కేసీఆర్‌ను ప్రశంసించిన బ్రిటన్ ఎంపీ

అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను బ్రిటన్ ఎంపీ అభినందించారు. భారీ ఎత్తైనా అంబేద్కర్ విగ్రహంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు గాను వివిధ దేశాల నుండి ప్రముఖులచే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రశంసలు పొందుతున్నారు. భారతదేశం గర్వించే రీతిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని ఇటీవలే హైదరాబాద్‌ నడిబొడ్డున ఆవిషరించటంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అటు ప్రపంచ వ్యాప్తంగా ఈ మహా విగ్రహావిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంటుంది.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల […]

Share:

అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను బ్రిటన్ ఎంపీ అభినందించారు. భారీ ఎత్తైనా అంబేద్కర్ విగ్రహంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు గాను వివిధ దేశాల నుండి ప్రముఖులచే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రశంసలు పొందుతున్నారు. భారతదేశం గర్వించే రీతిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని ఇటీవలే హైదరాబాద్‌ నడిబొడ్డున ఆవిషరించటంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అటు ప్రపంచ వ్యాప్తంగా ఈ మహా విగ్రహావిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంటుంది..

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సామాజిక సమానత్వ దార్శనికత దేశ విదేశాల మేధావులు, సీనియర్‌ రాజకీయ వేత్తల ప్రశంసలు అందుకొంటున్నది. భారత్ గర్వించే రీతిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ 125 అడుగుల అతి పెద్ద మహా విగ్రహాన్ని ఇటీవలే భాగ్యనగర్ నడిబొడ్డున ఆవిష్కరించడంతో సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అటు దేశంలో ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఈ మహా విగ్రహావిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహోన్నత దార్శనికతను కొనియాడుతూ… బ్రిటన్‌ ఎంపీ వీరేంద్ర శర్మ స్వయంగా ఉత్తరం రాశారు.  UK లోని సౌతాల్‌లో ఉన్న ఈలింగ్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. బ్రిటిష్‌ ఇండియన్‌ సంతతికి చెందిన 76 ఏండ్ల సీనియర్‌ రాజకీయ నాయకుడు వీరేంద్ర శర్మ మెయిల్‌ ద్వారా సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాశారు.

అంబేదర్‌ మహా విగ్రహాన్ని నిర్మించి ఆష్కరించడం గొప్ప విషయం. ఇది తెలంగాణ రాష్ట్రానికి, మీకు కూడా గర్వకారణం. మీ స్ఫూర్తి అద్భుతం. అంబేద్కర్ పుట్టుక గురించి, వారు చేసిన మంచి కృషి, వారి చరిత్రే భారతదేశ చరిత్రగా రూపుదిద్దుకుంది. ఇటు యూకేలోనూ, అటు ఇండియాలోనూ నాటి పరిస్థితుల్లో అంబేద్కర్ ప్రదర్శించిన సహనం, సమానత్వం, సమాజాన్ని నడిపించేందుకు భారత రాజ్యాంగాన్ని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ రూపొందించారు.. 

రాజ్యాంగ నిర్మాతగా, పితామహుడిగా భారతదేశ పురోగమనానికి కొనసాగింపుగానే వారు రాజ్యాంగ్యాన్ని నిర్మించారు. భవిష్యత్తు తరాల కోసం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేదర్‌ ప్రదర్శించిన దార్శనికతను మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. యూకేలోని తెలంగాణకు చెందిన సామాజిక సంస్థలతో కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నాను. త్వరలో మిమ్మల్ని బ్రిటన్‌లో కలిసేందుకు ఎదురుచూస్తున్నాను. బిఆర్ అంబేద్కర్‌ విగ్రహం తయారీ, నేపథ్యం, ఆవిష్కరణపై మీ అనుభవసారాన్ని తెలుసుకోవాలని ఆశిస్తున్నానని ఎంపి మెయిల్ ద్వారా తెలిపారు.

ప్రస్తుతం ఎంపీగా ఉన్న వీరేంద్రశర్మ ఏప్రిల్‌ 5న, 1947 పంజాబ్‌లో ఉన్న మంధానీలో జన్మించారు. 1968వ సంవత్సరంలో బ్రిటన్‌‌ కు వలస వెళ్లిన శర్మ, బతుకు సాగించడం కోసం అక్కడ బస్‌ కండక్టర్‌గా కూడా ఉద్యోగం చేశారు. ఇక లండన్‌ స్కూల్ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ఉన్నత చదువును అభ్యసించిన ఆయన.. 2007 సంవత్సరంలో ఈలింగ్‌ నుంచి MPగా గెలిచారు, ఇంకా ఇప్పటికీ అదే ప్లేస్ నుండి హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభ్యుడిగా ఉన్నారు. ఇక లేబర్‌ పార్టీలో జాతి సమానత్వ డిపార్ట్ మెంట్ కి నేషనల్ లీడర్ గా కూడా పని చేశారు. అటు 1982-2010 వరకు లండన్‌ బరో ఆఫ్‌ ఈలింగ్‌ కౌన్సిలర్‌గా పనిచేయడం జరిగింది.. అక్కడే మేయర్‌గా కూడా సేవలందించారు. అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.