నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2023  బిల్లుకి  కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం

భారత దేశ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తలపెట్టిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2023 వ సంవత్సరం కి గాను ప్రవేశపెట్టారు. దీనికి కేంద్ర మంత్రివర్గ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కారణంగా భారతదేశం లో ఉన్న ఎన్నో విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో ఉన్నటువంటి ప్రయోగశాలల్లో కావాల్సినంత సహకారం దక్కనుంది. ఈ ఫౌండేషన్ స్థాపనకు మరియు దానిని సమర్థవతంగా ముందుకు నడిపేందుకు 2023 వ సంవత్సరం నుండి 2028 వ సంవత్సరం వరకు 50000 […]

Share:

భారత దేశ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తలపెట్టిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2023 వ సంవత్సరం కి గాను ప్రవేశపెట్టారు. దీనికి కేంద్ర మంత్రివర్గ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కారణంగా భారతదేశం లో ఉన్న ఎన్నో విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో ఉన్నటువంటి ప్రయోగశాలల్లో కావాల్సినంత సహకారం దక్కనుంది. ఈ ఫౌండేషన్ స్థాపనకు మరియు దానిని సమర్థవతంగా ముందుకు నడిపేందుకు 2023 వ సంవత్సరం నుండి 2028 వ సంవత్సరం వరకు 50000 కోట్ల రూపాయిల బడ్జెట్ ని కేటాయించారు. బడ్జెట్ లో కేటాయించిన ఈ 50000 కోట్ల రూపాయలలో 36000 కోట్ల రూపాయిలు ప్రముఖ ఇండస్ట్రీస్ మరియు ఫిలాంట్రాఫిస్ట్స్ పెట్టుబడులు పెట్టనున్నారు. మిగిలిన 14000 కోట్ల రూపాయిలు ప్రభుత్వం భరిస్తుందట. ఈ సందర్భంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడిన కొన్ని ముఖ్యమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

2018 వ సంవత్సరం లోనే ఈ ఆలోచనకి పునాది వేసిన ప్రధాన మంత్రి :

ఆయన మాట్లాడుతూ ‘ ఈ ఫౌండేషన్ ద్వారా రీసెర్చ్ ఏకోసిస్టమ్ మన దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతాయి.ఇది మన ఇండియన్ ప్రభుత్వం తీసుకున్న ఒక విప్లవాత్మక చర్య’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఆలోచన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి 2018 వ సంవత్సరం లోనే వచ్చింది. ప్రతీ విద్యార్థికి చదువుకోవడం ద్వారా వచ్చే జ్ఞానం కంటే కూడా, ప్రాక్టికల్ గా చేసే ప్రయోగాల వల్ల అత్యధిక జ్ఞానం వస్తుందని, ఆ జ్ఞానం చిరకాలం ఆ విద్యార్థి కి గుర్తుండిపోతుందని ప్రధాన మంత్రి బలంగా నమ్ముతాడు. దీనిని ప్రమోట్ చెయ్యడం కోసం ఒక ఏజెన్సీ లాంటిది స్థాపిస్తే ఎంతో బాగుంటుందని ఆయన ఆనాడే ప్రతిపాదించాడు. అది కార్య రూపం దాల్చి ఒక కొలిక్కి రావడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది. 2020 వ సంవత్సరం నుండి 2022 వరకు ఈ ఆలోచన ని రూపుదిద్దెందుకు సమయం తీసుకున్నారు.

ఈ ఫౌండేషన్ లో ఎన్నో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాబోతున్నాయి. దీనిమీద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే చర్చలు జరిపి సఫలీకృతం చేసాడట. ఈ ఫౌండేషన్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల వాళ్లకి ఎలాంటి లాభాలు కలగనున్నాయో ఒక రూట్ మ్యాప్ ని వివరించాడట. ఈ విధంగా తూచా తప్పకుండ ఫాలో అయితే మీకు లాభాలు వస్తాయి, ఫౌండేషన్ అభివృద్ధి చెందుతుంది, దేశం లో ఉన్న అన్ని వేలాది కళాశాలల్లో ప్రయోగాలకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం సమకూరుతుంది అంటూ తన క్యాబినెట్ మినిస్టర్స్ తో కలిసి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి ఒప్పించాడట. ఇక నుండి ఇంజనీరింగ్ చదవాలి అనుకునే విద్యార్థులకు స్వర్ణ యుగం ప్రారంభం అయ్యినట్టే చెప్పొచ్చు. సరైన ఫ్యాకల్టీ తో కళాశాలల్లో ఈ ప్రాక్టికల్ జ్ఞానం ని విద్యార్థులకు అందిస్తే, వాళ్ళు ఎంచుకున్న కోర్స్ లో ఉన్నతశిఖరాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వారి భవిష్యత్తు రాబొయ్యే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించి భారత దేశానికీ కీర్తి ప్రతిష్టలు తెచ్చే స్థాయికి ఎదుగుతారు  అనడం లో ఎలాంటి సందేహం లేదు. మరి ఇది ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రతీ రాష్ట్రము లో పకడ్బందీగా జరుగుతుందా?, లేదా అనేది రాబొయ్యే రోజుల్లో తెలుస్తుంది. అయితే ఈ బిల్లు భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి రాకపోయినా కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి.