హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డానికి కార‌ణం బీఆర్ఎస్

హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డానికి కార‌ణం బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని అన్నారు బీజేపీ ఎంపీ కిష‌న్ రెడ్డి. అయితే ప్రస్తుతం ఏ పార్టీలో చూసినప్పటికీ రాబోయే ఎన్నికల సందర్భంగా కొన్ని మార్పులు అదేవిధంగా సన్నాహాలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి తమ ఎంపీలకు ప్రజలకు చేరువ కావాలంటూ, ప్రజల సమస్యలను దగ్గరగా పరిష్కరించాలి అంటూ బిజెపి ఎంపీలను మరింత ఉత్తేజపరిచారు. మరోపక్క భారతీయ జనతా పార్టీ ఆగస్టు 3 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ మరియు కౌన్సిల్ సెషన్‌లో ప్రజలకు చేసిన […]

Share:

హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డానికి కార‌ణం బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని అన్నారు బీజేపీ ఎంపీ కిష‌న్ రెడ్డి. అయితే ప్రస్తుతం ఏ పార్టీలో చూసినప్పటికీ రాబోయే ఎన్నికల సందర్భంగా కొన్ని మార్పులు అదేవిధంగా సన్నాహాలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి తమ ఎంపీలకు ప్రజలకు చేరువ కావాలంటూ, ప్రజల సమస్యలను దగ్గరగా పరిష్కరించాలి అంటూ బిజెపి ఎంపీలను మరింత ఉత్తేజపరిచారు. మరోపక్క భారతీయ జనతా పార్టీ ఆగస్టు 3 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ మరియు కౌన్సిల్ సెషన్‌లో ప్రజలకు చేసిన వాగ్దానాలకు BRS సమాధానం చెప్పాలని, ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయిన BRS బాధ్యత వహించాలి అని ఆయన అన్నారు కిహన్. అన్తకాకుండా, అకాల వరదల వల్ల ప్రభావితమైన ప్రజల సమస్యలతో ఉన్నవారికి సహాయం చేయడానికి, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని బిజెపి కూడా డిమాండ్ చేస్తుంది.

సన్నాహాలు సిద్ధం: 

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, ఎం. రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్‌. రెడ్డి పార్టీ కార్యాలయంలో బిజెపి శాసనసభ్యులు లేవనెత్తే కొన్ని ముఖ్యమైన అంశాలను, శాసనసభ సమావేశాలలో పార్టీ వ్యూహంపై చర్చించారు. మరోపక్క గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ బిజెపి టిక్కెట్‌పై గెలిచి గత సంవత్సరం పార్టీ నుండి సస్పెండ్ ప్పటినుంచి సమావేశాలకు హాజరు కావట్లేనట్లు తెలుస్తోంది.

అసెంబ్లీలో బీజేపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, తర్వాత జరగబోయే సమావేశమే రాష్ట్ర శాసనసభకు చివరి సమావేశం అవ్వచ్చు. అంతే కాకుండా ప్రస్తుతం ఫ్లోర్ లీడర్‌ను, పార్టీ నియమిస్తుందో లేదో ఇప్పటికి స్పష్టంగా తెలిలేదు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ స్థానంపై ఆసక్తి చూపినప్పటికీ, ఇతర పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ శాసనసభలో సీనియర్ అయినందున, బిజెపి నాయకత్వం ఫ్లోర్ లీడర్‌ను ప్రకటిస్తుందో లేదో స్పష్టంగా లేనట్లే తెలుస్తోంది. 

కిషన్ రెడ్డి గురించి మరింత: 

జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో కొనసాగిన భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కిషన్ రెడ్డిని 2023 జులై 4న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది.

మరో పక్క ఎంపీలకు సలహా ఇచ్చిన మోదీ: 

ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందర్భంగా బిజెపిలో ఎలక్షన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ తమ ఎన్డీఏ ఎంపీలకు సక్సెస్ మంత్ర సూచించినట్లు ఉత్తరప్రదేశ్ లో జరిగిన సమావేశమే తెలియజేస్తోంది. ప్రస్తుతం ప్రజలకు దగ్గరగా ఉన్న బిజెపి మరింత దగ్గర అవ్వాలని, భారతదేశ ప్రధానమంత్రి మోదీ తమ ఎన్డీఏ ఎంపీలకు సలహా ఇచ్చారు. అంతేకాకుండా, ఇతరుల మాదిరిగా ఎన్ డి ఏ అన్నది స్వార్థపూరితమైనది కాదని, ఇతరుల కోసం సహాయం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. వీలైతే సమస్యలను తెలుసుకోవడానికి ప్రజలు సమకూరే సమావేశాలలో కూడా పాల్గొనాల్సిన అవసరం ఉందని ఎంపీలకు మోదీ సూచించారు. అంతేకాకుండా వీలైతే పెళ్లిళ్లకు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని, ప్రజలతో ఎంత కనెక్ట్ అయితే వారి సమస్యలు అంత ఈజీగా పరిష్కరించవచ్చు అని అభిప్రాయపడ్డారు.