నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న BRS: కాంగ్రెస్ 

BRS ప్రభుత్వం ప్రతి నిరుద్యోగికి 55 నెలలకు రూ. 1.65 లక్షలు నిరుద్యోగ భృతి రూపంలో 2018లో అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నీ నిలబెట్టుకోకపోగా ఇప్పుడు దానికి బదులుగా, నిరుద్యోగులకు రూ.1 లక్ష రుణాన్ని అందిస్తోంది. ఇది ఎంతవరకు న్యాయం అంటూ నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిలదీసిన కాంగ్రెస్:  గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ ,ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలు నిరుద్యోగులను మోసం చేసి నిరాశకు […]

Share:

BRS ప్రభుత్వం ప్రతి నిరుద్యోగికి 55 నెలలకు రూ. 1.65 లక్షలు నిరుద్యోగ భృతి రూపంలో 2018లో అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నీ నిలబెట్టుకోకపోగా ఇప్పుడు దానికి బదులుగా, నిరుద్యోగులకు రూ.1 లక్ష రుణాన్ని అందిస్తోంది. ఇది ఎంతవరకు న్యాయం అంటూ నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

నిలదీసిన కాంగ్రెస్: 

గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ ,ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలు నిరుద్యోగులను మోసం చేసి నిరాశకు గురిచేశాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు లేని యువకులకు సహాయం చేయడానికి ఉద్దేశించిన వాగ్దానం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు. బదులుగా, BRS నాయకత్వం, నిరుద్యోగులకు అందువలసిన వాటిని పక్కన పెట్టి, ప్రస్తుతం రూ. 1 లక్ష లోను పై దృష్టి పెడుతోందని, కాంగ్రెస్ అధికారి పేర్కొన్నాడు.

గత తొమ్మిదేళ్లుగా, యువకుల నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి BRS పరిపాలన ఏమీ చేయలేదని tpcc ప్రతినిధి పేర్కొన్నారు. దళిత బంధు, బీసీలు, మైనారిటీలకు రుణాలు వంటి రుణాల వాగ్దానాలతో బీఆర్‌ఎస్‌ యంత్రాంగం ప్రజలందరి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందని.. ఇవి వచ్చే ఎలక్షన్లో కోసం వ్యూహాలు మాత్రమే అన్నారు. కేవలం లక్ష రూపాయల లోను విషయంలో మాత్రమే BRS దృష్టి పెడుతున్నట్లు, నిరుద్యోగుల గురించి అసలు పట్టించుకోవట్లేదు అని కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు.

నిజాముద్దీన్ ప్రకారం, 17 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడానికి 2021లో దళిత బంధు పథకం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీదగా ప్రకటించడం జరిగింది. కేవలం 17,000 కంటే తక్కువ కుటుంబాలకు హామీ ఇచ్చిన విధంగా సహాయం అందిందని ఆయన పేర్కొన్నారు. 

ఇటీవల కేసీఆర్ కు లేఖ రాసిన కాంగ్రెస్ నేత: 

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు బహిరంగ లేఖ రాస్తూ, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలే ఉద్యమ ప్రధానాంశాలుగ ఉన్నప్పటికీ ఎన్నో సమస్యలు వస్తూనే ఉన్నాయని. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా అలాగే వదిలేశారని వాక్యానించారు. వృథా ఖర్చులతో రాష్ట్రం అప్పులపాలు అయిందని, ఉద్యోగాల గురించి చెప్పాల్సిన అవసరం లేదని, అసలు తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో ఎన్ని నోటిఫికేషన్ల విషయంలో నిర్లక్ష్యమే కనిపిస్తుందని స్పష్టం చేశారు.

మొదటి టెట్ మే 22, 2016 న జరిగింది. పేపర్-1కి 88,158 మంది హాజరుకాగా, 48,278 మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్-2 రాసిన 2,51,924 మందిలో 63,079 మంది ఉత్తీర్ణులయ్యారు. 

ప్రతి సంవత్సరం 12,500 మంది DEd చదువుతున్నారు, 15,000 మంది BEd కోర్సును పూర్తి చేస్తున్నారు. 2020 డిసెంబర్‌లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా ఇప్పటికీ నోటిఫికేషన్ రాకపోవడం గమనార్హం అన్నారు ఎంపీ. ఐదేళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు కాలేదు. సమైక్య రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్‌ పరీక్ష నిర్వహించి రెండేళ్లకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. అసలు యువత పరీక్షలకు ప్రిపేర్ అవడమే తప్పిస్తే ఉద్యోగాలు చేసేది ఎప్పుడు అంటూ నిలదీశారు. యువతకు వయసు అయిపోతుంది కానీ నోటిఫికేషన్లు మాత్రం విడుదల కావట్లేదు అని వాపోయారు ఎంపీ. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని నోటిఫికేషన్లు జారీ చేయాలని, వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.