. ఆ తల్లీకూతుళ్లకు క్షమాపణలు చెప్పి, కూపన్లు ఇచ్చి పంపించారు.

దీనిపై ఆగ్రహం చెందిన ఆ తల్లి న్యాయ పోరాటానికి దిగింది. ఏకంగా డెల్టా ఎయిర్‌‌లైన్స్‌ పైనే న్యూయార్క్‌ కోర్టులో దావా వేసింది. ఫ్లైట్‌లో తనపై, తన కూతురిపై ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నా విమాన సిబ్బంది పట్టించుకోలేదు. కనీసం అతనిపై పైఅధికారులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటన వల్ల తాము ఎంతో మానసిక వేదనకు గురయ్యాం. తమకు జరిగిన అన్యాయానికి రూ.16 కోట్ల పరిహారం ఇప్పించాలని కోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసింది.