వివాహితను ముస్లింగా మార్చడానికి యత్నించిన యువ‌కుడు

రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన మహిళ ఫ్రీ ఫైర్, గేమింగ్ యాప్‌లో తయ్యబ్‌ అనే ముస్లిం యువకుడును పరిచయం అవడం జరిగింది, వారు ఏడాదిన్నర క్రితం నుండి వాట్సాప్‌లో మాట్లాడటం ప్రారంభించారని ఆ వివాహిత కుటుంబ సభ్యులు తెలిపారు. దేవ్ అంకుర్ వాధావన్ మాటలలో:  వివాహిత హిందూ మహిళను గేమింగ్ యాప్‌లో ఒక ముస్లిం వ్యక్తి ఒక ముస్లిం గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన మహిళ ఫ్రీ […]

Share:

రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన మహిళ ఫ్రీ ఫైర్, గేమింగ్ యాప్‌లో తయ్యబ్‌ అనే ముస్లిం యువకుడును పరిచయం అవడం జరిగింది, వారు ఏడాదిన్నర క్రితం నుండి వాట్సాప్‌లో మాట్లాడటం ప్రారంభించారని ఆ వివాహిత కుటుంబ సభ్యులు తెలిపారు.

దేవ్ అంకుర్ వాధావన్ మాటలలో: 

వివాహిత హిందూ మహిళను గేమింగ్ యాప్‌లో ఒక ముస్లిం వ్యక్తి ఒక ముస్లిం గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన మహిళ ఫ్రీ ఫైర్, గేమింగ్ యాప్‌లో తయ్యబ్‌ అనే ముస్లిం యువకుడును పరిచయం అవడం జరిగింది, వారు ఏడాదిన్నర క్రితం నుండి వాట్సాప్‌లో మాట్లాడటం ప్రారంభించారని ఆ వివాహిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె భర్త ప్రస్తుతం విదేశాల్లో పనిచేస్తున్నారని వారు తెలిపారు.

అయితే వారు వాట్సప్ ద్వారా చాటింగ్ చేస్తున్నప్పుడు, తయ్యబ్ తాను అలీఘర్ నివాసి అని మరియు అక్కడ తనకు గార్మెంట్స్ షాప్ ఉందని ఈ వివాహతకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత, అతను ఆమెకు నమాజ్ ఎలా చేయాలో నేర్పించడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడితో చాటింగ్ చేస్తున్న మహిళ కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. అయితే అప్పుడు ఆ వివాహిత కుటుంబీకులు తయ్యబ్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అది స్విచ్ఛాఫ్‌లో ఉంది. తరువాత, అతని ఫోన్ ద్వారా మరొక వ్యక్తి బహుశా అతని స్నేహితుడు అయ్యుండొచ్చు, అతను మాట్లాడుతూ, తన స్నేహితుడు చెడ్డ వ్యక్తి కాదని అంతేకాకుండా వేరే వాళ్ళను ముస్లిం గా మార్చడానికి తను తను ఎటువంటి ప్రయత్నాలు చేయడు అని చెప్పుకొచ్చాడు.

మహిళ కుటుంబీకులు పోలీసు స్టేషన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, తయ్యబ్, తనతో మాట్లాడుతున్న ఆ వివాహతకు వేరే పేరు కూడా పెట్టడని మరియు నమాజ్ ఎలా చేయాలో యూట్యూబ్ లింక్‌లను పంపాడని తెలిసింది. హిందూ ఆచారాలను పాటించద్దని, అంతేకాకుండా మెడలో ఆభరణాలు మరియు బొట్టు కూడా పెట్టుకోవద్దని అతను ఆ వివాహితను కోరినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. అయితే, కుటుంబ సభ్యులు ఇప్పుడు ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని సికర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కరణ్ శర్మకు తెలిపారు.

ఇండియా టుడే టీవీ ఆ మహిళ సోదరుడితో మాట్లాడింది, అయితే అప్పుడు ఆ వివాహిత సోదరుడు చెప్పిన సమాచారం ప్రకారం, వారికి ఈ కేసును కొనసాగించడంలో ఆసక్తి లేదని తెలిపారు.

“కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆ వ్యక్తి తన సోదరితో చాటింగ్ చేసేవాడని. అంతేకాకుండా తన సోదరిని ఇస్లామిక్ మతంలోకి మారమని కోరినట్లు దాని గురించి చాలా సార్లు అడిగినట్లు, అంతేకాకుండా, హిందూ మతానికి సంబంధించిన వాటిని పాటించొద్దని ప్రేరేపించినట్లు, వ్యక్తి కోరారు. గేమింగ్ యాప్ ద్వారా వారిద్దరికీ పరిచయం ఏర్పడిందని. అంతేకాకుండా తర్వాత వాట్సాప్ లో కూడా చాటింగ్ చేసుకునేవారిని. కానీ ఇది ఇంతటితో ముగియాలని, ఎలాంటి అవాంఛిత సందర్భం ఎదురు కాకూడదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు” అని శర్మ గతంలో చెప్పారు. 

అయితే కేసు వాపసు తీసుకోవడం విషయంలో పూర్తిగా కుటుంబ సభ్యుల నిర్ణయం కారణమని తెలిపారు. కానీ ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా చూసుకోవాలని, తెలియని వ్యక్తులతో చాటింగ్ అనేది కొంత వరకు మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలియని వ్యక్తి ఉద్దేశం మనం గ్రహించలేము కాబట్టి, గేమింగ్ ఆప్ ద్వారా కాంటాక్ట్ అవడం కరెక్ట్ కాదు అని, తెలియని వారికి తమ ఫోన్ నెంబర్లు అందించకూడదని మరొక సారి గుర్తు చేశారు.