వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 100 సీట్లు: కేటీఆర్

టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. పార్టీ పేరులో మార్పు వచ్చినా పార్టీ DNA, పార్టీ గుర్తు మారలేదని ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 90 నుంచి 100 సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త‌మ సీఎం అభ్యర్థి కే చంద్రశేఖరరావు అని.. కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ తమ సీఎం అభ్యర్థులను ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ […]

Share:

టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. పార్టీ పేరులో మార్పు వచ్చినా పార్టీ DNA, పార్టీ గుర్తు మారలేదని ఈ

సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 90 నుంచి 100 సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త‌మ సీఎం అభ్యర్థి కే చంద్రశేఖరరావు అని.. కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ తమ సీఎం అభ్యర్థులను ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. త్వరగా ముఖ్య మంత్రి అభ్య‌ర్థుల పేర్లు వెల్లడించడం ద్వారా ప్రజలు విశ్లేషించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. బీజేపీ 100 సీట్లలో డిపాజిట్లు కోల్పోతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దీనోత్సవ సంద‌ర్భంగా 279 మంది ప్రజాప్రతినిధులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పార్టీ పరిపాలనా పరమైన తీర్మానాలు, రాజకీయ తీర్మానాల గురించి చర్చించడం జరిగింది. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సమ్మేళనాలు మెుదలు కానున్నాయి. దీని తర్వాత జూన్ నుంచి యువజన సమ్మేళనాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ఉపాధి అవకాశాలను యువతకు వివరించనున్నారు. 

కాగా మా నాయకుడు సీఎం కేసీఆర్‌కి ఇంకా 70 ఏళ్లు నిండలేదని.. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్‌కు 80 ఏళ్లు ఉన్నాయన్నారు. బైడెన్ మరోసారి పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ 70 ఏళ్లు ఉన్న మా నాయకుడు సీఎం కేసిఆర్ ఎందుకు రిటైర్‌మెంట్ తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్గదర్శం అన్నారు.. ఒక సీఎం వరుసగా మూడుసార్లు గెలిస్తే యావత్ దేశం మెుత్తం గమనిస్తుందన్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేస్తారని, కాగా అది ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే చెప్పగలదని కేటీఆర్ తెలిపారు. కాగా మహారాష్ట్ర హైదరాబాద్ స్టేట్‌లో భాగమ‌ని.. అనేక తెలుగు సంతతికి చెందిన కుటుంబాలు మహ రాష్ట్రంలో నివసిస్తున్నాయన్నారు. పైగా రైతులు, యువత, అన్ని వర్గాలు తెలంగాణ మోడల్‌ పాలన పట్ల ఆకట్టుకుంటున్నాయని చెప్పారు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ (ఎస్) తరపున బీఆర్‌ఎస్ ప్రచారం నిర్వహించి, ఆ తర్వాత ఆంధ్రలో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు.. పొరుగు రాష్ట్రాలపై దృష్టి సారించి హైదరాబాద్‌కు కేంద్రబిందువు అవుతుందన్నారు.

కాగా మీడియా సమక్షంలోనే ఇద్దరు దోషులను హత్యపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సిట్‌ను ఏర్పాటు చేశారన్నారు. యుపి ప్రభుత్వ సిట్ న్యాయంగా, స్వాగతించగలిగినప్పుడు, తెలంగాణ ప్రభుత్వ సిట్ ఎలా స్వాగతిస్తారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా చేశారన్నారు . వివిధ రాష్ట్రాల్లో బీజేపీ హయాంలో 105 ప్రశ్నపత్రాలు లీక్‌లు జరిగాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు . కాగా బీజేపి హయంలో ఏ ఒక్క మంత్రిని గాని అధికారిని తొలగించలేదన్నారు. పైగా అభ్యర్థులకు పరిహారం ఇవ్వలేదన్నారు. కాగా ఇలాంటి డిమాండ్లు తెలంగాణలో ఎందుకు పెట్టాలని కేటీఆర్ ప్రతిపక్షలపై విరుచుకపడ్డారు.

అటు ప్రధాని నరేంద్ర మోదీ , అదానీ గ్రూప్‌ల మధ్య అనుబంధాన్ని వివరించడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని మంత్రి కేటీ రామారావు అన్నారు. బీజేపీ ప్రభుత్వం అదానీకి ప్రత్యేక కేటాయింపుల ప్రభావం సామాన్యుల జీవితాలపై ఎలా ప్రభావం చూపుతుందో ప్రజలకు తెలియజేయకపోతే దోపిడీ ఇలాగే కొనసాగుతుందన్నారు. జైపూర్‌ ఎయిర్‌పోర్టును టేకోవర్ చేసే సమయంలో అదానీ గ్రూప్‌కు జీఎస్‌టీ లేదని, పాలు, పెరుగుపై సామాన్యులు జీఎస్‌టీ చెల్లించడం విచిత్రంగా ఉందన్నారు. అటువంటి నియమాలను ఎలా సమర్థించవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు.